Friday, September 23, 2011

పులు బిడ్డ--1981




సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల


పల్లవి:: 

అతడు::నడుమా..కన్నెలేడినడుమా
సన్నజాజి తొడిమా..
ఉందో లేదో ఉయ్యాలరో
ఊగుతుంటె జాజిపూల జంపాలరో

ఆమె::నడుమే కన్నెలేడి నడుమే
సన్నజాజి తొడిమే..
ఉండీ లేని ఉయ్యాలరో
ఊగుతుంటె జాజిపూల జంపాలరో

చరణం::1

అతడు::మోములోన చందమామ గోముగున్నాది
మోజుతీరా గున్నమల్లె నవ్వుతున్నాది
యింతకన్న ఏముంది ఎక్కడైనా
ఏ చుక్కకైనా ఎంత చక్కనైనా

ఆమె::కళ్లే తారకలంటావు
కలలే కోరిక లంటావు
అంటుమల్లె తీగల్లె అంటుకుంటే
వొల్లు జల్లుమంటే పైట వెల్లువైతే నడుమా

నడుమా..కన్నెలేడినడుమా
సన్నజాజి తొడిమా..

ఉండీ లేని ఉయ్యాలరో
ఊగుతుంటె జాజిపూల జంపాలరో-2

చరణం::2

ఆమె::అర్థరేయి నిద్దరేమొ నిద్దురోయింది
పొద్దుకూడ ముద్దులేక పొడవనంటుంది
యింతకన్న చెప్పలేని చక్కనోడా
చేత చిక్కినోడా తేనెచుక్కలోడా

అతడు::కౌగిలి యిల్లనుకుంటావు
కవితే కౌగిలింతంటావు
కొండ మల్లె పువ్వులాగా నవ్వుతుంటే
ఎండ ఎన్నెలైతే - వేడి చల్లనైతే

అతడు::నడుమా..కన్నెలేడినడుమా
సన్నజాజి తొడిమా..
ఉందో లేదో ఉయ్యాలరో
ఊగుతుంటె జాజిపూల జంపాలరో

పులు బిడ్డ--1981





సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::SP.బాలు,P.సుశీల

పల్లవి:: 

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
అతడు::వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన
అతడు::వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన
అందమైన వలపుంది అందుకుంటె పిలుపుంది
మనసుంటె వచ్చి వాలు నాపక్కన..ఆ ఆ

ఆమె::వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన
వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన
పలకరింత కలిసింది పులకరింత తెలిసింది
మనసుంటె వచ్చివాలు నా పక్కన

అతడు::చలి చలి చలీ చలి చలి చలీ
ఆమె::చలి చలి చలీ చలి చలి చలీ

చరణం::1

అతడు::వెచ్చ వెచ్చగుండమని నిచ్చెనన్నది,
వయసు వయసు అందుకే కలుపుతున్నది
వెచ్చ వెచ్చగుండమని నిచ్చెనన్నది,
వయసు వయసు అందుకే కలుపుతున్నది

ఆమె::కాదంటె వూరుకోదు పగలైన ఎండరాదు
పద పద పద పద మంటది జోడుచలి
రెప రెప రెప రెప మంటది చూడుగిలి

అతడు::హా..హా..హా..హా..చలి
ఆమె::హా..హా..హా..హా..చలి


ఆమె::ఎక్కు ఎక్కు నిచ్చెన వాలు వాలు పక్కన
అందమైన వలపుంది..అందుకంటె పిలుపుంది
రానంటె వూరుకోను..చచ్చినా

అతడు::ఎక్కు ఎక్కు నిచ్చెన..ఆ..వాలు వాలు పక్కన
పలకరింత కలిసింది పులకరింత తెలిసింది
చలివున్న చెలివుంటె భలే..వెచ్చన

చరణం::2

ఆమె::వచ్చె వచ్చె నల్ల మబ్బు పిల్లగాలికి
వచ్చి తెచ్చె వలపు జబ్బు పిల్లగాడికి
వచ్చె వచ్చె నల్ల మబ్బు పిల్లగాలికి
వచ్చి తెచ్చె వలపు జబ్బు పిల్లగాడికి

అతడు::గొడుగైనా ఆపలేదు గొడవైనా ఆగిపోదు
ఉహు, ఉహు, ఉహు,
ఉహు మంటది పాడు చలి
తహ తహ తహ తహ మంటది పడుచు గిలి

అతడు::హా..హా..హా..హా..చలి
ఆమె::హా..హా..హా..హా..చలి

ఆమె::వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన
పలకరింత కలిసింది పులకరింత తెలిసింది
మనసుంటె వచ్చివాలు నా పక్కన

అతడు::వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన
అందమైన వలపుంది అందుకుంటె పిలుపుంది
మనసుంటె వచ్చి వాలు నాపక్కన..ఆ ఆ

పులు బిడ్డ--1981


ఈ పాట ఇక్కడ వినండి



సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు


పల్లవి:: 

కాశీ విశ్వనాధా తండ్రీ విశ్వనాధా
నువ్వే తండ్రివైతే నా తల్లే విశాలక్షీ
నువ్వే నాకు సాక్షీ..


కాశీ విశ్వనాధా తండ్రీ విశ్వనాధా
నువ్వే తండ్రివైతే నా తల్లే విశాలక్షీ
నువ్వే నాకు సాక్షీ..
కాశీ విశ్వనాధా తండ్రీ విశ్వనాధా

చరణం::1

కడుపునవుండి కాలదన్నితే జన్మము ఇచ్చింది

కాళ్ళమీదపడి తల్లీ అంటే కాదు పొమ్మంది
కడుపునవుండి కాలదన్నితే జన్మము ఇచ్చింది
కాళ్ళమీదపడి తల్లీ అంటే కాదు పొమ్మంది
పేగును తెంచిన అదే త్యాగం పేమను తుంచిందా
అది అంతరాత్మనే నులిమేసిందా
ఇక సత్యమన్నదే కరువవుతుందా
ఇక సత్యమన్నదే కరువవుతుందా

కాశీ విశ్వనాధా తండ్రీ విశ్వనాధా

చరణం::2

దేహం రూపం ప్రాణం సర్వం విశాలాక్షి బిక్షా
అన్నెంపున్నెం ఎరుగని నాకు అన్నపూర్ణ బిక్షా
దేహం రూపం ప్రాణం సర్వం విశాలాక్షి బిక్షా
అన్నెంపున్నెం ఎరుగని నాకు అన్నపూర్ణ బిక్షా
ఇద్దరు తల్లుల ముద్దుబిడ్డకు ఇది అగ్నిపరిక్ష
ఒడి చేర్చుకోవా అమ్మా నన్ను
గుడిలోని తండ్రే మనకు తీర్పు
గుడిలోని తండ్రే మనకు తీర్పు

కాశీ విశ్వనాధా తండ్రీ విశ్వనాధా
నువ్వే తండ్రివైతే నా తల్లే విశాలక్షీ
నువ్వే నాకు సాక్షీ..
కాశీ విశ్వనాధా తండ్రీ విశ్వనాధా
శంభో మహాదేవ హరహర శంభో మహాదేవ
శంభో మహాదేవ హరహర శంభో మహాదేవ
కాశీ విశ్వనాధా తండ్రీ విశ్వనాధా

జరిగిన కథ--1969



సంగీతం::ఘంటసాల
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల

సినిమా దర్శకత్వం::K.బాబురావు
తారాగణం::కృష్ణ,కాంచన,జగ్గయ్య,విజయలలిత,రాజనాల కాళేశ్వరరావు,బేబి రోజారమణి,చిత్తూరు నాగయ్య,అల్లురామలింగయ్య,రాజబాబు,బాలకృష్ణ,శ్రీరంజని,

భలే మంచిరోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటిరోజు..ఆ ఆ
వసంతాలు పూచే నేటిరోజు
భలే మంచిరోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటిరోజు..ఆ ఆ
వసంతాలు పూచే నేటిరోజు

గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు
గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరినరోజు
గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు
గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరినరోజు
నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచినరోజు
భలే మంచిరోజు..పసందైన రోజు
వసంతాలు పూచే నేటిరోజు..ఆ ఆ
వసంతాలు పూచే నేటిరోజు

చందమామ అందినరోజు బృందావని నవ్వినరోజు
తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు
చందమామ అందినరోజు బృందావని నవ్వినరోజు
తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు
కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు
భలే మంచిరోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటిరోజు..ఆ ఆ
వసంతాలు పూచే నేటిరోజు
ఆ హహహా ఆ హహహా..

కలసిన మనసులు--1968





సంగీతం::మాస్టర్ వేణు
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::M.S.రాజేశ్వరి


పల్లవి::

అమ్మవంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే
అయ్యయ్యైన జేజైనా అమ్మ పిమ్మటే
అమ్మవంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే

చరణం::1

బొజ్జలోని పాపాయి పొరలి పొరలి తన్నినా
పొంగిపోవు కడుపు తీపి అమ్మది
కుసిలి కుసిలి పాలకై..కుసిలి కుసిలి పాలకై
గుండెమీద గుద్దినా..మురిసిపోవు వెన్న మనసు అమ్మది
మురిసిపోవు వెన్న మనసు అమ్మది
అమ్మవంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే

చరణం::2

గోరుముద్ద తినిపిస్తూ కొండంతగ పెరగాలని
నిండుగ నూరేళ్ళు ఉండాలని కోరుతుంది
నిండుగ నూరేళ్ళు ఉండాలని కోరుతుంది
లాలాబోసి నీళ్లు చుట్టి రామరక్ష అంటుంది
ఆ రామునికి అమ్మకంటే రక్ష ఏమి ఉన్నదీ?
అమ్మవంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే

అమ్మవుంటే లేనిదేమి లేనే లేదూ
అమ్మ లేక ఏమున్నా ఉన్నదికాదూ
అమ్మంటే త్యాగమూ..అమ్మే ఒక యోగమూ
అమ్మంటే సత్యమూ..అమ్మే సర్వస్వమూ
అమ్మా..ఆ..అమ్మా..ఆ..అమ్మా...

కలిసిన మనసులు---1968




సంగీతం ::మాష్టర్ వేణు
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం::ఘంటసాల,P.సుశీల

Sarada::-- ఒక్కక్షణం ఒక్కక్షణం
నన్ను పలకరించకు
నా వైపిటు చూడకు ఒక్కక్షణం.....ఒక్కక్షణం

నిన్ను తలుచుకోనీ..... నా కళ్ళు మూసుకోనీ
మోయలేని ఈ హాయిని మోయనీ........ఒక్కక్షణం..ఒక్క క్షణం.

Sobhan::-- ఒక్క క్షణం....ఒక్క క్షణం.
ఆరెప్పలు వాల్చకు అటూ ఇటూ కదలకు
ఒక్క క్షణం ఒక్క క్షణం.

ఆ కన్నులలో ఊహల అర్థమేదొ అడగనీ
ఆకొలనులలో నీడల అదే పనిగ చూడనీ
మోయలేని ఈ హాయిని మోయనీ .....ఒక్క క్షణం..ఒక్క క్షణం.

Sarada:--:ఆకులతో గాలి ఊసులాడకూడదూ
ఏటిలోని అలలు పెదవి విప్పగూడదూ..2
మేను మేను తాకగా మౌనముగా గువ్వల వలె
కొమ్మ పైని మాటాడక కునుకు జంట పువ్వుల వలె
మోయలేని ఈ హాయిని మోయనీ... ఒక్క క్షణం.... ఒక్క క్షణం

Sobhan::--మోము పైన ముంగురులు ముసరవచ్చునా
మోవి చుట్టు కోరికలు మూగవచ్చునా..2

వాగులాగ ఈ సమయం సాగిపోవు ననే భయం
నాలో నిండిన నీవే నాకు చాలు నేటికీ...
మోయలేని ఈ హాయిని మోయనీ..



Sobhan::--ఒక్క క్షణం....ఒక్క క్షణం.
ఒక్క క్షణం..ఆ హ..హా.
ఒక్క క్షణం...ఒక్క క్షణం
iddaru::--ఆ ఆ ఆ ఆ ఆ ఆ