Thursday, March 10, 2011

పవిత్ర బంధం--1971













సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::ఆరుద్ర 
గానం::P.సుశీల  
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,కాంచన, కృష్ణంరాజు, పద్మనాభం,నాగయ్య.

పల్లవి::

పచ్చబొట్టు చెరిగిపోదులే..నా రాజా 
పడుచుజంట చెదరిపోదులే..నా రాజా
పచ్చబొట్టు చెరిగిపోదులే..నా రాజా 
పడుచుజంట చెదరిపోదులే..నా రాజా 
పచ్చబొట్టు చెరిగిపోదులే..

చరణం::1

పండినచేలు పసుపుపచ్చ..పండినచేలు పసుపుపచ్చ 
నా నిండు మమతలు..మెండు సొగసులు లేతపచ్చ..ఆ
మెడలో పతకం చిలకపచ్చ..మన మేలిమి గురుతీ వలపులపచ్చ 
పచ్చబొట్టు...చెరిగిపోదులే..ఏ

చరణం::2

నూరేళ్ళ వెలుగు నుదుటిబొట్టు..నూరేళ్ళ వెలుగు నుదుటిబొట్టు 
ఇది నోచిన నోములు..పూచినరోజున పెళ్లిబొట్టు..ఊ
కట్టేను నీ చేయి తాళిబొట్టు..అది కలకాల కాంతుల కలిమిచెట్టు
పచ్చబొట్టు చెరిగిపోదులే..నా రాజా పడుచుజంట చెదరిపోదులే 
నా రాజా...పచ్చబొట్టు..చెరిగిపోదులే..ఏ

చైర్మన్ చలమయ్య--1974

సంగీతం::సలీల్ చౌదరి
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,S.P.బాలు,బృందం  
తారాగణం::చలం,విజయలలిత,ప్రభాకర్ రెడ్డి,అల్లు రామలింగయ్య 

పల్లవి::

టిక్కు టాకు టిక్కుటాకు బస్తీ పిల్లలం 
నువ్వుచూస్తే వెర్రి మొర్రి భలే బైతువమ్మా
దిష్టిబొమ్మా దిష్టిబొమ్మా దిష్టిబొమ్మా
టిక్కు టాకు టిక్కుటాకు బస్తీ పిల్లలం 
నువ్వుచూస్తే వెర్రి మొర్రి భలే బైతువమ్మా
దిష్టిబొమ్మా దిష్టిబొమ్మా దిష్టిబొమ్మా

చరణం::1

చొక్కా..నిక్కరు తొడిగిన మాత్రం మీసం మొలవదులే 
ఆ..ఆడది హద్దులు మీరిన హాని ఇప్పుడు తెలవదులే
చొక్కా..నిక్కరు తొడిగిన మాత్రం మీసం మొలవదులే 
ఆ..ఆడది హద్దులు మీరిన హాని ఇప్పుడు తెలవదులే
అయ్యయ్యో సీతమ్మ సావిత్రి పుట్టినట్టి గొప్ప దేశమ్మిది
టిక్కు టాకు టిక్కుటాకు బస్తీ పిల్లలం 
నువ్వుచూస్తే వెర్రి మొర్రి భలే బైతువమ్మా
దిష్టిబొమ్మా దిష్టిబొమ్మా దిష్టిబొమ్మా

చరణం::2

ఊళ్ళోకొచ్చిన వింత మృగానివి జూలో పెట్టిస్తాం 
ఏవో కొన్ని విద్యలు వస్తే సర్కస్ కిచ్చేస్తాం 
ఊళ్ళోకొచ్చిన వింత మృగానివి జూలో పెట్టిస్తాం 
ఆహా..ఏవో కొన్ని విద్యలు వస్తే సర్కస్ కిచ్చేస్తాం
ఓ హో హో కవ్విస్తాం నవ్విస్తాం నిన్ను తైతాక్క లాడిస్తాం
టిక్కు టాకు టిక్కుటాకు బస్తీ పిల్లలం 
నువ్వుచూస్తే వెర్రి మొర్రి భలే బైతువమ్మా
దిష్టిబొమ్మా దిష్టిబొమ్మా దిష్టిబొమ్మా

చరణం::3

సిగ్గు..బిడియం వీడిన వాళ్ళకు నవ్వే సింగార
ఏ తల్లి కందో అమ్మా..నాన్నకు మీరే అవమానం
సిగ్గు..బిడియం వీడిన వాళ్ళకు నవ్వే సింగార
ఏ తల్లి కందో అమ్మా..నాన్నకు మీరే అవమానం
దిష్టిబొమ్మా దిష్టిబొమ్మా దిష్టిబొమ్మా