Thursday, August 16, 2012

మన జిక్కిగారి వర్ధ౦తి నేడు




మన౦దరికీ జిక్కిగా చిరపరిచితమైన పిల్లవలు గజపతి క్రిష్ణవేణి గారి వర్ధ౦తి నేడు

అసలుపేరు : పిల్లవలు గజపతి కృష్ణవేణి
జననం : 03-11-1935
జన్మస్థలం : చిత్తూరులోని చంద్రగిరి
తల్లిదండ్రులు : రాజకాంతమ్మ,గజపతినాయుడు, తోబుట్టువులు : నలుగురు తమ్ముళ్లు, నలుగురు చెల్లెళ్లు
చదువు : బి.ఏ., వివాహం : 26-06-1958
భర్త : గాయకుడు ఎ.ఎం.రాజా
సంతానం : ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు (అందరూ సంగీతంలో కృషి చేస్తున్నవారే)

తొలిపాట-చిత్రం : ఈ తీరని నిన్నెరిగి పలుకగా నా తరమా జగదేకకారణా - పంతులమ్మ (1943)
ఆఖరిపాట-చిత్రం : అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి - మురారి (2001)

పాటలు : దాదాపు పదివేలు (తెలుగు, తమిళ , మలయాళ, కన్నడ, హిందీ, సింహళ భాషలలో)
నటించిన సినిమాలు : పంతులమ్మ (1943), మంగళసూత్రం (1946)
అవార్డులు : తమిళనాడు నుండి ‘కళైమామణి’, తమిళనాడు రాష్ట్ర అవార్డు, తెలుగు ఉగాది పురస్కారం, మరికొన్ని సంగీత అవార్డులు అందుకున్నారు.

ఇతరవిషయాలు : కృష్ణవేణి తన 7వ ఏట నుండే పాటలు పాడడం మొదలుపెట్టారు. చిన్నప్పటి నుండే స్టేజి ప్రోగ్రామ్స్‌లో చురుకుగా పాల్గొనేవారు. గూడవల్లి రామబ్రహ్మం సహాయంతో గాయకురాలిగా, నటిగా చిత్రసీమకు పరిచయం అయ్యారు. సంగీతం నేర్చుకోకుండా దేవుడు ప్రసాదించిన గొంతుతో ఎన్నో ఆణిముత్యాలను పలికించి సంగీత ప్రియులను అలరించారు. దేశవిదేశాలలో ఎన్నో స్టేజి ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్నారు. అసలు పేరు కృష్ణవేణి అయినా ఆమె జిక్కిగా ప్రసిద్ధికెక్కారు.

మరణం : 16-08-2004