సంగీతం::చక్రవర్తి
రచన::కోసరాజురాఘవయ్య
గానం::L.R.అంజలి,వాణిజయరాం,చక్రవర్తి.
తారాగణం::రాజబాబు,సత్యనారాయణ,మురళీమోహన్,జయసుధ,నిర్మల,జయలక్ష్మి,అల్లు రామలింగయ్య
పల్లవి::
తప్పెట్లోయ్ తాళాలోయ్..దేవుడిగుళ్లో బాజాలోయ్
తప్పెట్లోయ్ తాళాలోయ్..దేవుడిగుళ్లో బాజాలోయ్
ఆడేవాళ్ళే రావాలోయ్..ఆడవాళ్ళే రావోలోయ్
ఛా..కాదు..ఆడేవాళ్ళే రావాలోయ్..ఆడనివాళ్ళు బొడోళ్ళోయ్
తప్పెట్లోయ్ తాళాలోయ్..దేవుడిగుళ్లో బాజాలోయ్..ఓఓఓహోయ్
చరణం::1
వీరివీరి గుమ్మడిపండు..వీరి పేరు ఎవరూ
బంగినపల్లి మామిడిపండు పక్కన ఉన్నది ఎవరూ
ఎవరూ..చెప్పు..ఆఆఆ..తిరపతీ..ఆహా
వీరివీరి గుమ్మడిపండు..వీరి పేరు ఎవరూ
బంగినపల్లి మామిడిపండు పక్కన ఉన్నది ఎవరూ
చెప్పినవారిని వదిలేసాం..చెప్పకపోతే తిప్పిస్తాం
చెప్పినవారిని వదిలేసాం..చెప్పకపోతే తిప్పిస్తాం
చిల్లరకొట్టు చెట్టెమ్మ..ఛీ కాదు చుప్పనాతి సూరక్క..ఆ..ఆ
ఎక్కడి దొంగలు అక్కడే గప్ చిప్..అదిగో ఇదితో సాంబారు బుడ్డీ
తప్పెట్లోయ్ తాళాలోయ్..దేవుడిగుళ్లో బాజాలోయ్
తప్పెట్లోయ్ తాళాలోయ్..దేవుడిగుళ్లో బాజాలోయ్..ఓఓఓహోయ్
చరణం::2
చెమ్మచెక్క జిలేబిముక్క..తెచ్చిపెట్టంగ తిని తేపంగ
చెమ్మచెక్క జిలేబిముక్క..తెచ్చిపెట్టంగ తిని తేపంగ
చూస్తూ వున్నది సుబ్బక్క..మేస్తూ వున్నది సూరక్క
దొంగ ఎవ్వరే బంగారక్కా..ఆహా..నంగనాచి ఈ నరసక్క
పట్టుకోండి పట్టుకోండి...పోనివ్వక
తప్పెట్లోయ్ తాళాలోయ్..దేవుడిగుళ్లో బాజాలోయ్
తప్పెట్లోయ్ తాళాలోయ్..దేవుడిగుళ్లో బాజాలోయ్