Tuesday, September 14, 2010

నేరము శిక్ష--1973







సంగీతం::సాలూరు రాజేశ్వరరావు
రచన::గణపతిశాస్త్రి
గానం::P.సుశీల  
తారాగణం::కృష్ణ,భారతి,కృష్ణకుమారి,బాలయ్య,సత్యనారాయణ,పండరీబాయి,కాంతారావు

పల్లవి::

రాజా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..నా రాజా
వేశావు బలే వేషాలు చేశావులే తమాషాలు 
వేశావు బలే వేషాలు చేశావులే తమాషాలు 
తెలిసెనులే..ఏఏఏఏ..ఇక తెలిసెనులే..ఏఏఏ
వేశావు బలే వేషాలు చేశావులే తమాషాలు
వేశావు బలే వేషాలు చేశావులే తమాషాలు 

చరణం::1

మింటి నడుమ జాబిల్లీ..ఏఏఏ..నీవే వంటయింటి కుందేలైనావే 
మింటి నడుమ జాబిల్లీ..నీవే..ఏఏఏ..వంటయింటి కుందేలైనావే
మగసిరులొలికే మహరాజ..మగువల చేతలు తమకేల
మగసిరులొలికే మహరాజ..మగువల చేతలుతమకేల
పసందైన ఈ కోడె వయస్సులో..ఓఓఓఓఓ..హుషారులేదా
విషాదమేల..రాజా..ఆఆఆ..నా..రాజా 
వేశావు బలే వేషాలు..చేశావులే తమాషాలు
వేశావు బలే వేషాలు..చేశావులే తమాషాలు 

చరణం::2

ఉలకవు పలకవు పెదవి కదిపితే..వొలికిపోవునా వరహాలే
చీ..పో..
ఉలకవు పలకవు పెదవి కదిపితే..వొలికిపోవునా వరహాలే 
ఒక్క మాటతో ఓరచూపుతో..ఒళ్ళు పులకరించేనే
నా..ఆ..గుండె..జలదరించేనే 
బెట్టు చేయనేల..పట్టు విడచి రావా..లెక్కచేయవేల
అక్కున చేర్చుకోవా..రాజా..ఆఆఆ..నా..రాజా 
వేశావు బలే వేషాలు..చేశావులే తమాషాలు
వేశావు బలే వేషాలు..చేశావులే తమాషాలు 

నేరము శిక్ష--1973







సంగీతం::సాలూరు రాజేశ్వరరావు
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::S.P.బాలు  
తారాగణం::కృష్ణ,భారతి,కృష్ణకుమారి,బాలయ్య,సత్యనారాయణ,పండరీబాయి,కాంతారావు

పల్లవి::

శ్రీ రామచంద్రకీ జై..జటకపటక జటకపటక 
జటకపటక జటకపటక జటపట జటపట 
పటేల్ పటేల్ కబగిబ గబగబ..ఆవో..హయ్య..తరరరరర 
రాముని బంటునురా సీతారాముని బంటునురా..హోయ్ 
రాముని బంటునురా సీతారాముని బంటునురా

చరణం::1

దిక్కుల కాంతులు..పిక్కటిల్లగా..అహా..
దిక్కుల కాంతులు..పిక్కటిల్లగా 
గుప్పున కన్నుల..నిప్పులు రాలగ..ఆయ్  
గుప్పున కన్నుల..నిప్పులు రాలగ
బర బర బర బర అంబర వీధిని 
వాలము దిప్పుచు వచ్చినానురా
రాముని బంటునురా..సీతారాముని బంటునురా..ఆయ్  
రాముని బంటునురా..సీతకు రాముని బంటునురా

చరణం::2

ఇక్కడ వున్నాడొక రావణుడు..ఆయ్ 
ఇక్కడ వున్నాడొక రావణుడు 
నక్కలాగ పొంచున్నాడు..ఊఊఊ  
గుంటనక్కలాగ పొంచున్నాడు 
వాడిని పట్టి నేలకు కొట్టి..వాడిని పట్టి నేలకు కొట్టి 
కండలు కోసి గుండెలు చీల్చి..కాకుల కెగరేస్తాడు వీడు 
రాముని బంటునురా..సీతారాముని బంటునురా హోయ్ 
రాముని బంటునురా..సీతకు..రఘురాముని బంటునురా

చరణం::3

పిచ్చివాడిని నేనురా మద పిచ్చివాడిని కానురా 
ఆహహ..ఓహోహోహో..హోవ్..ఆహహహాహా..ఒయ్
పిచ్చివాడిని నేనురా మద పిచ్చివాడిని కానురా 
చచ్చు పుచ్చు లోకానికి..చదువు చెప్పె వాడ్నిరా
ఆహహఒయ్ హోయ్..పచ్చపచ్చని కాపురాలకు చిచ్చుపెట్టేవాళ్ళ మెడకు 
ఉచ్చులాంటి వాడ్నిరా కార్చిచ్చులాంటి వాడ్నిరా..తకతకిటతజను  
రాముని బంటునురా సీతారాముని బంటునురా..హోయ్ 
రాముని బంటునురా సీతకు రాముని బంటునురా

చరణం::4

అమ్మా..ఆ..సీతమ్మా..ఆ..రాముడు పంపగ వచ్చానమ్మా 
రఘురాముడు..పంపగ వచ్చానమ్మా 
నీ కష్టాలన్నీ కడతేరే ఆ మంచిరోజు వచ్చేనమ్మా అమ్మా..సీతమ్మా 
ఈ రక్కసి బాధల నుక్కడంప నీ రక్షణకై నే వచ్చానమ్మా 
రాముని బంటునురా సీతారాముని బంటునురా..హోయ్ 
రాముని బంటునురా సీతకు రాముని బంటునురా
అహ..జయజయ రాముడు..జానకిరాముడు 
కోదండరాముడు..పట్టాభి రాముడు 
హోయ్..దశరధ రాముడు..తారకరాముడు
అయోధ్య రాముడు..అనంత రాముడు 
రామ రామ రామ సీత రామ రామ రామ సీత 
రామ రామ రామ సీత రామ రామ రామ సీత 
రాముని బంటునురా సీతారాముని బంటునురా
రాముని బంటునురా సీతకు రాముని బంటునురా

నేరము శిక్ష--1973







సంగీతం::K.V.మహదేవన్
రచన::సముద్రల జూనియర్ 
గానం::S.P.బాలు,G.ఆనంద్, బృందం
తారాగణం::కృష్ణ,భారతి,కృష్ణకుమారి,బాలయ్య,సత్యనారాయణ,పండరీబాయి,కాంతారావు

పల్లవి::

One two..One two..One two
ఒకరికి తోడుగ..ఒకరుంటూ 
One two..One two..One two
ఒకరికి తోడుగ..ఒకరుంటూ 
నేడు నిజమంటూ..య్యా..రేపు లేదంటూ 
నేడు నిజమంటూ..రేపు లేదంటూ 
ఆడుతూ పాడుతూ..సాగిపోతుంటే జీవితమంతా 
Joy..Enjoy..hayyaa..హయ్..హయ్..హయ్ 
One two..One two..One two
ఒకరికి తోడుగ..ఒకరుంటూ

చరణం::1

జేబుల్ నిండా డబ్బుంటే..లలలాలలాలలా 
జల్సాచేసే దమ్ముంటే..లలలాలలాలలా
జేబుల్ నిండా డబ్బుంటే..జల్సాచేసే దమ్ముంటే
మనసుకు నచ్చిన మగువుంటే..ఏఏఏఏ..య్యా
మనసుకు నచ్చిన మగువుంటే
మనిషికి వేరే..స్వర్గంలేదూ
ఉడలెహు ఉడలెహు ఉడలె ఉడలె ఉడలెహు
ఉడలెహు ఉడలెహు ఉడలె ఉడలె ఉడలెహు    

జీవితమంతా Joy..njoy..హయ్..హయ్..హయ్ 
One two..One two..One two
ఒకరికి తోడుగ..ఒకరుంటూ

చరణం::2

బాధ్యతలన్ని పెద్దల కొదిలేయ్..దేవా..ఓ..దేవా
బాధ్యతలన్ని పెద్దల కొదిలేయ్..దేవా..ఓ..దేవా  
పరీక్షమాట పంతుల కోదిలెయ్..దేవా..ఓ..దేవా
పరీక్షమాట పంతుల కోదిలెయ్..దేవా..ఓ..దేవా
పరువం పోతే మళ్ళీ రాదూ..జీవా..ఓ..జీవా 
పరువం పోతే మళ్ళీ రాదూ..జీవా..ఓ..జీవా
కరువుతీరా అనుభవించరా జీవా..ఓ..జీవా 
కరువుతీరా అనుభవించరా జీవా..ఓ..జీవా

జీవితమంతా..Joy..Enjoy..హయ్..హయ్..హయ్ 
One two..One two..One two
ఒకరికి తోడుగ..ఒకరుంటూ

చరణం::3

కొత్త సినిమా వచ్చిందంటే..ఆహా..ఫస్టుషోకి చెక్కేసెయ్ 
బలే..బలే..ఫస్టుషోకె..చెక్కేసెయ్ 
అమ్మనాన్న అడిగారంటే..అడిగారంటే 
అమ్మనాన్న అడిగారంటే..అలిగి అన్నం మానేసెయ్
ఫీజు కట్టే పైకంతో..పిక్ నిక్ పార్టీ పెట్టేసెయ్..పిక్ నిక్ పార్టీ పెట్టేసెయ్  
ప్రిన్సిపాల్ సస్పెండ్ చేస్తే..గుడ్ బై చెప్పివచ్చేసెయ్ గుడ్ బై చెప్పి వచ్చేసెయ్

జీవితమంతా..Joy..njoy..హయ్..హయ్..హయ్ 
One two..One two..One two
ఒకరికి తోడుగ ఒకరుంటూ..హయ్..హయ్..హయ్..హయ్ 

నేరము శిక్ష--1973





















సంగీతం::K.V.మహదేవన్
రచన::దాశరధి 
గానం::S.P.బాలు,S.జానకి
తారాగణం::కృష్ణ,భారతి,కృష్ణకుమారి,బాలయ్య,సత్యనారాయణ,పండరీబాయి,కాంతారావు

పల్లవి::

హా హా హా హా హా హా హా 
ఏమండీ సారూ..ఓ బట్లర్ దొరగారూ 
ఏమండీ సారూ..ఓ బట్లర్ దొరగారూ 
అన్నీ తెలుసని అన్నారు..యెన్నో కోతలు కోశారు 
అన్నీ తెలుసని అన్నారు..యెన్నో కోతలు కోశారు
ఇంతేనా..నీ..పనితనమింతేనా
హోయ్..ఇంతేనా..నీ..పనితనమింతేనా
అయ్యోయ్యయ్యో..అయ్యోయ్యయ్యో
అయ్యోయ్యయ్యో..అయ్యోయ్యయ్యో 
అంతటిమాట అనకండి..ఆఖరుదాకా ఆగండి
అంతటిమాట అనకండి..ఆఖరుదాకా ఆగండి
చూడండీ..నా..పనితనమేదో చూడండీ
చూడండీ..నా..పనితనమేదో చూడండీ 

చరణం::1

బీరా కంద చామా యే కూరైన..ఒకటే రుచి ఓ రామా..ఆ 
కోడి పులావు కుర్మా తిందామంటే..నల్లులవాసన ఖర్మా..ఆ 
ఎరువులు వేసిన కాయగూరలు..ఎవరు వండిన అంతేనమ్మా..ఆ
కమ్మని రుచులు కావాలంటే..కల్తీలేని శాల్తీ లిచ్చి 
చూడండి..నా..పనితనమేదో..చూడండి  
అయ్యోయ్యయ్యో..అయ్యోయ్యయ్యో  
అయ్యోయ్యయ్యో..అయ్యోయ్యయ్యో 
అందాకా..ఈ..ప్రాణం..నిలిచేనా 
ఏమండీ సారూ..ఓ..బట్లర్ దొరగారూ 
అన్నీ తెలుసని అన్నారు..యెన్నో కోతలు కోశారు
అహా..అంతటిమాట అనకండి..ఆఖరుదాకా ఆగండి 
చూడండీ..నా..పనితనమేదో చూడండీ

చరణం::2

మనసు మమత మంచి కలిపి దేవుడు..వండిన వంటే మనిషి 
యెందుకు ఉప్పుకారం నీలోనే వున్నది..కమ్మని మమకారం
తియ్యటి మాటలతోటి తీరునటయ్య ఆకలి..ఈ ఈ ఈ 
చేతలలోనే చూపాలి..నీ చేతి మహత్యం తెలపాలి
ఏమండీ సారూ..ఓ..ఓ..బట్లర్ దొరగారూ..ఓహో 
అన్నీ తెలుసని అన్నారు..యెన్నో కోతలు కోశారు
ఇంతేనా..నీ పనితనమింతేనా..ఓస్..ఇంతేనా..నీ పనితనమింతేనా
అహా అహా..చూడండీ నా పనితనమేదో..చూడండీ