సంగీతం::V.కుమార్ రచన::D.C.నారాయణ రెడ్డి గానం::SP.బాలు,P.సుశీల తారగణం::శోభన్‌బాబు,రామకృష్ణ,ప్రభాకరరెడ్డి,వాణిశ్రీ,లత,గీతాంజలి,గుమ్మడి ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు తొలినాటి ప్రేమ దీపం కలనైన ఆరిపోదు తొలినాటి ప్రేమ దీపం కలనైన ఆరిపోదు ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు ఎన్నడు నీకన్నులు నాకన్నులతో మాటాడు కొన్నాయో ఎన్నడు నీకన్నులు నాకన్నులతో మాటాడు కొన్నాయో ఎన్నడు నీ చేతులు నా చేతులతో ఆటాడు కొన్నాయో ఎన్నడు నీ చేతులు నా చేతులతో ఆటాడు కొన్నాయో పొదలో ప్రతిపూవూ పొంచి పొంచి చూసినదీ భువిలో ప్రతిగువ్వా గుసగుసలాడినవి కలసిన కౌగిలిలో కాలమే ఆగినదీ ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా ఆ....కొంటెగా నిన్నేదో కోరాలనివుంది ఆ....తనువే నీదైతే దాచేదేముంది మనసులవీణియపై బ్రతుకే మ్రోగిందీ ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు
సంగీతం::V.కుమార్ రచన::రాజశ్రీ గానం::V. రామక్రిష్ణ , P.సుశీల తారగణం::శోభన్‌బాబు,రామకృష్ణ,ప్రభాకరరెడ్డి,వాణిశ్రీ,లత,గీతాంజలి,గుమ్మడి పల్లవి:: మధువొలక బోసే ఈ చిలిపి కళ్ళు అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ మధువొలక బోసే ఈ చిలిపి కళ్ళు అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళు అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ చరణం::1 అడగకనే ఇచ్చినచో అది మనసుకందమూ అనుమతినే కోరకనే నిండేవు హృదయమూ తలవకనే కలిగినచో అదిప్రేమ బంధమూ బహుమతిగా దోచితివీ నాలోని సర్వమూ మనసు మనసుతో..ఊసులాడనీ మూగభాషలో..బాసచేయనీ ఈ నాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళు అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ చరణం::2 గగనముతో కడలి చెలి పలికినది ఏమనీ తలపులకు..వలపులకు..సరిహద్దు లేదనీ కుసుమముతో ఆ భ్రమరం తెలిపినది ఏమనీ జగమునకు మన చెలిమి ఆదర్శమౌననీ కలలు తీరగా..కలిసి పొమ్మనీ కౌగిలింతలో..కరిగి పొమ్మనీ ఈ నాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ మధువొలకబోసే..హా ఈ చిలిపి కళ్ళు..ఆ అవి నాకు వేసే..ఆ
sorry so sorry నామాటవిన్నింకోసారి sorry so sorry నామాటవిన్నింకోసారి ప్రేమించలేదు నిన్ను ఈ బ్రహ్మచారి పెళ్ళాడితే నిన్ను నాదారే గోదారి sorry so sorry నామాటవిన్నింకోసారి !! చూడు ఇటు చూడు నావంక చూసి మాటాడు చూడు ఇటు చూడు నావంక చూసి మాటాడు ప్రేమించలేదా నువ్వు నన్నే ఏరికోరి కాదంటే వదలను నిన్ను ఓ బ్రహ్మచారి sorry so sorry నామాటవిన్నింకోసారి !!
నిన్నకాక అటుమొన్నటెకాదా కళ్ళు కళ్ళు కలిపేవు " అవునూ" వెన్నలాంటి నా మనసును దోచి బాసలెన్నొ చేసావు "అవునూ" నిన్నకాక అటుమొన్నటెకాదా కళ్ళు కళ్ళు కలిపేవు వెన్నలాంటి నా మనసును దోచి బాసలెన్నొ చేసావు ఆశపెంచి మురిపించిన నువ్వె మనిషి మారిపోయావు
తప్పుతెలుసుకొన్నాను మనసు మార్చుకొన్నాను నా తప్పుతెలుసుకొన్నాను మనసు మార్చుకొన్నాను కాబోయే శ్రీమతి ఇలా వుండకోడదనుకొన్నాను sorry so sorry నామాటవిన్నింకోసారి !!
తిండిపోతులా తింటే కాదు వండే చిన్నది కావాలి " ఊ..హు..హు...హు..." ఏడుపు అంటే నాకు గిట్టదు ఎపుడూ నవ్వుతు వుండాలీ " అలాగా "తిండిపోతులా తింటే కాదు వండే చిన్నది కావాలి ఏడుపు అంటే నాకు గిట్టదు ఎపుడూ నవ్వుతు వుండాలీ చీటికి మాటికి అలగకూడదు తోడూ నీడగ వుండాలి
వంట నేర్చుకొంటాను "రియల్లీ" నవ్వులు చిందిస్తాను "ప్రామిస్ " వంట నేర్చుకోంటాను నవ్వులు చిందిస్తాను నీతోటె నేనుంటాను నీమాటే వింటాను అయితే ఇక రేపే మ్రోగేను పెళ్ళి సన్నాయి ఎల్లుండే నీ చేతుల్లో వుంటుంది పాపాయి జో...హాయీ హాయీ జో హయీ...హాయీ జో...
నీసొగసు పిలిచింది నా వయసు పలికింది నడిరేయిసైయ్యందీ మౌనమిక చాలందీ నీసొగసు పిలిచింది నా వయసు పలికింది నడిరేయిసైయ్యందీ మౌనమిక చాలందీ ఈ జగమంతా కొత్తగ వుంది ఈ క్షణమేదో మత్తుగ వుంది పొంగేనులే...యవ్వనం
చెలి చూపులోన కథలెన్నో తోచే చలి గాలిలోన పరువాలు వీచే జడివాన పడుతున్నా ఏమితో ఈ దాహం ఎదురుగా నీవున్నా ఎందుకో ఈ తాపం జడివాన పడుతున్నా ఏమితో ఈ దాహం ఎదురుగా నీవున్నా ఎందుకో ఈ తాపం ఆరని జ్వాలలు మనసున రేగే తీరని కోరికలు చెలరేగే కలిగేనులే....పరవశం