సంగీతం::ఆదినారాయణరావ్ రచన::సముద్రాల రాఘవాచార్య గానం::P.సుశీల బృందం
రాగం::ద్విజావంతి(జైజైవంతి)
ఆమె::ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నీ నీడలోన నిలిచేనురా..ఆ..యువతీ మనోజా..ఆ ఆ ఆ నీ నీడలోన నిలిచేనురా నిను కొలిచేనురా..యువతీ మనోజా ఏనాటికైనా నీ దానరా..యువతీ మనోజ ఏనాటికైనా నీ దానరా రాజా నవ శోభ లీను నా మేను నీ పూజకేనురా యువతీ మనోజా ఏనాటికయినా నీ దానరా - ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ తీయని కొనగోరుల మీటి నీ తీయని కొనగోరుల మీటి మేళవించిన హృదయ విపంచి మేళవించిన ప్రేమ విపంచి మురిసి చిరుగాలి సోకునా మొరసి భవదీయ గీతమే వినిచేనే ఈవేళా.. ఏనాటి కయినా నీదానరా యువతీ మనోజా ఏనాటికయినా నీ దానరా ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రాగం::సింధుబైరవి::: ( కర్నాట సంగీతం లో "అభేరి" రాగ చాయలకు దాదాపుగా సరిపోయే హిందుస్తానీ " భీం పలాశ్రీ" రాగంలో సమకూర్చిన అత్యధ్బుతమైన పాట.) ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఓం...నమశ్శివాయః సిద్ధం నమః ఓం... జగదీశ్వరా పాహి పరమేశ్వరా.. జగదీశ్వరా పాహి పరమేశ్వరా.. దేవాపుర సంహార!..ధీర నటశేఖరా త్రాహి కరుణాకరా..పాహి సురశేఖరా
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
ఆ ఆ ఆ ఆ శంభోహరా..వినుతలంబోధరా.. అంబావరకావరా..ఆ ఆ ఆ.... శంభోహరా..వినుతలంబోధరా.. అంబావరకావరా.. వరమీయరా..గౌరి..వరసుందరా గౌరి..వరసుందరా.. నిన్నే కని మేము కొలిచేము..గంగాధరా దేవ...గంగాధరా... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ