Tuesday, May 07, 2013

సంగీత లక్ష్మి--1966



సంగీతం::సాలూరి రాజేశ్వర్ రావు
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల , P.సుశీల
Film Directed By::Giduturi Suryam
తారాగణం::N.T.రామారావు,జమున,S.V.రంగారావు,నాగభూషణం.

::::::::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పాటకు పల్లవి ప్రాణం, నా జీవనజీవం గానం
పాటకు పల్లవి ప్రాణం, నా జీవనజీవం గానం
అహ అలా కాదు, . . . జీవనజీవం గానం
పాటకు పల్లవి ప్రాణం, నా జీవనజీవం గానం
పాటకు పల్లవి ప్రాణం
సా రీ గా మా పా దా నీ సా
సరిగమపదని సప్తస్వరాలూ నా సిరులూ చెలులూ దివ్యవరాలూ
పాటకు పల్లవి ప్రాణం..

ఞవ్వని మువ్వల ఘలఘలలూ 
ఞవ్వని మువ్వల ఘలఘలలూ
జలపాతాల జలజలలూ
గువ్వలజంటల కువకువలూ 
సంగీతానికి శృతులూ లయలూ

పాటకు పల్లవి ప్రాణం..

నేలా నింగీ లాలనలో మావీ మలతి మేళనలో
నేలా నింగీ లాలనలో మావీ మలతి మేళనలో
నీవే నేనను భావనలో
అనురాగాలే మన రాగాలు
మన రాగాలే మన రాజ్యాలు

పాటకు పల్లవి ప్రాణం..నా జీవనజీవం గానం

తోడూ-నీడ--1965



సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.B.శ్రీనివాస్, S.జానకి
తారాగణం::N.T..రామారావు,S.V.రంగారావు,P.భానుమతి,జమున,గీతాంజలి,నాగయ్య 

పల్లవి::

వలపులోని చిలిపితనం ఇదేలే
నీ చెలిమిలోని గట్టిచిక్కు అదేలే
వలపులోని చిలిపితనం ఇదేలే
నీ చెలిమిలోని గట్టిచిక్కు అదేలే

వలపులోని చిలిపితనం ఇదేలే
నీ చెలిమిలోని గట్టిచిక్కు అదేలే

చరణం::1

కన్నులకి అల్లరి నేర్పినది ఎవ్వరు
మనసులోన జొరబడిన
మగసిరికల ధీరుడు
అంత ధీరుడీనాడు ఏమైనాడు
అంత ధీరుడీనాడు ఏమైనాడు
నీ ఇంత గుండెలోన ఇమిడిపోయినాడు
నీ ఇంత గుండెలోన ఇమిడిపోయినాడు

వలపులోని చిలిపితనం ఇదేలే
నీ చెలిమిలోని గట్టిచిక్కు అదేలే

చరణం::2

తెలిసీ తెలియని మనసు
తెరిచినది ఎవ్వరు?
లోనికి రాగానే మూసినది ఎవ్వరు
ఎవ్వరు..?
తీయని కలలను తినిపించినదెవ్వరు
తీయని కలలను తినిపించినదెవ్వరు
తినిపించి చిటికెలోన ఓడించినదెవ్వరు

వలపులోని చిలిపితనం ఇదేలే
నీ చెలిమిలోని గట్టిచిక్కు అదేలే

చరణం::3

చలివేసే వేళలో వేడైనది ఎవ్వరు
వేడైన విరహంలో తోడైనదెవ్వరు
నాలోన ఉండి నాకు నీడైనది ఎవ్వరు
నాలోన ఉండి నాకు నీడైనది ఎవ్వరు
తోడునీడగా ఉండి దోచినది ఎవ్వరు
తోడునీడగా ఉండి దోచినది ఎవ్వరు

వలపులోని చిలిపితనం ఇదేలే
నీ చెలిమిలోని గట్టిచిక్కు అదేలే



Thodu Needaoo1965
Music ::K.V.Mahadevan
Lyricist::Aacharya Aathreya
Singers::P.B.Srinivas, S.Janaki 



::::

valapulOni chilipitanaM idaelae
nee chelimilOni gaTTichikku adaelae
valapulOni chilipitanaM idaelae
nee chelimilOni gaTTichikku adaelae

valapulOni chilipitanaM idaelae
nee chelimilOni gaTTichikku adaelae

::::1

kannulaki allari naerpinadi evvaru
manasulOna jorabaDina
magasirikala dheeruDu
aMta dheeruDeenaaDu aemainaaDu
aMta dheeruDeenaaDu aemainaaDu
nee iMta guMDelOna imiDipOyinaaDu
nee iMta guMDelOna imiDipOyinaaDu

valapulOni chilipitanaM idaelae
nee chelimilOni gaTTichikku adaelae

::::2

telisee teliyani manasu
terichinadi evvaru?
lOniki raagaanae moosinadi evvaru
evvaru..?
teeyani kalalanu tinipiMchinadevvaru
teeyani kalalanu tinipiMchinadevvaru
tinipiMchi chiTikelOna ODiMchinadevvaru

valapulOni chilipitanaM idaelae
nee chelimilOni gaTTichikku adaelae

::::3

chalivaesae vaeLalO vaeDainadi evvaru
vaeDaina virahaMlO tODainadevvaru
naalOna uMDi naaku neeDainadi evvaru
naalOna uMDi naaku neeDainadi evvaru
tODuneeDagaa uMDi dOchinadi evvaru
tODuneeDagaa uMDi dOchinadi evvaru

valapulOni chilipitanaM idaelae
nee chelimilOni gaTTichikku adaelae

ఆచార్య ఆత్రేయగారి జయంతి



















ఈ రోజు తెలుగు తేజోమూర్తి మనసుకవి ఆచార్య ఆత్రేయగారి  జయంతి...(07-05-2013) సందర్భంగా ఆ 

మహనీయుని గురించి తెలుసుకుందాము.. 

"మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే; మన్సున్న మనిషికి సుఖములేదంతే .... " అని జీవతానుభవంలోని 


భావాలను, తనలోని భారతీయ తత్వంతో రంగరించి పాటల రూపంలో 

సరళమైన సుమధుర భాషలో, మనసులను స్పందింపచేస్తూ రాసిన పాట. "నే వెళ్ళుదారి ఓ ముళ్ళ దారి, రాలేరు 

యవ్వరు నాతో చేరి" అంటూ తనదైన పంథా ఏంటో చెప్పకనే 


చెప్పారు ఆత్రేయ. ఆయన రచనలలో - భావుకత; ఆవేదన; భక్తి; సామాజిక మూల్యాలతోపాటు మానవతావాదిని 

కూడా చూడవచ్చు.1921, మే 7 న, నెల్లూరు జిల్లా 

సూళ్ళూరుపేట లోని మంగళంపాడు గ్రామంలో సీతమ్మ, కృష్ణమాచార్యుల దంపతులకు జన్మించారు కిళాంబి 

వేంకట నరసిమ్హాచార్యులు. వీరు ఆత్రేయ గోత్రికులు. మనదరికీ 

ఆచార్య ఆత్రేయ గా పరిచయం. 1940, ఫిబ్రవరి 10 న, ఆత్రేయ గారికి పద్మావతి గారితో వివాహం జరిగింది. 

అధ్యాపకుడిగా శిక్షణ పొందేరు. బ్రిటీష్ కి విరుద్ధంగా "క్విట్ ఇండియా" 

ఉద్యమంలో పాల్గొని కారాగారవాసం అనుభవించారు. తరువాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసి, తిరుత్తణి మున్సిఫ్ 

కోర్టులో, సెటిల్మెంట్ ఆఫీసులో గుమాస్తాగా పనిచేసారు. తరువాత

జమీన్ రైతు ఉపసంపాదకుడిగా, గుడివాడలో నాటక కళా పరిషత్ కార్యదర్శిగా పనిచేసారు.చిన్నప్పటినుండి 

నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో 

మధ్య తరగతి కుటుంబ సమస్యలనుతీసుకుని మనోహరమైననాటకాలుగా మలిచారు. వీరి 'ప్రవర్తన', 'ఎన్.జి.వో' 

నాటకాలు ఆంధ్ర నాటక కళా పరిషత్అవార్డులను 

గెలుచుకున్నారు. విశేషంగారాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే 'కప్పలు' 

బాగాప్రాఅచారం పొందిన నాటకం. రాయలసీమ క్షామ పరిస్థితులనువివరించే 

'మాయ' నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలోచెలరేగిన హిందూ ముస్లిం హింసాకండను 'ఈనాడు అనే 

మూడంకాల నాటకం మరియువిశ్వశాంతిని కాంక్షించేవిశ్వశాంతి' నాటకాన్ని 

రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లబించింది. 'సామ్రాట్అశోక','గౌతమ బుద్ధ' 

మరియు 'భయం' నాటకాలు కూడా వ్రాసారు.\ఆత్రేయ పలు చలన 

చిత్రాలకు సంభాషణలు, పాటలు రాశారు. వీరి పాటలలో ఎక్కువగా మనసుకు సంబందించినప్రస్తావన ఉండటం 

వలన ఆయనమనసు కవి, మన సుకవి అయ్యాడు. దీక్ష (1950) 

చిత్రానికి తొలిసారి గీత రచన, అదేసంవత్సరంలో విడుదలైన సంసారం చిత్రానికి తొలిసారికధా రచన చేసారు. 

వాగ్ధానం (1961) చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం కూడా చేసాడు.చిన్ని 

చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయ ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించే 

అందరిమనసులను దోచుకున్న ఈమనసు కవి 1989,సెప్టెంబర్ 9 న 

స్వర్గస్తులయ్యారు.

తెలుగు సాహిత్యరంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేటు 

ప్రధానం చేసారు
తన రచనలతో రసాలొలికించిన కవి ఆత్రేయ. వేదాంత దోరణి కలిగి ఉండి, జీవిత సారాన్ని రంగరించి, తన 

పాటలలో అతి నిగూడ సత్యాలను అలవోకగా రాసి అందించిన మహా కవి. 

తెలుగు భాషలోని తేట తనాన్ని, మాధుర్యాన్ని ఇలా అభివర్ణించారు తన పాటల్లోఇలా మనసున్న మనిషి పడే, 

తపన, అంతరంగంలో అనుభవించే ఆవేదన, పరిపరవిధాల 

పరిబ్రమించే సున్నిత, చంచల, కోమల, రంజిత మనస్స్థితులను తన అక్షరమాలలో పేర్చారు ఆత్రేయ. తెలుగు 

నాట ఇంత జనప్రియం పొందిన పాటలు లేవు అంటే అతిశయోక్తి 

కాదు. వారి తెలుగు భాషా ప్రతిభ, తత్వ చింతన అత్యున్నత స్థాయివి.చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని 

పలికించడంలో ఆత్రేయ ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించే 

అందరి మనసులను దోచుకున్న ఈ మనసు కవి 1989,సెప్టెంబర్ 13 న స్వర్గస్తులయ్యారు.
rachana::Ravindra Bhatraju 

సీతారాములు--1980























సంగీతం::సత్యం
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు, P.సుశీ




వరవీణా మృదుపాణి వనరుహ లోచను రాణి





















సురుచిర బంభరవేణి సురనుత కల్యాణి
నిరుపమ శుభగుణలోల నిరత జయాప్రదశీల
వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి
సరసీజాసన జనని జయ జయ జయ జయవాణి 

రాము::
పలికినదీ పిలచినదీ..పరవశమైనవ మోహనరాగం
సీత::
పలికినదీ పిలచినదీ..పరవశమైనవ మోహనరాగం

రాము::
పలికినదీ పిలచినదీ..పరవశమైనవ మోహనరాగం
సీత::
పలికినదీ పిలచినదీ..పరవశమైనవ మోహనరాగం

రాము::పలికినదీ..

సీత::పిలచినదీ..

చరణం::1

రాము::గగనాంగ నాలింగ నోత్సాహియై
జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై
గగనాంగ నాలింగ నోత్సాహియై
జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై

సీత::మమతలు అల్లిన పెళ్ళి పందిరై
మమతలు అల్లిన పెళ్ళి పందిరై..మనసులు వీచిన
ప్రేమ గంథమై

పలికినదీ పిలచినదీ..పరవశమై నవ మోహనరాగం
పలికినదీ పిలచినదీ

చరణం::2

సీత::గంగా తరంగాల సంగీతమై
కమనీయ రమణీయ యువగీతమై
గంగా తరంగాల సంగీతమై
కమనీయ రమణీయ యువగీతమై

రాము::కలిమికి లేమికి తొలి వివాహమై
కలిమికి లేమికి తొలి వివాహమై
యువతకు నవతకు రస ప్రవాహమై

పలికినదీ పిలచినదీ..పరవశమైనవ మోహనరాగం
పలికినదీ పిలచినదీ....

చరణం::3

రాము::మలయాద్రి పవనాల ఆలాపనై
మధుమాస యామి ఉద్ధీపనై
మలయాద్రి పవనాల ఆలాపనై
మధుమాస యామి ఉద్ధీపనై

సీత::అనురాగానికి ఆదితాళమై..అనురాగానికి ఆదితాళమై
ఆనందానికి అమరనాధమై

పలికినదీ పిలచినదీ..పరవశమైనవ మోహనరాగం
పలికినదీ పిలచినదీ..




SeetaRaamulu--1980
Music::Satyam
Lyrics::Atreya
Singer's::S.P.Balu , P.Suseela

varaveenaa mrdupaani vanaruha lochanu raani
suruchira bambharaveni suranuta kalyaani
nirupama Subhagunalola nirata jayaa prada seela
varadaapriya ranganaayaki vaanchita phaladaayaki
saraseejaasana janani jaya jaya jaya jayavaani 


raamu::
palikinadee pilachinadee..paravasamai nava mohana raagam
seeta::
palikinadee pilachinadee..paravasamai nava mohana raagam

raamu::



palikinadee pilachinadee..paravasamai nava mohana raagam 



seeta::



palikinadee pilachinadee..paravasamai nava mohana raagam 




raamu::palikinadee..

seeta::pilachinadee..

:::1

raamu::gaganaanga naalinga notsaahiyai
jagamella pulakinche sumaguchchamai
gaganaanga naalinga notsaahiyai
jagamella pulakinche sumaguchchamai

seeta::mamatalu allina pelli pandirai
mamatalu allina pelli pandirai..manasulu veechina
prema gandhamai




palikinadee pilachinadee..paravasamai nava mohana raagam 



palikinadee pilachinadee

:::2

seeta::gangaa tarangaala sangeetamai
kamaneeya ramaneeya yuvageetamai
gangaa tarangaala sangeetamai
kamaneeya ramaneeya yuvageetamai

raamu::kalimiki lemiki toli vivaahamai
kalimiki lemiki toli vivaahamai
yuvataku navataku rasa pravaahamai




palikinadee pilachinadee..paravasamai nava mohana raagam 



palikinadee pilachinadee....

:::3

raamu::malayaadri pavanaala aalaapanai
madhumaasa yaami uddheepanai
malayaadri pavanaala aalaapanai
madhumaasa yaami uddheepanai

seeta::anuraagaaniki aadi taalamai..anuraagaaniki aadi taalamai
aanandaaniki amaranaadhamai

palikinadee pilachinadee..paravaSamainava mOhanaraagaM
palikinadee pilachinadee..