సంగీతం::ఘంటసాల రచన::D.C.నారాయణరెడ్డి గానం::ఘంటసాల,P.సుశీల తారాగణం::N.T.రామారావు, సావిత్రి, అంజలీదేవి,మిక్కిలినేని, సత్యనారాయణ పల్లవి:: ఈ పాట నీ కోసమే..హోయ్ ఈ ఆట నీ కోసమే ఈ పాట నీ కోసమే..హోయ్ ఈ ఆట నీ కోసమే ఈ పూలు పూచేది ఈ గాలి వీచేది మనసైన మన కొసమే ఓయి ఈ పాట నీ కోసమే..హోయ్ ఈ ఆట నీ కోసమే చరణం::1 పగలయిన రేయైన నీ ధ్యానమే నిలువెల్ల రగిలించు నీ మౌనమే అహహ ఒహొహొ ఓహొహో..ఓఓ పగలయిన రేయైన నీ ధ్యానమే నిలువెల్ల రగిలించు నీ మౌనమే నీ చూపు నా పాలి సుమబాణమే నీ చూపు నా పాలి సుమబాణమే నిను చూడ కదలాడు నా ప్రాణమే ఈ పాట నీకోసమే..హోయ్ ఈ ఆట నీ కోసమే చరణం::2 నీ గుండెలో నేను దాగుంటిని నీ గారడీలన్ని కనుగొంటిని అహహ ఒహొహొ ఓహొహో..ఓఓ నీ గుండెలో నేను దాగుంటిని నీ గారడీలన్ని కనుగొంటిని నీ కళ్ళ వెనకాల నేనుంటిని నీ కళ్ళ వెనకాల నేనుంటిని కనరాని వలయాలు కనుగొంటిని ఈ పాట నీ కోసమే హోయ్ ఈ ఆట నీ కోసమే ఈ పూలు పూచేది ఈ గాలి వీచేది మనసైన మన కొసమే ఓయి ఈ పాట నీ కోసమే..హోయ్ ఈ ఆట నీ కోసమే
సంగీతం::సాలూరి రాజేశ్వర రావ్ రచన::ఆత్రేయ గానం::ఘంటసాల గారు పల్లవి::
ఏడుకొండల శ్రీనివాసా..ఆఆఅ ఏడుకొండల శ్రీనివాసా..మూడు మూర్తుల తిరుమలేసా ఏడేడు జన్మల పాపముల..ఎడబాపి బ్రోచే వేంకటేశా..ఆ చరణం::1 కోటికీ పడగెత్తినా..ధనవంతుడూ కోటికీ పడగెత్తినా..ధనవంతుడూ నీ గుడి ముంగిటా..సామాన్యుడూ కూటి కోసం శ్రమపడే..నిర్భాగ్యుడూ కూటి కోసం శ్రమపడే..నిర్భాగ్యుడూ నీ కృపకెప్పుడూ..సమపాత్రుడూ..ఊఊ చరణం::2 మమకారాలూ..ఉండరాదనీ మా తలనీలాలూ..తీసుకొందువూ నీది నాదని...ఏది లేదని నిలువు దోపిడి..వొలుచుకొందువూ వెళ్ళునపుడూ..వెంటరాదని ముడుపులన్నీ..ఊడ్చుకుందువూ అడుగడుగునా..అడుగడుగునా వేదాంతమున్నది..నీ ఆరాధనలో సాధనున్నదీ ఏడుకొండల శ్రీనివాసా..మూడు మూర్తుల తిరుమలేసా చరణం::3 ఆ శేతు శీతాచలము నీవే దైవమూ..ఆ ఆ ఆ ఆ ఆ బాల గోపాలమ్ము నిన్నే కొలుతుమూ..ఆ ఆ ఆ ఆ నీ దివ్య మంగల రూపమూ..ఆ ఆ ఆ ఆ మా నిత్య దర్శన తేజమూ..ఆ ఆ ఆ ఆ నీ పాద పద్మ యుగళమూ..ఆ ఆ ఆ ఆ సంసార సాగర...తరణమూ ఏడుకొండల శ్రీనివాసా..మూడు మూర్తుల తిరుమలేసా