Monday, February 25, 2013

ప్రేమతరంగాలు--1980


సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణంరాజు,జయసుధ,చిరంజీవి.

పల్లవి::

నా హృదయం తెల్లకాగితం
అది ఏనాడో నీకు అంకితం
బేషరతుగా ఇచ్చేశా ప్రేమ పత్రమూ
ఏమైనా రాసుకో నీ ఇష్టమూ
నా హృదయం తెల్లకాగితం
అది ఏనాడో నీకు అంకితం

చరణం::1

మెరుపై మెరిశావు చినుకై కురిశావు
చిగురులు వేశావు నాలో
చల్లగా వచ్చావు వెచ్చగా మారావు
పచ్చగా మిగిలావు నాలో
అల చిన్నారివి ఇక వయ్యారివి
ఆ నెయ్యానివి ఇక వియ్యానివి
ఆ కలుసుకున్నాము నేడు
మన కథ రాసుకున్నాము రేపు
నా హృదయం తెల్లకాగితం

చరణం::2

పూచిన జాబిల్లి పున్నమి సిరిమల్లి 
నాకిక నెచ్చెలివి నీవే 
పొంగే గోదారి పూవుల రాదారి 
నాకిక సహచారివి నీవే
నా కలవాణివి ఇక కళ్యాణివి 
అల నెలరాజువి ఇక నా రాజువీ 
ఆఆ కలసి పోయాము మనమూ 
ఇక కలబోసుకుందాము సుఖమూ
నా హృదయం తెల్లకాగితం

అడుగు జాడలు--1966




సంగీతం::మాస్టర్ వేణు
రచన::శ్రీ శ్రీ
గానం::ఘంటసాల,B.వసంత
తారాగణం::N.T.రామారావు, జమున, S.V.రంగారావు, రేలంగి, రమాప్రభ 

పల్లవి::

తూలీ సోలెను తూరుపు గాలి..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
తూలీ సోలెను తూరుపు గాలి..గాలివాటులో సాగెను నావ
తూలీ సోలెను తూరుపు గాలి..గాలివాటులో సాగెను నావ
నావను నడిపే మాలిని నేనే..ఏ..ఏ..ఏ..
నావను నడిపే మాలిని నేనే..నన్నే నడిపే దేవత నీవే..
తూలీ సోలెను తూరుపు గాలి..హైలెస్సా..హైలెస్సా..హైలెస్సా
మ్మ్ హు మ్మ్ హు మ్మ్హు ఆహా ఆహ్హా..

చరణం::1

గాలి విసరి నీ కురులే చేదరీ..నీలి మబ్బులే గంతులు వేసే
బెదరు పెదవుల నవ్వులు చూసి..బెదరు పెదవుల నవ్వులు చూసి
చిరు కెరటాలే చిందులు వేసే..చిరు కెరటాలే చిందులు వేసే
తూలీ సోలెను తూరుపు గాలి... 

చరణం::2

చెలి కన్నులలో చీకటి చూచీ..జాలి జాలిగా కదలెను నావ
చీకటి ముసరిన జీవితమల్లే..చీకటి ముసరిన జీవితమల్లే
నీ కన్నులతో వెదకెద త్రోవ..నీ కన్నులతో వెదకెద త్రోవ

తూలీ సోలెను తూరుపు గాలి..గాలివాటులో సాగెను నావ
తూలీ సోలెను తూరుపు గాలి..గాలివాటులో సాగెను నావ
నావను నడిపే మాలిని నేనే..నావను నడిపే మాలిని నేనే
నన్నే నడిపే దేవత నీవే..తూలీ సోలెను తూరుపు గాలి
హైలేసా హైలేసా హైలే హైలేసా..హైలేసా హైలేసా హైలే హైలేసా

Adugujaadalu--1966
Music::Master Venu 
Lyricist::SriSri
Singer's::Ghantasala,B.Vasantha 
Cast::N.T.Ramarao,Jamuna,S.V.Rangarao,Relangi,Ramaaprabha.

:::

Thooli solenu thoorupu gaali
O..O..O..O..O..O
Thooli solenu thoorupu gaali
gaali vaatulo saagenu naava 
Thooli solenu thoorupu gaali
gaali vaatulo saagenu naava 
naavanu nadipE maalini nEnE
naavanu nadipE maalini nEnE 
nannE naDipE dEvata nIvE 
Thooli solenu thoorupu gaali 
hailessA..hailessA..hailessA 

:::1

gAli visari..nI kurulE cedari 
nIli mabbulE.. gaMtulu vEsE
bedaru pedavulA navvulu cUsi 
bedaru pedavulA navvulu cUsi
ciru keraTAlE ciMdulu vEsE 
ciru keraTAlE ciMdulu vEsE 
Thooli solenu thoorupu gaali 

:::2

cheli kannulalO cIkaTi cUsi 
jAli jAligA kadalenu nAvA
cIkaTi musirina jIvita maMdE 
E..cIkaTi musirina jIvita maMdE
nI kannulatO vedakida trOva 
nI kannulatO vedakida trOva 

:::3

Thooli solenu thoorupu gaali 
gaali vaatulo saagenu naava 
naavanu nadipE maalini nEnE 
E..nannE naDipE dEvata nIvE 
Thooli solenu thoorupu gaali 

hailesA..hailessA..hailessA


అడుగు జాడలు--1966







సంగీతం::మాస్టర్ వేణు
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::ఘంటసాల,S.జానకి

పల్లవి::

ఆ హా..హా..ఆ ఆ ఆ ఆహా..ఆ ఆ ఆ 
మల్లెలు కురిసిన..చల్లని వేళలొ 
మనసే పలికెను..నేడేలనొ ఏలనొ
మల్లెలు కురిసిన..చల్లని వేళలొ 
మనసే పలికెను..నేడేలనొ ఏలనొ

మల్లెలు కురిసిన..చల్లని వేళలొ 
మనసే పలికెను..నేడేలనొ ఏలనొ

చరణం::1

చలి చలి గాలులు..చిలిపిగ వీచే
జిలిబిలి తలపులు..చిగురులు వేసే
తొలకరి వలపే..తొందర చేసే
యవ్వనమేమో సవ్వడి చేసే 
యవ్వనమేమో సవ్వడి చేసే ..సవ్వడి చేసే

మల్లెలు కురిసిన..చల్లని వేళలొ 
మనసే పలికెను..నేడేలనొ ఏలనొ

చరణం::2

పిలువని కనులే..పిలిచెను నన్నే 
పలుకని జాబిలి..వలిచెను నన్నే 
అందాలేవో అలలై ఆడే 

అందని కౌగిలి అందెను నేడే
అందని కౌగిలి అందెను నేడే..అందెను నేడే

మల్లెలు కురిసిన..చల్లని వేళలొ 
మనసే పలికెను..నేడేలనొ ఏలనొ

చరణం::3

సొగసులు విరిసే..వెన్నెలలోన
యెగిసే ఊహల..పల్లకి పైన
నీవే నేనై..పయనించేమ
నేనే నీవై..పయనించేమ
జీవన రాగం పలికించేమ  
జీవన రాగం పలికించేమ..పలికించేమ

మల్లెలు కురిసిన..చల్లని వేళలొ 
మనసే పలికెను..నేడేలనొ ఏలనొ

Adugujaadalu--1966
Music::Master Venu 
Lyricist::SriSri
Singer's::Ghantasala,B.Vasantha 
Cast::N.T.Ramarao,Jamuna,S.V.Rangarao,Relangi,Ramaaprabha.

:::

Mallelu kurisina challani..velalo
manase palikenu nedelano..yelanoo
Mallelu kurisina challani..velalo
manase palikenu nedelano..yelanoo
Mallelu kurisina challani..velalo
manase palikenu nedelano..yelanoo

:::1

chalichali galulu chilipiga veeche
jilibili talapulu chigurulu vese
tolakari vayase tondara chese
yavvanamemo savvadi chese
yavvanamemo savvadi chese savvadi chese
Mallelu kurisina challani velalo
manase palikenu nedelano..yelanoo

:::2

piluvani kanulE pilicenu nannE
palukani jAbili valacenu nannE  
amdaalevo alalai aade
amdani kaugiLi aMdenu nede 
aMdani kaugiLi amdenu nede amdenu nede  
Mallelu kurisina challani velalo
manase palikenu nedelano..yelano

:::3

sogasulu virise vennelalona
yegise uhala pallaki paina
neeve nenai payaninchemaa
nene neevvai payaninchemaa
jeevana ragam palikinchemaa
jeevana ragam palikinchemaa palikinchemaa
Mallelu kurisina challani velalo

manase palikenu nedelano... yelanoo


శ్రీ కాళహస్తి మహిమ--1954




సంగీతం::R.సుదర్శనం
రచన::తోలేటి
గానం::ఘటసాల
Film Directed By::H.L.N.Simha
తారాగణం::రాజ్‌కుమార్,K.మాలతి,కుమారి,లింగమూర్తి,పద్మనాభం,రాజసులోచన,ౠష్యేంద్రమణి.     

పల్లవి::

మధురము శివమంత్రం మహిలో
మరువకె ఓ మనసా..ఆ
మధురము శివమంత్రం మహిలో
మరువకె ఓ మనసా

ఇహ పర సాధనమే..ఏఏఏఏఏఏఏఏ
ఇహ పర సాధనమే..ఇహ పర సాధనమే.. 
ఇహ పర సాధనమే..ఇహ పర సాధనమె నరులకు
సురుచిర..తారకమె
ఇహ పర సాధనమే..నరులకు సురుచిత తారకమే 

చరణం::1

ఆగమ సంచార..ఆగమ సంచార
ఆగమ సంచార..ఆగమ సంచార
నా స్వాగతమిదె గొనుమా..ఆ ఆ ఆ 
ఆగమ సంచార..ఆగమ సంచార
నా స్వాగతమిదె గొనుమా..ఆ
భావజ సణారా..భావజ సణారా
భావజ సణారా..నన్నుకావగ రావయ్య 
భావజ సణారా..నన్నుకావగ రావయ్య 

చరణం::2

పాలను ముంచెదవో..ఓఓఓఓఓఓఓఓఓఓఓ
పాలను ముంచెదవో..ఒ
మున్నీటను ముంచెదవో..ఓఓఓఓఓ
పాలను ముంచెదవో..మున్నీటను ముంచెదవో
భారము నీదయ్యా..భారము నీదయ్యా
పాదము విడనయ్యా..నీ పాదము విడనయ్యా
జయహే సర్వేశా..జయహే సర్వేశా 
సతీ శాంభవి ప్రాణేశా..ఆఆ
జయహే సర్వేశా..సతీ శాంభవి ప్రాణేశా..ఆ
కారుణ్యగుణ సాగరా..కారుణ్యగుణ సాగరా..ఆ 
శ్రీకాళహస్తీశ్వరా నన్ను..కాపాడవా శంకరా 
కారుణ్యగుణ సాగరా..కారుణ్యగుణ సాగరా..ఆ 
శ్రీకాళహస్తీశ్వరా నన్ను..కాపాడవా శంకరా

మధురము శివమంత్రం మహిలో
మరువకె ఓ మనసా
ఇహ పర సాధనమే..నరులకు సురుచిత తారకమే 

Sree Kaalahasti Mahima--1954
Music::R.Sudarsanam
Lyrics::TOleTi
Singer::Ghatasaala
Film Directed By::H.L.N.Simha
Cast::RaajKumaar,K.Maalati,Kumaari,Lingamoorti,Padmanaabham,Raajasulochana,Rushyendramani.

:::::::::::::::::::::::::::::::::

madhuramu Sivamantram mahilO
maruvake O manasaa..aa
madhuramu Sivamantram mahilO
maruvake O manasaa

iha para saadhanamE..EEEEEEEE
iha para saadhanamE..iha para saadhanamE.. 
iha para saadhanamE..iha para saadhaname narulaku
suruchira..taarakame
iha para saadhanamE..narulaku suruchita taarakamE 

::::1

aagama sanchaara..aagama sanchaara
aagama sanchaara..aagama sanchaara
naa swaagatamide gonumaa..aa aa aa 
aagama sanchaara..aagama sanchaara
naa swaagatamide gonumaa..aa
bhaavaja sanhaaraa..bhaavaja sanhaaraa
bhaavaja sanhaaraa..nannukaavaga raavayya 
bhaavaja sanhaaraa..nannukaavaga raavayya 

::::2

paalanu munchedavO..OOOOOOOOOOO
paalanu munchedavO..o
munneeTanu munchedavO..OOOOO
paalanu munchedavO..munneeTanu munchedavO
bhaaramu needayyaa..bhaaramu needayyaa
paadamu viDanayyaa..nee paadamu viDanayyaa
jayahE sarvESaa..jayahE sarvESaa 
satee Saambhavi praaNESaa..aaaaaa
jayahE sarvESaa..satii Saambhavi praaNESaa..aa
kaaruNyaguNa saagaraa..kaaruNyaguNa saagaraa..aa 
SreekaaLahasteeSwaraa nannu..kaapaaDavaa Sankaraa 
kaaruNyaguNa saagaraa..kaaruNyaguNa saagaraa..aa 
SreekaaLahasteeSwaraa nannu..kaapaaDavaa Sankaraa

madhuramu Sivamantram mahilO
maruvake O manasaa
iha para saadhanamE..narulaku suruchita taarakamE 

అడుగు జాడలు--1966




సంగీతం::మాస్టర్ వేణు
రచన::D.C.నారాయణరెడ్డి  
గానం::ఘంటసాల,P.సుశీల 

పల్లవి::

అతడు:అంత కోపమైతే నేనెంత బధ పడతానో
తెలుసా తెలుసా

ఆమె:అలా వెంట పడితే నేనెలా మండి పడతానో
తెలుసా  తెలుసా                  

అతడు:అంత కోపమైతే నేనెంత బధ పడతానో
తెలుసా తెలుసా

ఆమె:అలా వెంట పడితే నేనెలా మండి పడతానో
తెలుసా  తెలుసా

చరణం::1

అతడు:గులాబి పువ్వంటే భలేగా మోజుంది
అహా..ఓహో..ఆహాహాహాహా...
ముళ్ళు గుచ్చుకుంటాయని..మొన్న మొన్న తెలిసింది
గులాబి పువ్వంటే భలేగా మోజుంది
ముళ్ళు గుచ్చుకుంటాయని..మొన్న మొన్న తెలిసింది

ఆమె:ఆ మోజులెందుకో  ఆ పోజులెందుకో
ఆ మోజులెందుకో  ఆ పోజులెందుకో
అందాల పూల జోలి అడవి మనిషికెందుకో
ఓ ఓ ఓ ....

అతడు:అంత కోపమైతే నేనెంత బధ పడతానో
తెలుసా తెలుసా

ఆమె:అలా వెంట పడితే నేనెలా మండి పడతానో
తెలుసా  తెలుసా

చరణం::2


అతడు:కసిరే నీ మదిలో మిసిమి తలపులొస్తాయి
కలలోనైనా నా వలపులు చిగురిస్తాయి
కసిరే నీ మదిలో మిసిమి తలపులొస్తాయి
కలలోనైనా నా వలపులు చిగురిస్తాయి

ఆమె:తలపులు లేవులే కలలే రావులే
తలపులు లేవులే కలలే రావులే..ఏ..ఓ ఓ ఓ
కిలాడి మాటలల్లి వలపు గెలవ లేవులే

అతడు:అంత కోపమైతే నేనెంత బధ పడతానో
తెలుసా తెలుసా

ఆమె:అలా వెంట పడితే నేనెలా మండి పడతానో
తెలుసా  తెలుసా

అతడు:అంత కోపమైతే నేనెంత బధ పడతానో
తెలుసా తెలుసా

ఆమె:అలా వెంట పడితే నేనెలా మండి పడతానో
తెలుసా  తెలుసా

అక్బర్ సలీం అనార్కలి--1978



సంగీతం::C.రామచంద్ర
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::మహమ్మద్ రఫీ

పల్లవి::

తారలెంతగా మెరిసేను..తారలెంతగా మెరిసేను
చందురుని కోసంచందురుని కోసం
రేయి ఎంతగా మురిసేను..రేయి ఎంతగా మురిసేను
దినకరుని కోసం దినకరుని కోసం
తారలెంతగా మెరిసేను

చరణం::1

చిగురుటాకులే చేతులుగా..మిసిమిరేకులే పెదవులుగా
చిగురుటాకులే చేతులుగా..మిసిమిరేకులే పెదవులుగా
పరిమళాలే పిలుపులుగా..మకరందాలే వలపులుగా
పూవులెంతగా వేచేను..పూవులెంతగా వేచేను
తుమ్మెదల కోసం..తుమ్మెదల కోసం
తారలెంతగా మెరిసేను 

చరణం::2

నింగి రంగులే కన్నుల దాచి కడలి పొంగులే ఎదలో దాచి
నింగి రంగులే కన్నుల దాచి కడలి పొంగులే ఎదలో దాచి
గులాబి కళలే బుగ్గల దాచి మెరుపుల అలలే మేనిలో దాచి
పరువాలెంతగ వేచేను..పరువాలెంతగ వేచేను
పయ్యెదల కోసం..పయ్యెదల కోసం
తారలెంతగా మెరిసేను..చందురుని కోసం