Friday, March 30, 2007

సంఘర్షణ--1983


సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి  
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

కట్టు జారి పోతా ఉందీ
చీర కట్టు జారి పోతా ఉందీ..హోయ్
బొట్టు కారి పోతా ఉందీ
చుక్క బొట్టు కారి పోతా ఉందీ..హోయ్
ఒట్టమ్మో ఒళ్ళంతా ఉలికి ఉలికి పడతా ఉందీ
ఏందమ్మ వయ్యారం ఎదిగి ఎదిగి పోతా ఉందీ

అరె..కట్టు జారి పోతా ఉందా..హోయ్
చీర కట్టు జారి పోతా ఉందా..హా
బొట్టు కారి పోతా ఉందా..హోయ్
చుక్క బొట్టు కారి పోతా ఉందా..హా
ఓలమ్మి సిగ్గంతా తొణికి తొణికి పోతా ఉందా..హా
ఏందమ్మో సింగారం ఎలిగి ఎలిగి పోతా ఉందా

కట్టు జారి పోతా ఉందీ
చీర కట్టు జారి పోతా ఉందీ

చరణం::1

మొగ్గమ్మ చూసింది పువమ్మ నవ్వింది
మొగ్గమ్మ చూసింది పువమ్మ నవ్వింది
గోరంతా ఈ గొడవ ఊరంత చెప్పిందమ్మ  
పరువంతా తీసిందమ్మా..ఆ

సోకమ్మ తాకింది కోకమ్మ తరిగింది
కాకమ్మ ఆ కబురు కథలాగ చెప్పిందమ్మా..ఆ
కథలెన్నో రేపిందమ్మా

చీరకట్టులేని చిన్నదానికింక సారె పెట్టనేల చిన్నోడు 
పొంచి పట్టుకొన్న కంచిపట్టుచీర కాకపోతినేల ఈనాడు 
పొంచి పట్టుకొన్న కంచిపట్టుచీర కాకపోతినేల ఈనాడు 

బొట్టు కారి పోతా ఉందీ
చుక్క బొట్టు కారి పోతా ఉందీ..హోయ్

చరణం::2

పిట్టమ్మ చూసింది చెట్టెక్కి కూసింది
పిట్టమ్మ చూసింది చెట్టెక్కి కూసింది
బిడియాల కడకొంగు ముడి పెట్టుకోమందమ్మా
మొద్దెట్టుకోమందమ్మా..ఆ

సిగ్గమ్మ వచ్చింది..సెలవంటు వెళ్ళింది
సిగ్గమ్మ వచ్చింది సెలవంటు వెళ్ళింది
ఒక నాటి చెలికాడి ఒడి చేరుకోమందమ్మా
ఒదిగొదిగి పొమ్మందమ్మా..ఆ

పుట్టగానే చేయిపట్టుకొన్న ప్రేమ పూతకొచ్చెనమ్మ ఈనాడు
చిన్నవాడికళ్ళు చీరకున్న గళ్ళు ఎట్టదాచనమ్మ నా ఈడు
చిన్నవాడికళ్ళు చీరకున్న గళ్ళు ఎట్టదాచనమ్మ నా ఈడు

అరె..కట్టు జారి పోతా ఉందా..హోయ్
చీర కట్టు జారి పోతా ఉందీ..హ హా
బొట్టు కారి పోతా ఉందా..హోయ్
చుక్క బొట్టు కారి పోతా ఉందా..హా
ఓలమ్మి సిగ్గంతా తొణికి తొణికి పోతా ఉందా..హా
ఏందమ్మో సింగారం ఎలిగి ఎలిగి పోతా ఉందా

కట్టు జారి పోతా ఉందా..ఈ
చీర కట్టు జారి పోతా ఉందీ..ఈ 

Sangharshana--1983
Music::Chakravarti
Lyrics::Veetuuri
Singer's::S.P.Baalu.P.Suseela

:: ::

kaTTu jaari pOtaa undii
chiira kaTTu jaari pOtaa undii..hOy
boTTu kaari pOtaa undii
chukka boTTu kaari pOtaa undii..hOy
oTTammO oLLantaa uliki uliki paDataa undii
Endamma vayyaaram edigi edigi pOtaa undii

are..kaTTu jaari pOtaa undaa..hOy
chiira kaTTu jaari pOtaa undaa..haa
boTTu kaari pOtaa undaa..hOy
chukka boTTu kaari pOtaa undaa..haa
Olammi siggantaa toNiki toNiki pOtaa undaa..haa
EndammO singaaram eligi eligi pOtaa undaa

kaTTu jaari pOtaa undii
chiira kaTTu jaari pOtaa undii

::::1

moggamma chUsindi puvamma navvindi
moggamma chUsindi puvamma navvindi
gOrantaa ii goDava Uranta cheppindamma  
paruvantaa teesindammaa..aa

sOkamma taakindi kOkamma tarigindi
kaakamma aa kaburu kathalaaga cheppindammaa..aa
kathalennO rEpindammaa

chiirakaTTulEni chinnadaanikinka saare peTTanEla chinnODu 
ponchi paTTukonna kanchipaTTuchiira kaakapOtinEla iinaaDu 
ponchi paTTukonna kanchipaTTuchiira kaakapOtinEla iinaaDu 

boTTu kaari pOtaa undii
chukka boTTu kaari pOtaa undii..hOy

::::2

piTTamma chUsindi cheTTekki koosindi
piTTamma chUsindi cheTTekki koosindi
biDiyaala kaDakongu muDi peTTukOmandammaa
moddeTTukOmandammaa..aa

siggamma vachchindi..selavanTu veLLindi
siggamma vachchindi selavanTu veLLindi
oka naaTi chelikaaDi oDi chErukOmandammaa
odigodigi pommandammaa..aa

puTTagaanE chEyipaTTukonna prEma pootakochchenamma iinaaDu
chinnavaaDikaLLu chiirakunna gaLLu eTTadaachanamma naa iiDu
chinnavaaDikaLLu chiirakunna gaLLu eTTadaachanamma naa iiDu

are..kaTTu jaari pOtaa undaa..hOy
chiira kaTTu jaari pOtaa undii..ha haa
boTTu kaari pOtaa undaa..hOy
chukka boTTu kaari pOtaa undaa..haa
Olammi siggantaa toNiki toNiki pOtaa undaa..haa
EndammO singaaram eligi eligi pOtaa undaa

kaTTu jaari pOtaa undaa..ii
chiira kaTTu jaari pOtaa undii..ii a

Saturday, March 24, 2007

అమెరికా అమ్మాయి--1976

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4721
సంగీతం::G.K.వెంకటేశ్
రచన::ఆరుద్ర 
గానం::S.P.బాలు,వాణిజయరాం   

పల్లవి:: 

జిలిబిలి సిగ్గుల చిలకను పిలిచెను గోరింకా
అడుగుల తడబడ బెదురుచు చేరెను చిలకమ్మా
ఓ..ఓ..ఓ..బెదురుచు చేరెను చిలకమ్మా

చరణం::1 

కొండల కోనల కోయిల పాడెను సంగీతం
కొండల కోనల కోయిల పాడెను సంగీతం
మధువులు ఆనుచు..మత్తుగ పాడుచు..తుమ్మెద ఆడేను సల్లాపం

జిలిబిలి సిగ్గుల చిలకను పిలిచెను గోరింకా
అడుగులు తడబడ బెదురుచు చేరెను చిలకమ్మా
బెదురుచు చేరెను చిలకమ్మా

చరణం::2

పచ్చని పసరిక పానుపు పరిచెను పోదరి౦ట్లో
పచ్చని పసరిక పానుపుపరిచెను పోదరి౦ట్లో
వెచ్చనివలపుల ముచ్చట తీరగ తనువులు కరిగెను కౌగిట్లో
ఓ..ఓ..జిలిబిలి సిగ్గుల చిలకను పిలిచెను గోరింకా 
అడుగులు తడబడ బెదురుచు చేరెను చిలకమ్మా
బెదురుచు చేరెను చిలకమ్మా

Friday, March 23, 2007

అమెరికా అమ్మాయి--1976


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5511
సంగీతం::G.K.వెంకటేశ్
రచన::మైలవరపు గోపి
గానం::S.P.బాలు  

పల్లవి:: 

హే..హే..హే..రూ..రూ..రూ..రూ
ఆమె తోటి మాటు౦ది..పెదవి దాటి రాకుంది
ఆమె తోటి మాటు౦ది..పెదవి దాటి రాకుంది
ఏమున్నదో..ఆ చూపులో

చరణం::1

చిరుగాలి తరగల్లె నడకలు నేర్పిందీ
సెలయేరు నురగల్లె జిలుగులు చిలికిందీ
చిరుగాలి తరగల్లె నడకలు నేర్పిందీ
సెలయేరు నురగల్లె జిలుగులు చిలికిందీ

నవ్వు నన్ను పిలిచిందీ..కళ్ళతోటి కాదందీ
నవ్వు నన్ను పిలిచిందీ..కళ్ళతోటి కాదందీ 

దట్స్ లవ్..లవ్..లవ్..లవ్..లవ్
హే..హే..హే..రూ..రూ..రూ..రూ
ఆమె తోటి మాటు౦ది..పెదవి దాటి రాకుంది
ఏమున్నదో..ఆ చూపులో

చరణం::2

తనకైన లోలోన ఆశగ వుంటు౦దీ
పైపైకి నాపైన అలకలు పోతుంది
తనకైన లోలోన ఆశగ వుంటు౦దీ
పైపైకి నాపైన అలకలు పోతుంది

మనసు తెలుపనంటుందీ..మమత దాచుకుంటుందీ
మనసు తెలుపనంటుందీ..మమత దాచుకుంటుందీ

దట్స్ లవ్..లవ్..లవ్..లవ్..లవ్
హే..హే..హే..రూ..రూ..రూ..రూ

ఆమె తోటి మాటు౦ది..పెదవి దాటి రాకుంది
ఏమున్నదో..ఆ చూపులో

Thursday, March 22, 2007

సంఘర్షణ--1983














సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి  
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
అరె..సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
పామే వచ్చి నిన్ను చూసి..తోకా ఎత్తి నిలబడిపోయి
పడగా విప్పి బుస్సుమంటే..ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం
సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
అరె.. సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
పామే వచ్చి నిన్ను చూసి..తోకా ఎత్తి నిలబడిపోయి
పడగా విప్పి బుస్సుమంటే..ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం

చరణం::1

ముద్దులివ్వకుంటే..ముల్లు గుచ్చుకుంటదీ
కాదు కూడదంటే..కాలి కస్సుమంటదీ
ఒప్పుకోవమ్మా..తప్పుకోకమ్మా
పైట లాగకుంటే పల్లె తిట్టుకుంటదీ..హా హా హహా
గుట్టు తాపుకుంటే గుండె కొట్టుకుంటదీ
హొయ్..హొయ్..హొయ్ హొయ్
అల్లుకోవయ్యా అరె ఆదుకోవయ్యా
చీకటి పిచ్చి ముదిరిందంటే..ఏ..వెన్నెల పెళ్ళి కుదిరిందంటే
కొత్తలవాటు కొంపకు చేటూ..అయినా తప్పదు ఆటుపోటూ
ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం..ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం
సన్నజాజి పందిరి కింద..మెల్లమెల్లగా
అరె..దూరి దూరి పోయావంటే పాములుంటాయ్

చరణం::2

గాజు చిట్లకుండా..మోజు తగ్గనంటదీ
ఇద్దరున్న కాడా..హద్దులెందుకంటదీ
బెట్టు చాలయ్యా..నన్నంటుకోవయ్యా
తప్పు చెయ్యకుంటే నిప్పు అంటుకుంటదీ..హా హా హహా
అందమైన ఈడు...అప్పుపెట్టమంటదీ
హొయ్..హొయ్..హొయ్ హొయ్
వాముల పాటు పాముల కాటూ..వయసుల వాటు ప్రేమల కాటూ
పెట్టిపోవమ్మో అరువెట్టిపోవమ్మో..రెప్పలగంట కొట్టిందంటే.. జంటకు గంట గడవాలంటే
ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం..ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం..
సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
పామే వచ్చి నిన్ను చూసి..తోకా ఎత్తి నిలబడిపోయి
పడగా విప్పి బుస్సుమంటే..ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం
సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
పామే వచ్చి నిన్ను చూసి..తోకా ఎత్తి నిలబడిపోయి
పడగా విప్పి బుస్సుమంటే..ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం

Monday, March 12, 2007

గుండమ్మ కథ--1962::మోహన::రాగం



డైరెక్టర్కమలాకర్,కామేస్వర రావ్
రచన::పింగళి నాగేద్ర రావ్
సంగీతం::ఘంటసాల
ప్రొడ్యుసర్::చక్రపాణి,నాగిరెడ్డి
గానం::ఘంటసాల

తారాగణం::N.T.రామారావు,అక్కినేని,జమున,సావత్రి,S.V.రంగారావు,రాజనాల,రమణారెడ్డి,L.విజయలక్ష్మి,
హరనాధ్, ఛాయాదేవి.
రాగం::మోహన

పల్లవి::
మౌనముగానే నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగం నీ కనులనే నీ మనసు కనుగొంటిలే
మౌనముగానే నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే

చరణం::1
కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
ఆనందముతో అమ్రుతవాహిని ఓలలాడి మైమరచితిలే
మౌనముగానే నీ మనసు పాడిన వేణుగానమును వింటిల

చరణం::2
ముసిముసినవ్వుల మోముగని నను ఏలుకొంటివని మురిసితిలే
ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ముసిముసినవ్వుల మోముగని నను ఏలుకొంటివని మురిసితిలే
రుసరుసలాడుతు విసిరిన వాల్జడ వలపు పాసమని వెదరితిలే
మౌనముగానే నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగం నీ కనులనే నీ మనసు కనుగొంటిలే
మౌనముగానే నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే

Saturday, March 10, 2007

గుండమ్మ కథ--1962



డైరెక్టర్::కమలాకర్,కామేస్వర రావ్
రచన::పింగళి నాగేద్ర రావ్
సంగీతం::ఘంటసాల

గానం::ఘంటసాల
ప్రొడ్యుసర్::చక్రపాణి,నాగిరెడ్డి

తారాగణం::N.T.రామారావు,అక్కినేని,జమున,సావత్రి,S.V.రంగారావు,రాజనాల,రమణారెడ్డి,L.విజయలక్ష్మి,

హరనాధ్, ఛాయాదేవి.

:::

ఏం బుల్లెమ్మ ఏమన్నా పనిఉంటే చెప్పు చేస్తా
ఈవాళ ఏమిపనులు లేవు అన్ని చేసేసాను
అ పనిచేస్తూనే లేదంటావ్
లే నే రుబ్బుత
వద్దులే ఇది ఆడవాళ్ళు చేసే పని
ఆ ఆడల్లేంటి మగాల్లేంటి
ఆడాళ్ళు కందిపోతారని ఈరోజుల్లో ఈ పనులన్నీ మాగాల్లె చేస్తున్నారుగా నీకు తెలువదు
సరిసరి
నేనే అనుకుంటే నాకన్నా వెనుకబడ్డట్టున్నావే
లేలే బుల్లెమ్మ లేలే
అ అ అ పట్టుర బుల్లోడా
ఏం బుల్లెమ్మ నేను సరిగా రుబ్బుతున్నాన
అ అ ఏం బుల్లెమ్మ నవ్వుతున్నావ్
నాకు బువ్వండటం కూడా చేతనవును
ఆ మాఅయ్యా వేదాంతి
పనులన్నీ తెలుసుంటే పెళ్ళాలు బాగా కాపురం చేస్తారురా అనేవారు
నీకు తెలువదు అనుకుంట
ఇప్పుడు మగాళ్ళతో పోటిచేస్తున్నారుగా ఆడాళ్ళు



లేచింది నిద్ర లేచింది మహిళా లోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం
ఆ లేచింది నిద్ర లేచింది మహిళా లోకం

ఎపుడో చెప్పెను వేమన గారు
అపుడే చెప్పెను బ్రహ్మం గారు
ఎపుడో చెప్పెను వేమన గారు
అపుడే చెప్పెను బ్రహ్మం గారు
ఇపుడే చెబుత వినుకో బుల్లెమ్మ
ఆఆఆఅ...ఆ.ఆఆ.....
విసన్నచెప్పిన వేదం కూడా
లేచింది..నిద్ర లేచింది మహిళా లోకం

చరణం::1

పల్లెటూర్లలో పంచాయతీలు
పట్టణాలలో ఉద్యోగాలు
పల్లెటూర్లలో పంచాయతీలు
పట్టణాలలో ఉద్యోగాలు
అది ఇది యేమని అన్ని రంగములా
ఆఆ....ఆఆ....
అది ఇది యేమని అన్ని రంగములా
మగధీరుల నేదిరించారు
నిరుద్యోగులను పెంచారు
లేచింది..నిద్ర లేచింది మహిళా లోకం

చరణం::2

చట్టసభలలో సీట్ల కోసం
భర్తల తోనే పోటీచేసి
చట్టసభలలో సీట్ల కోసం
భర్తల తోనే పోటీచేసి
డిల్లి సభలో పీటం వేసీ
ఈఈఇ....ఈఇ.....
డిల్లి సభలో పీటం వేసీ
లేక్చరులేన్నో దంచారు
విడాకు చట్టం తెచ్చారు

లేచింది నిద్ర లేచింది మహిళా లోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం
లేచింది నిద్ర లేచింది నిద్ర లేచింది మహిళా లోకం

గుండమ్మ కథ--1962::ఆభేరి::రాగం



డైరెక్టర్::కమలాకర్,కామేస్వర రావ్
రచన::పింగళి నాగేద్ర రావ్
సంగీతం::ఘంటసాల
ప్రొడ్యుసర్::చక్రపాణి,నాగిరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల
ఆభేరి::రాగం
 


ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనొ అహహ అహహ
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనొ
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో

తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో అహహ అహహ
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో
తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో

చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
...అహహ అహహ అహహ ఆహహహ
చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
సఖి నెరిచూపుల చల్లదనంతొ జగమునె ఊటి సాయగా
ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలూ యేలనో

కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా
...అహహ అహహ అహహహ ఆహహహ
కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా అహహ అహహ
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా

తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ యేలనో
అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో

గుండమ్మ కథ--1962::సింధుభైరవి::రాగం



డైరెక్టర్కమలాకర్,కామేస్వర రావ్
రచన::పింగళి నాగేద్ర రావ్
సంగీతం::ఘంటసాల
ప్రొడ్యుసర్::చక్రపాణి,నాగిరెడ్డి
గానం::P.సుశీల

తారాగణం::N.T.రామారావు,అక్కినేని,జమున,సావత్రి,S.V.రంగారావు,రాజనాల,రమణారెడ్డి,L.విజయలక్ష్మి,
హరనాధ్, ఛాయాదేవి.
సింధుభైరవి::రాగం 

పల్లవి::

సన్నగ వీచే చల్లగాలికి
కనులు మూసినా కలలాయే
తెల్లని వెన్నెల పానుపుపై 

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కలలో వింతలు కననాయే
సన్నగ వీచే చల్లగాలికి
కనులు మూసినా కలలాయే
తెల్లని వెన్నెల పానుపుపై
ఆ కలలో వింతలు కననాయే
అవి తలచిన ఎమొ సిగ్గాయే
కనులు తెరిచిన నీవాయే 

నే కనులు మూసినా నీవాయే

చరణం::1


నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి నే విననాయే
నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి నే విననాయే
కలవరపడి నే కనులు తెరువ నాకంటిపాపలో నీవాయే
ఎచట చూచినా నీ వాయే
కనులు తెరిచిన నీవాయే నే కనులు మూసినా నీవాయే
కనులు తెరిచిన నీవాయే

చరణం::2


మేలుకొనిన నా మదిలో ఏవొ మెల్లని పిలుపులు విననాయే
మేలుకొనిన నా మదిలో ఏవొ మెల్లని పిలుపులు విననాయే
ఉలికిపాటుతో కలియ వెతక నాహృదయఫలఖమున నీవాయే
కనులు తెరిచిన నీవాయే కనులు మూసినా నీవేనాయే

Friday, March 09, 2007

అగ్గి పిడుగు--1964



సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::సినారె
గానం::ఘంటసాల,S.జానకి
Film Directed By::B.Vithalaachaari
తారాగణం::N.Tరామారావు,చిత్తూరునాగయ్య,ముక్కామల,రాజనాల,K.సత్యనారాయణ,కృష్ణకుమారి,రాజశ్రీ,జయంతి,సత్యవతి,జానకి,అన్నపూర్ణ.

పల్లవి::

ఏమో ఏమో ఇది..నాకేమో ఏమో అయినది
ఏమో ఏమో ఇది..నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది

ఏమో ఏమో అది..నీకేమి ఏమి అయినది
ఈ వేళలో నీ గుండెలో..ఎందుకు గుబులౌతున్నది

హాయ్..
ఏమో ఏమో ఇది..నాకేమో ఏమో అయినది

చరణం::1

కనులలో నీ కనులలో..నా కలలే పొంగినవీ
కురులలో ముంగురులలో..నా కోరికలూరినవీ

అహ..హా..అహా ..ఆ ఆ ఆ
వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినది
చెంతగా నువు చేరగా గిలిగింతగ తోచినది..గిలిగింతగ తోచినది

ఏమో ఏమో ఇది..నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో..ఏదో గుబులౌతున్నది
ఏమో ఏమో ఇది..నాకేమో ఏమో అయినది

చరణం::2

ఎందుకో సిగ్గెందుకో..నా అందాలబొమ్మకు
అందుకో చేయందుకో..మరి ఆవైపు చూడకు

ఆహ..ఒహో..అహా..ఆ..ఆ..ఆ..ఆ
నవ్వుతో ముసినవ్వుతో హోయ్..నను దోచివేయకు
మాటతో సయ్యాటతో నను మంత్రించివేయకు..మంత్రించివేయకు

ఏమో ఏమో ఇది..నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఆహ..ఆహ..ఆహ..మ్మ్..మ్మ్..హూ 


Aggi Pidugu--1964
Music::Raajan-Naagendra
Lyrics::D.C.Naaraayana
Singer's::Ghantasaala,Jaanaki
Film Directed By::B.Vithalaachaari
Cast::N.T.RamaaRao,Chittoorunaagayya,Mukkaamala,Raajanaala,K.Satyanaaraayana,Krishnakumaari,Raajasree,Jayanti,Satyavati,Jaanaki,Annapoorna.

pallavi::

EmO EmO idi..naakEmO EmO ayinadi
EmO EmO idi..naakEmO EmO ayinadi
ii vELalO naa gunDelO EdO gubulautunnadi

EmO EmO adi..neekEmi Emi ayinadi
ii vELalO nee gunDelO..enduku gubulautunnadi

haay..
EmO EmO idi..naakEmO EmO ayinadi

::::1

kanulalO nee kanulalO..naa kalalE ponginavii
kurulalO mungurulalO..naa kOrikaloorinavii

aha.. haa..ahaa..aa..aa..aa..aa
vintagaa kavvintagaa ii vennela poochinadi
chentagaa nuvu chEragaa giligintaga tOchinadi..giligintaga tOchinadi

EmO EmO idi..naakEmO EmO ayinadi
ii vELalO naa gunDelO..EdO gubulautunnadi
EmO EmO idi..naakEmO EmO ayinadi

::::2

endukO siggendukO..naa andaalabommaku
andukO chEyandukO..mari aavaipu chooDaku

aaha..ohO..ahaa..aa..aa..aa
navvutO musinavvutO hOy..nanu dOchivEyaku
maaTatO sayyaaTatO nanu mantrinchivEyaku..mantrinchivEyaku

EmO EmO idi..naakEmO EmO ayinadi
ii vELalO naa gunDelO EdO gubulautunnadi
aaha..aaha..aaha..ahaa ..mm..mm..huu  

Wednesday, March 07, 2007

గుండమ్మ కథ--1962::దేశ్::రాగ



డైరెక్టర్::కమలాకర్,కామేస్వర రావ్
రచన::పింగళి నాగేద్ర రావ్
సంగీతం::ఘంటసాల
ప్రొడ్యుసర్::చక్రపాణి,నాగిరెడ్డి
గానం::P.సుశీల

దేశ్::రాగ
తారాగణం::N.T.రామారావు,అక్కినేని,జమున,సావత్రి,S.V.రంగారావు,రాజనాల,రమణారెడ్డి,L.విజయలక్ష్మి,
హరనాధ్, ఛాయాదేవి.

అలిగిన వేళనె చూడాలి గోకుల కృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి
రుసరుసలాడే చూపులలోనె
రుసరుసలాడే చూపులలోనె ముసి ముసి నవ్వుల చందాలు
అలిగిన వేళనె చూడాలి గోకుల కృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి

:::1


అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిల గజ్జలు ఘల్లన
అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిల గజ్జలు ఘల్లన
తల్లి మేలుకొని దొంగను చూసి ఈ ఈ ఈ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరి ఏమని అడిగినందుకే
అలిగిన వేళనె చూడాలి గోకుల కృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి

:::2


మో
హన మురళి గానము వినగా తహ తహ లాడుచు తరుణులు రాగా
మోహన మురళి గానము వినగా తహ తహ లాడుచు తరుణులు రాగా
దృష్టి తగులునని జడిసి యశోద
దృష్టి తగులునని జడిసి యశోద తనను చాటుగా దాచినందుకే
అలిగిన వేళనె చూడాలి గోకుల కృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి

Monday, March 05, 2007

సుమంగళి--1940


సంగీతం::చిత్తూరు వి.నాగయ్య
రచన::సముద్రల రాఘవాచార్య(సీనియర్) 
గానం::గౌరీపతి శాస్త్రి  

పల్లవి::

కాటమరాయడ కదిరీ నరసింహుడ
కాటమరాయడ కదిరీ నరసింహుడ
కాటమరాయడ కదిరీ నరసింహుడ
కాటమరాయడ కదిరీ నరసింహుడ
మేటైనయేటకాడ నిన్నే నమ్మితిరా
మేటైనయేటకాడ నిన్నే నమ్మితిరా
బేట్రాయి సామి దేవుడా..నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా
సేప కడుపున సేరి పుట్టితీ
రాకాసిగాని కోపాన సీరికొట్టితీ
సేప కడుపున సేరి పుట్టితీ
రాకాసిగాని కోపాన సీరికొట్టితీ
ఓపినన్ని నీళ్లలోన యెలసియేగ తిరిగినీవు
బాపనోళ్ల సదువులెల్ల బమ్మదేవరకిచ్చినోడ
బాపనోళ్ల సదువులెల్ల బమ్మదేవరకిచ్చినోడ
బేట్రాయి సామి దేవుడా..నన్నేలినోడ 
బేట్రాయి సామి దేవుడా

Saturday, March 03, 2007

అగ్గి పిడుగు--1964



సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,S.జానకి
Film Directed By::B.Vithalaachaari
తారాగణం::N.T.రామారావు,చిత్తూరునాగయ్య,ముక్కామల,రాజనాల,K.సత్యనారాయణ,కృష్ణకుమారి,,,,రాజశ్రీ,జయంతి,సత్యవతి,జానకి,అన్నపూర్ణ.

పల్లవి::

ఆహా..అహా..ఓహో..ఓహో..
మ్మ్ హుహు మ్మ్ హుహుహు..ఓఓఓఓ.. 
ఎవరనుకొన్నావే..ఏమనుకొన్నావే
ఎవరనుకొన్నావే..ఏమనుకొన్నావే
చక్కని చెలికాడే--చిక్కని నెలరేడే
చక్కని చెలికాడే--చిక్కని నెలరేడే 
ఎవడే--ఎవడే--ఇంకెవడే నాప్రియుడే
ఎవరనుకొన్నావే..ఏమనుకొన్నావే

ఆహా ఆహహా..ఓహో..ఓహోహో..ఆ ఆఆ 
ఎవరనుకొన్నావే..ఏమనుకొన్నావే
ఎవరనుకొన్నావే..ఏమనుకొన్నావే
ఎగు భుజములవాడే..మగసిరికలవాడే
ఎగు భుజములవాడే..మగసిరికలవాడే
ఎవడే--ఎవడే--ఇంకెవడే నాప్రియుడే
ఎవరనుకొన్నావే..ఏమనుకొన్నావే
ఎవరనుకొన్నావే..ఏమనుకొన్నావే

చరణం::1

చంపకు చారడేసి..కన్నులతో 
సంపంగి పూలవంటి..వన్నెలతో..ఓఓఓఓ
చంపకు చారడేసి..కన్నులతో 
సంపంగి పూలవంటి..వన్నెలతో..ఓఓఓఓ 
కలలో తానే..కనిపించాడే
కలలో తానే..కనిపించాడే 
చెలియా..మ్మ్..నన్నే కవ్వించాడే 

ఎవరనుకొన్నావే..ఏమనుకొన్నావే
ఎవరనుకొన్నావే..ఏమనుకొన్నావే

చరణం::2

అతడే కోరచూపు..చూస్తుంటే
ఆపైన పడుచుగాలి..వీస్తుంటే..ఓఓఓఓఓ
అతడే కోరచూపు..చూస్తుంటే
ఆపైన పడుచుగాలి..వీస్తుంటే..ఏఏఏ 
ఏదో..ఏదో..అయిపోతానే
ఏదో..ఏదో..అయిపోతానే 
ఎంతో..ఎంతో..బాగుంటాదే

ఎవరనుకొన్నావే..ఏమనుకొన్నావే
ఎవరనుకొన్నావే..ఏమనుకొన్నావే

చరణం::3

చల్లని నీటిలోన..నేనుంటే..హాయ్..హాయ్ 
వెచ్చని నారాజు..తోడుంటే
ఓఓఓఓ..చల్లని నీటిలోన..నేనుంటే..అహా 
వెచ్చని నారాజు..తోడుంటే
మనసే లోలో..ఝుమ్మంటాదే 
మనసే లోలో..ఝుమ్మంటాదే     
వలపే అలయై..రమ్మంటాదే  

ఎవరనుకొన్నావే..ఏమనుకొన్నావే
ఎవరనుకొన్నావే..ఏమనుకొన్నావే 
ఎవడే--ఎవడే--ఇంకెవడే నాప్రియుడే
ఆహహహా ఆహా ఆహహహా ఆహా
ఓహోహోహో ఓహో ఓహోహోహో ఓహో

Aggi Pidugu--1964
Music::Raajan-Naagendra
Lyrics::D.C.Naaraayana
Singer's::P.Suseela,S.Jaanaki
Film Directed By::B.Vithalaachaari
Cast::N.T.RamaaRao,Chittoorunaagayya,Mukkaamala,Raajanaala,K.Satyanaaraayana,Krishnakumaari,,,Raajasree,Jayanti,Satyavati,Jaanaki,Annapoorna.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

aahaa..ahaa..OhO..OhO..
mm huhu mm huhuhu..OOOO.. 
evaranukonnaavE..EmanukonnaavE
evaranukonnaavE..EmanukonnaavE
chakkani chelikaaDE--chikkani nelarEDE
chakkani chelikaaDE--chikkani nelarEDE 
evaDE--evaDE--inkevaDE naapriyuDE
evaranukonnaavE..EmanukonnaavE

Ahaa aahahaa..OhO..OhOhO..aa aaaaaa 
evaranukonnaavE..EmanukonnaavE
evaranukonnaavE..EmanukonnaavE
egu bhujamulavaaDE..magasirikalavaaDE
egu bhujamulavaaDE..magasirikalavaaDE
evaDE--evaDE--inkevaDE naapriyuDE
evaranukonnaavE..EmanukonnaavE
evaranukonnaavE..EmanukonnaavE

::::1

champaku chaaraDEsi..kannulatO 
sampangi poolavanTi..vannelatO..OOOO
champaku chaaraDEsi..kannulatO 
sampangi poolavanTi..vannelatO..OOOO 
kalalO taanE..kanipinchaaDE
kalalO taanE..kanipinchaaDE 
cheliyaa..mm..nannE kavvinchaaDE 

evaranukonnaavE..EmanukonnaavE
evaranukonnaavE..EmanukonnaavE

::::2

ataDE kOrachoopu..choostunTE
Apaina paDuchugaali..veestunTE..OOOOO
ataDE kOrachoopu..choostunTE
Apaina paDuchugaali..veestunTE..EEE 
EdO..EdO..ayipOtaanE
EdO..EdO..ayipOtaanE 
entO..entO..baagunTaadE

evaranukonnaavE..EmanukonnaavE
evaranukonnaavE..EmanukonnaavE

::::3

challani neeTilOna..nEnunTE..haay..haay 
vechchani naaraaju..tODunTE
OOOO..challani neeTilOna..nEnunTE..ahaa 
vechchani naaraaju..tODunTE
manasE lOlO..JummanTaadE 
manasE lOlO..JummanTaadE     
valapE alayai..rammanTaadE  

evaranukonnaavE..EmanukonnaavE
evaranukonnaavE..EmanukonnaavE 
evaDE--evaDE--inkevaDE naapriyuDE
aahahahaa aahaa aahahahaa aahaa
OhOhOhO OhO OhOhOhO OhO