Monday, May 02, 2011

నేరం నాదికాదు ఆకలిది--1976


సంగీతం::సత్యం
రచన::ఆరుద్ర
గానం::S.జానకి
తారాగణం::N.T.రామారావు,మంజుల,లత,మురళీమోహన్,గుమ్మడి,జయమాలిని,ప్రభ,గిరిబాబు.

పల్లవి::

డైమన్‌ రాణీ గులాబీ బుగ్గ..నీదే
ఓయ్‌..ఆఠీన్‌ రాజా మసాలా ముద్దు నాదే
ఈ రాతిరీ ఏమైన కానీ..బిగికౌగిట 
కరగాలిరా...రా రా రా రా 
డైమన్‌ రాణీ గులాబీ..బుగ్గ నీదే
ఓయ్‌..ఆఠీన్‌ రాజా మసాలా ముద్దు నాదే
ఈ రాతిరీ ఏమైన కానీ..బిగికౌగిట 
కరగాలిరా...రా రా రా రా 

చరణం::1

నీ పెగ్గులో అసలు లేదోయి రాదోయి కిక్కు
నా బుగ్గలో ఉంది ఉందోయి ఏదో చమక్కు
ఈ మత్తులో గమ్మత్తుగా..మైమరచి ఊగాలిరా       
డైమన్‌ రాణీ గులాబీ బుగ్గనీదే
ఓయ్‌..ఆఠీన్‌ రాజా మసాలాముద్దు నాదే
ఈ రాతిరీ ఏమైన కానీ..బిగికౌగిట 
కరగాలిరా...రా రా రా రా 

చరణం::2

ఈ సొంపులే మంచి ముత్యాల వజ్రాల సాటి
నా ఒంపులా నింపు పదివేల వరహాలకోటి
ఈ సొంపులే మంచి ముత్యాల వజ్రాల సాటి
నా ఒంపులా నింపు పదివేల వరహాలకోటి
అందాలతో బంధించుతా..సరదాలో ముంచుతా        
డైమన్‌ రాణీ గులాబీ బుగ్గ..నీదే
ఓయ్‌..ఆఠీన్‌ రాజా మసాలా ముద్దు నాదే
ఈ రాతిరీ ఏమైన కానీ..బిగికౌగిట 
కరగాలిరా..రా రా రా రా
డైమన్‌ రాణీ గులాబీ బుగ్గ..నీదే