సంగీతం::P.ఆదినారాయణ రావ్
రచన::రాజశ్రీ
గానం::P.సుశీల
పల్లవి::
ఆలయమేల..అర్చనలేలా..ఆరాధనలేలా
పతిదేవుని పదసన్నిధి మించినది వేరే కలదా
అదే సతి పెన్నిధి కాదా..అదే పరమార్ధం కాదా
చరణం::1
ఏ కొండ కొమ్మపైనో ఏ రాతి బొమ్మలోనో
దైవము దాగెనంటూ..తపిఇంచనేలా
ఏ కొండ కొమ్మపైనో ఏ రాతి బొమ్మలోనో
దైవము దాగెనంటూ..తపిఇంచనేలా
ఆ దైవం నిజముగా ఉంటే
అడుగడుగున తానై ఉంటే గుడులేల యాత్రలేలా
పతిదేవుని పదసన్నిధి మించినది వేరే కలదా
అదే సతి పెన్నిధి కాదా..అదే పరమార్ధం కాదా
ఆలయమేల..అర్చనలేలా..ఆరాధనలేలా
చరణం::2
పైపైని మెరుగుల కోసం భ్రమ చెందు గుడ్డిలోకం
మదిలోన వెలిగే అందం గమనించునా –ఈ లోకులతో పనియేమి
పాలుగాకులు ఏమంటేమి నా స్వామి తోడురాగా
పతిదేవుని పదసన్నిధి మించినది వేరే కలదా
అదే సతి పెన్నిధి కాదా..అదే పరమార్ధం కాదా
ఆలయమేల..అర్చనలేలా..ఆరాధనలేలా