Saturday, February 10, 2007

భార్యాభర్తలు--1961




సంగీతం::సాలూరి రాజేశ్వరరావు గారు
రచన::కోసరాజు
గానం::ఘంటసాల,జిక్కి


పల్లవి::

జో జో జో జో జో జో
చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి
చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి
దుక్కలా నీ తండ్రి ఊడిపడ్డాడు
చక్కని నా బాబు జో జో
చల్లని నా తండ్రి జో జో

చరణం::1

రెక్కలు కట్టుకొని రివ్వున వాలాను
రెక్కలు కట్టుకొని రివ్వున వాలాను
రేయింబగళ్ళు నిను తలచుకొని మురిసాను
మురిపాల మొలకవు జోజో
ముద్దులూరించేవు జోజో
చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి
చుక్కలా నీ తండ్రి ఊడిపడ్డాడు
చక్కని నా బాబు జో జో
చల్లని నా తండ్రి జో జో

చరణం::2

కాకితో ఒకసారి కబురంపినావని
కాకితో ఒకసారి కబురంపినావని
కలలోన నిను చాలా కలవరించాను
కాశికి పోయినా గంగలో మునిగినా
నిను మరువకున్నాను జో జో
నిలువలేకున్నాను జో జో
చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి
చుక్కలా నీ తండ్రి ఊడిపడ్డాడు
చక్కని నా బాబు జో జో
చల్లని నా తండ్రి జో జో ఒరేయ్

చరణం::3

ఏ ఊళ్ళు తిరిగావో ఏమేమి చేసావో
ఏ ఊళ్ళు తిరిగావో ఏమేమి చేసావో
ఎవరితో సరదాలు తీర్చుకొచ్చావో
ఇంత చక్కని రంభ ఇంటిలో ఉండగా
ఇతరులతో పని ఏమి జోజో
ఇది మంచి సమయము జోజో