Monday, June 29, 2015

టైగర్--1979




సంగీతం::చెళ్ళపిళ్ళి సత్యం 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల 
Film Directed By::Nandamoori Ramesh 
తారాగణం::N.T.R,రజనికాంత్,గుమ్మడి,సత్యనారాయణ,ప్రభాకర్‌రెడ్డి,అల్లురామలింగయ్య,సారథి,సాక్షిరంగారావు,అంజలిదేవి,అన్నపూర్ణ,జయమాలిని,విజయలక్ష్మీ,రాధ,
సాలుజ,శుభాషిణి.

పల్లవి::

హ్హో..ఓఓఓ..ఏం దెబ్బతీసావు..ఏం ఎత్తు వేసావు
ఏం మాయచేసావబ్బీ..ఈ..నీ కన్నుల పిలుపు చూస్తూఉంటే  
కలగా ఉన్నది..ఉలుకేస్తున్నాది..కలగా ఉన్నది..ఉలుకేస్తున్నాది   

అహా..ఏం బాగా ఉన్నావు..ఏం ముద్దుగున్నావు
ఏం చూపుతున్నావమ్మీ..ఈ..నీ ఒంపులు సొంపులు చూస్తూఉంటే  
ఒకలాగున్నది..మతిపోతున్నది..అబ్భా..ఒకలాగున్నది..మతిపోతున్నది 

చరణం::1

అఓఓఓ..ఉరికేటి ఓ కొండవాగు..ఒక కొంతసేపైన ఆగు
ఆ ఊపు తగ్గించుకొంటే..ఏఏఏ..నీ ఒంటికి బాగు బాగు

నాదేమో నునుపైన సొగసు..నీదేమో కరుకరుకున్న వయసు 
నీతోటి సరితూగకుంటే..ఏఏఏ..నీరౌను నా బేలమనసు

అహ్హా..అహా..ఏం బాగా ఉన్నావు..ఏం ముద్దుగున్నావు
ఏం చూపుతున్నావమ్మీ..ఈ..

నీ కన్నుల పిలుపు చూస్తూఉంటే  
కలగా ఉన్నది..ఉలుకేస్తున్నాది..కలగా ఉన్నది..ఉలుకేస్తున్నాది 

చరణం::2

నీకుంది పదునైన పొగరు..లేదెవరు నీకింక ఎదురు 
నిను తలచుకుంటేనే చాలు..ఊఊఊ..గుండెల్లో ఒక తీపి అదురూ 

అరే..పడబోకు నావెంట వెంటా..ఉడికించకు ఓరకంటా..ఆ
పైటల్లె నను చూసుకుంటే..ఏఏఏ..పదిలంగ నీతోనే ఉంటా..ఆ

అహా..ఏం దెబ్బతీసావు..ఏం ఎత్తు వేసావు
ఏం మాయచేసావబ్బీ..ఈ..అహ్హా..
నీ కన్నుల పిలుపు చూస్తూఉంటే  
కలగా ఉన్నది..ఉలుకేస్తున్నాది..కలగా ఉన్నది..ఉలుకేస్తున్నాది  

ఏం బాగా ఉన్నావు..ఏం ముద్దుగున్నావు
ఏం చూపుతున్నావమ్మీ..ఈ..ఆహా
నీ ఒంపులు సొంపులు చూస్తూఉంటే  
ఒకలాగున్నది..మతిపోతున్నది..అబ్భా..ఒకలాగున్నది..మతిపోతున్నది 

Taigar--1979
Music::T.Challapilli Satyam
Lyrics::D.C.NarayanaReddi
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::Nandamoori Ramesh
Cast::N.T.R.Rajanikaanth,Gummadi,PrabhaakarReddi,SatyanaaraayaNa,Alluraamalingayya,Saarathi,SaakshiRangaaRao,Raadha,Saluja,Anjalidevi,Jayamaalini,Annapoorna,Subhaashini.

:::::::::::::::::::::::::::

hhO..OOO..Em debbateesaavu..Em ettu vEsaavu
Em maayachEsaavabbii..ii..nee kannula pilupu choostoounTE  
kalagaa unnadi..ulukEstunnaadi..kalagaa unnadi..ulukEstunnaadi   

ahaa..Em baagaa unnaavu..Em muddugunnaavu
Em chooputunnaavammii..ii..nee ompulu sompulu choostoounTE  
okalaagunnadi..matipOtunnadi..abbhaa..okalaagunnadi..matipOtunnadi 

::::1

aOOO..urikETi O konDavaagu..oka kontasEpaina Agu
A Upu tagginchukonTE..EEE..nee onTiki baagu baagu

naadEmO nunupaina sogasu..needEmO karukarukunna vayasu 
neetOTi saritoogakunTE..EEE..neerounu naa bElamanasu

ahhaa..ahaa..Em baagaa unnaavu..Em muddugunnaavu
Em chooputunnaavammii..ii..

nee kannula pilupu choostoounTE  
kalagaa unnadi..ulukEstunnaadi..kalagaa unnadi..ulukEstunnaadi 

::::2

neekundi padunaina pogaru..lEdevaru neekinka eduru 
ninu talachukunTEnE chaalu..UUU..gunDellO oka teepi aduruu 

arE..paDabOku naavenTa venTaa..uDikinchaku OrakanTaa..aa
paiTalle nanu choosukunTE..EEE..padilanga neetOnE unTaa..aa

ahaa..Em debbateesaavu..Em ettu vEsaavu
Em maayachEsaavabbii..ii..ahhaa..
nee kannula pilupu choostoounTE  
kalagaa unnadi..ulukEstunnaadi..kalagaa unnadi..ulukEstunnaadi  

Em baagaa unnaavu..Em muddugunnaavu
Em chooputunnaavammii..ii..aahaa
nee ompulu sompulu choostoounTE  
okalaagunnadi..matipOtunnadi..abbhaa..okalaagunnadi..matipOtunnadi

కన్నవారి కలలు--1974



సంగీతం::V. కుమార్
రచన::రాజశ్రీ 
గానం::P.సుశీల 
తారగణం::శోభన్‌బాబు,రామకృష్ణ,ప్రభాకరరెడ్డి,వాణిశ్రీ,లత,గీతాంజలి,గుమ్మడి

పల్లవి::

బాబూ..చిన్నారి బాబూ 
బాబూ..చిన్నారి బాబూ
నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను
నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను  
కడుపున కన్నీటి సెగలు దాచుకున్నాను
బాబూ చిన్నారి బాబూ

చరణం::1

మబ్బుల్లొ ఎగిరేటి మీ నాన్న
ఆ మబ్బుల్లో కలిశాడు ఓ నాన్నా 
మబ్బుల్లొ ఎగిరేటి మీ నాన్న
ఆ మబ్బుల్లో కలిశాడు ఓ నాన్నా
అతడు లేని నా బ్రతుకే చీకటిరా
ఆ చీకటిలో నీ నవ్వే దీపికరా 
బాబూ..చిన్నారి బాబూ

చరణం::2

అమ్మా అని ఒక్కసారి నువ్వంటే
నా అణువణువున ఆనంద గోదావరి  
అమ్మా అని ఒక్కసారి నువ్వంటే
నా అణువణువున ఆనంద గోదావరి
నాన్నేడని ముందు ముందు అడిగితే
నా గుండెల్లో కన్నీటి కావేరి 
బాబూ..చిన్నారి బాబూ

చరణం::3

నెలవంకలా నీవు పెరగాలి
నా కలలన్నీ నీ కళలై వెలగాలి  
నెలవంకలా నీవు పెరగాలి
నా కలలన్నీ నీ కళలై వెలగాలి
ఆ వెలుగే నా కంటి వెలుగు కావాలి
అది చూసి మీ నాన్న మురిసి పోవాలి  

బాబూ..చిన్నారి బాబూ         
నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను
నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను 
కడుపున కన్నీటి సెగలు దాచుకున్నాను
బాబూ చిన్నారి బాబూ