Tuesday, January 29, 2008

చక్రవాకం--1974



సంగీతం::KV.మహాదేవన్
రచన
::ఆచార్య ఆత్రేయ
గానం
::ఘంటసాల,P.సుశీల

ఈ నదిలా నా హౄదయం
పరుగులు తీస్తుందీ
ఏ ప్రేమకడలినో...
ఏ వెచ్చని ఒడినో...
వెతుకుతు వెళుతుండీ....
వెతుకుతు వెళుతుందీ..

వలపువాన తెల్లదనం తెలియనిదీ
వయసు వరదపొంగు సంగతే ఎరగనిదీ
వలపువాన తెల్లదనం తెలియనిదీ
వయసు వరదపొంగు సంగతే ఎరగనిదీ
కడలి కెరటాల గలగలలూ రేగనిదీ
గట్టు సరిహద్దు కలతపడీదాటనిదీ
ఏ మబ్బు మెరిసిందో ఏ జల్లు కురిసిందో
ఎంతగా మారినదీ ఎందుకో ఉరికినది
ఎంతగా మారినదీ ఎందుకో ఉరికినది

ఈ నదిలా నా హౄదయం
పరుగులు తీస్తుందీ...
ఏ ప్రేమ కడలినో
ఏ వెచ్చని ఒడినో...
వెతుకుతు వెళుతోందీ
వెతుకుతు వెళుతోందీ !!!

అడవి పిల్లల్లే ఎక్కడో పుట్టినదీ
అడుగడుగునా సొగసు వాగు చేసుకొన్నదీ
అడవి పిల్లల్లే ఎక్కడో పుట్టినదీ
అడుగడుగునా సొగసు వాగు చేసుకొన్నదీ
వలపు మలపులో ఒక వంపు తిరిగినదీ
వలపు మలపులో ఒక వంపు తిరిగినదీ
ఏ మనిషికీ మచ్చికకు రానన్నదీ
ఏ తోడు కలసినదో ఏ లోటు తెలిసినదో
వింతగా మారినదీవెల్లువై ఉరికినదీ
వింతగా మారినదీవెల్లువై ఉరికినదీ

ఈ నదిలా నా హౄదయం
పరుగులు తీస్తుందీ...
ఏ ప్రేమ కడలినో
ఏ వెచ్చని ఒడినో...
వెతుకుతు వెళుతోందీ
వెతుకుతు వెళుతోందీ
!!!