Sunday, August 21, 2011

జానకిరాముడు--1988




సంగీతం::K.V.మహదేవన్ 
రచన::ఆచార్య ఆత్రేయ 
గానం::S.P.బాలు, K.S.చిత్ర 

పల్లవి::

ఆ ఆ హా..తానానె తననానా 
ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. 

నా గొంతు శృతిలోనా..నా గుండె లయలోనా 
పాడవే పాడవే..కోయిలా 
పాడుతూ పరవశించు..జన్మ జన్మలా 

ఆ ఆ ఆ..నా గొంతు శృతిలోనా 
నా గుండె..లయలోనా 
పాడవే పాడవే..కోయిలా 
పాడుతూ పరవశించు..జన్మ జన్మలా 

ఆ ఆ ఆ..నా గొంతు శృతిలోనా
ఆ ఆ ఆ..నా గుండె లయలోనా 

చరణం::1

ఒక మాట పదిమాటలై
అది పాట కావాలనీ..ఈ ఈ ఈ 
ఒక జన్మ పది జన్మలై..ఈ ఈ
అనుబంధమవ్వాలనీ..ఈ ఈ 
అన్నిటా ఒక మమతే..పండాలని..మ్మ్ 
అది దండలో దారమై..ఉండాలనీ..మ్మ్ 
అన్నిటా ఒక మమతే..పండాలని 
అది దండలో దారమై..ఉండాలనీ 
కడలిలో అలలుగా కడలేని కలలుగా 
నిలిచిపోవాలనీ..ఈ..ఈ..ఈ 
పాడవే..పాడవే..కోయిలా..ఆ ఆ ఆ 
పాడుతూ పరవశించు జన్మజన్మలా..ఆ ఆ 

నా గొంతు శృతిలోనా..ఆ..నా గుండె లయలోనా 

చరణం::2 

ప్రతిరోజు నువు సూర్యుడై..ఈ
నన్ను నిదుర లేపాలనీ..ఈ ఈ ఈ 
ప్రతిరేయి పసిపాపనై..ఈ 
నీ ఒడినీ చేరాలనీ..ఈ ఈ ఈ 
కోరికే ఒక జన్మ..కావాలనీ..మ్మ్ 
అది తీరకే మరు జన్మ..రావాలనీ..మ్మ్ 
కోరికే ఒక జన్మ కావాలనీ..మ్మ్ 
అది తీరకే మరు జన్మ రావాలనీ..మ్మ్ 
వలపులే రెక్కలుగా..వెలుగులే దిక్కులుగా 
ఎగిరిపోవాలనీ..ఈ ఈ ఈ
పాడవే.. పాడవే..కోయిలా 
పాడుతూ పరవశించు..జన్మజన్మలా 

నా గొంతు శృతిలోనా..నా గుండె లయలోనా 
పాడవే పాడవే కోయిలా 
పాడుతూ పరవశించు జన్మజన్మలా 
నా గొంతు శృతిలోనా..నా గుండె లయలోనా
తానానె తననానా..ఆ ఆ ఆ ఆ
తానానె తననానా..ఆ ఆ ఆ ఆ