సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు
తారాగణం::శోభన్ బాబు, జయసుధ,జగ్గయ్య,అంజలీదేవి,కాంతారావు,జయమాలిని,
అల్లు రామలింగయ్య
పల్లవి::
మా యింట వెలసిన..మహలక్ష్మివీ
నా కంటి..వెలుగైన దీపానివీ..ఈ
నీ నవ్వు లేకుంటే..చీకటేనమ్మ
నీ కనుల కనీళ్ళు..చూడలేనమ్మా
నీ నవ్వు లేకుంటే..చీకటేనమ్మ
నీ కనుల కనీళ్ళు..చూడలేనమ్మా
మా యింట వెలసి..మహలక్ష్మివీ
నా కంటి వెలుగైన..దీపానివీ
నీ నవ్వు లేకుంటే..చీకటేనమ్మ
నీ కనుల కనీళ్ళు..చూడలేనమ్మా
చరణం::1
నడక నేర్పిన అమ్మ..నడిపించుతుందీ
తోడబుట్టిన నేను..తోడుగా ఉంటామూ
పసి మనసు ఆశలకు..పందిళ్ళు వేస్తామూ
నవ్వవే నవ్వవే నా తల్లి..నాకోసమూ నా కోసమూ
నీ నవ్వు లేకుంటే...చీకటేనమ్మ
నీ కనుల కనీళ్ళు...చూడలేనమ్మా
చరణం::2
కన్నీటితో నవ్వు..కలిపిచూడమ్మా..ఆ
ఇన్నాళ్ళ చీకటీ..వెన్నెలౌనమ్మా..ఆ
కన్నీటితో నవ్వు..కలిపిచూడమ్మా
ఇన్నాళ్ళ చీకటీ..వెన్నెలౌనమ్మా
కలతలేని నిదురలో..గడిచిపోవు రాత్రిలా..ఆ
కలతలేని నిదురలో..గడిచిపోవు రాత్రిలా
కమ్ముకున్న కడగళ్ళు కరిగిపోవునమ్మ కరిగిపోవునమ్మా
నీ నవ్వు లేకుంటే..చీకటేనమ్మ
నీ కనుల కనీళ్ళు..చూడలేనమ్మా
మా యింట వెలసిన..మహలక్ష్మివీ
నా కంటి వెలుగైన..దీపానివీ
నీ నవ్వు లేకుంటే..చీకటేనమ్మ
నీ కనుల కనీళ్ళు..చూడలేనమ్మా