Friday, January 30, 2009

రాజాధి రాజ ~~ 1980


సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు

అల్లిబిల్లి..అమ్మాయి..అందచందలున్నాయి
వున్నవన్ని మెచ్చాను వచ్చానులే..ఉమ్మ్..
అల్లిబిల్లి అమ్మాయి అందచందలున్నాయి
వున్నవన్ని మెచ్చాను వచ్చానులే
నాజూకులూ..దాచేసినా..నే దోచగా..రానా..నా..
అల్లిబిల్లి అమ్మాయి అందచందలున్నాయి
వున్నవన్ని మెచ్చాను వచ్చానులే


లలనా..తగనా..వలలో..పడనా..నా..
లలనా...తగనా...వలలో పడనా....
నీ హంసల నడకల అడుగుల వెంబడి
చిలకల పలుకుల కిలకిల వింటు
గిర గిర గిర చుట్టు తిరిగెనె..నె..
మొన్న నిన్ను చూసాను..నిన్న కన్ను వేసాను
నేడు దారి కాచాను..రేపు చూసుకో..కోవ్..


హోయ్..మండిపోతుంది నా తాపమే..ఎండిపోతుంది నా గొంతుకే..
హ్హా..హ్హా..హ్హా..హ్హా..ఓ..ఓ..ఓ..ఓ..
మండిపోతుంది నా తాపమే..ఎండిపోతుంది నా గొంతుకే
ఈ దాహమూ..నీ మోహమే..తీర్చాలిలే రా..వే..మ్మ్
ఉడుము పట్టు మా పట్టు..ఊడగొడతా నీ బెట్టు
నాకు తెలుసు నీ గుట్టు..ఉ కొట్టవే..ఓ..వ్...


మిడిసి..పడకే..ఒడిసి పడతా..తా..
మిడిసీ..పడకే..ఏ..ఏ..ఒడిసీ పడతా..తా..తా..తా..తా..
నీ ముందరకాళ్ళకి బంధం వేస్తా..ముక్కుకు తాడు ఠక్కున వేస్తా..
ఎక్కడికెళితే అక్కడికోస్తానే..మ్మ్హ్..హ్హా..
కల్ల బోల్లి కోపాల..కస్సుబుస్సు అనబోకే..చిర్రుబుర్రు అంటున్న సింగారివే..
నాజూకులూ..దాచేసినా..నే దోచగా..రా..న..
అల్లిబిల్లి అమ్మాయి అందచందలున్నాయి
వున్నవన్ని మెచ్చాను వచ్చానులే

దేవుడు చేసిన మనుషులు--1973


సంగీతం::రమేష్‌నాయుడు
రచన:: ఆరుద్ర
గానం::L.R.ఈశ్వరి


మసక మసక చీకటిలో..మల్లెతోట వెనకాలా
మసక మసక చీకటిలో..మల్లెతోట వెనకాలా
మాపటేల కలుసుకో..ఓ..నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది..దొరుకుతుంది..ఒకే..యా...యా యా..యయాయయాయా..యాయా..యయాయ..ఓ..ఓ..ఓ..


మాదేశం వచ్చిన వాడా....మా బొమ్మను మెచ్చిన వాడా
మాదేశం వచ్చిన వాడా....మా బొమ్మను మెచ్చిన వాడా
తరతరాల అందాల..తరగని తొలి చెందాలా
తరతరాల అందాల..తరగని తొలి చెందాలా
ఈ భంగిమ నచ్చిందో..ఆనందం ఇచ్చిందో..
అయితే..ఏ..ఏ..ఏ...

మసక మసక చీకటిలో..మల్లెతోట వెనకాలా
మాపటేల కలుసుకో..ఓ..నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది..దొరుకుతుంది..ఒకే..యా...యా యా..యయాయయాయా..యాయా..యయాయ..ఓ..ఓ..ఓ..


చోద్యాలు వెతికే వాడా...సొగసుచూసి మురిసేవాడా...
చోద్యాలు వెతికే వాడా...సొగసుచూసి మురిసేవాడా...
కడచేతికి దొరకాలంటే..నలుమూలలు తిరగాల
కడచేతికి దొరకాలంటే..నలుమూలలు తిరగాల
నీ ముందుకు రావాలా..నీ సొంతం కావాలా..
అయితే..ఏ..ఏ..ఏ....


మసక మసక చీకటిలో..మల్లెతోట వెనకాలా
మాపటేల కలుసుకో..ఓ..నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది..దొరుకుతుంది..ఒకే..యా...యా యా..యయాయయాయా..యాయా..యయాయ..ఓ..ఓ..ఓ..

ధనమా దైవమా--1973



సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల

::::


ఏమిటో ఇది ఏమిటో
ఎందుకో ఇది ఎందుకో

గుడుగుడు గుంజం
అహ్హా..గుండెరాగం
గుడుగుడు గుంజం
అహ్హా..గుండెరాగం

ఇది తొలివయసు వేసిన తాళం
ఇది తొలివయసు వేసిన తాళం

గుడుగుడు గుంజం
అహ్హా..గుండెరాగం..
గుడుగుడు గుంజం
అహ్హా..గుండెరాగం..


నీ కళ్ళు చూసానూ నా ఇల్లే మరిచాను
నీ కళ్ళు చూసానూ నా ఇల్లే మరిచాను
నీ పెదవులే చూసాను నీ పెదవులే చూసాను
జున్ను మీగడ మరిచాను..ఎందుకో

గుడుగుడు గుంజం
అహ్హా..గుండెరాగం
గుడుగుడు గుంజం
ఏహే..గుండెరాగం


నీరూపం చూసాను ఈ లోకం మరిచాను
నీరూపం చూసాను ఈ లోకం మరిచాను
నా పేరే అడుగుతుంటే నా పేరే అడుగుతుంటే
నీ పేరే..తెలిపాను..ఎందుకో

గుడుగుడు గుంజం
అహ్హా..గుండెరాగం
గుడుగుడు గుంజం
ఆహా..గుండెరాగం


నిద్దురలో పిలిచాను ముద్దులతో కొలిచాను
నిద్దురలో పిలిచాను ముద్దులతో కొలిచాను
నీకౌగిట కరిగిపోయి..నీకౌగిట కరిగిపోయి
నిన్ను నన్ను మరిచాను..ఎందుకో...ఆ..ఆ

గుడుగుడు గుంజం
అహ్హా..గుండెరాగం
గుడుగుడు గుంజం

ఆహా..గుండెరాగం

ఆ..హా..ఆ..హా..ఆ..హా

ధనమా దైవమా--1973::ఆభేరి::రాగం



సంగీతం::TV.రాజు
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల

రాగం:::ఆభేరి:::

నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలో వేదన మరచిపో
నీ మది చల్లగా...


ఏ సిరులెందుకు ఏ నిధులెందుకు

ఏ సౌఖ్యములెందుకు ఆత్మశాంతి లేనిదే.....
మనిసి బ్రతుకు నరకమౌను మనసు తనది కానిదే
నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలో వేదన మరచిపో
నీ మది చల్లగా

చీకటి ముసిరిన వేకువ ఆగునా
ఏ విధి మారినా దైవం మారునా
కలిమిలోన లేమిలోన పరమాత్ముని తలచుకో
నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలో వేదన మరచిపో
నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలో వేదన మరచిపో
నీ మది చల్లగా...

జానకి సహనమూ రాముని సుగుణము
ఏ యుగమైనను నిలచే ఆదర్శము
వారిదారిలోన నడచు వారి జన్మ ధన్యమూ
నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలో వేదన మరచిపో
నీ మది చల్లగా...