సంగీతం::K.V. మహాదేవన్ రచన::ఆత్రేయ గానం::P.సుశీల పటదీప్::రాగ పల్లవి:: ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ..... ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి నీ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి నీ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి ఎవరో రావాలి చరణం::1 మూల దాగి ధూళి మూగి మూగవోయిన మధురవీణ మూల దాగి ధూళి మూగి మూగవోయిన మధురవీణ మరిచి పోయిన మమతలాగా..మరిచి పోయిన మమతలాగా మమతలుడికిన మనసు లాగా మాసిపోతగునా ఎవరో రావాలి చరణం::2 ఎన్ని పదములు నేర్చినావో ఎన్ని కళలను దాచినావో ఎన్ని పదములు నేర్చినావో ఎన్ని కళలను దాచినావో కొనగోట మీటిన చాలు కొనగోట మీటిన చాలు నీలో కోటిస్వరములు పలుకును ఏవరో రావాలి చరణం::3 రాచనగరున వెలసినావు రస పిపాసకు నోచినావు రాచనగరున వెలసినావు రస పిపాసకు నోచినావు శక్తి మరచి రక్తి విడచి శక్తి మరచి రక్తి విడచి మత్తు ఎదో మరగినావు మరచిపోతగునా ఏవరో రావాలి నీ హృదయం కదిలించాలి నీ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి ఎవరో రావాలి