Thursday, May 03, 2007

విప్రనారాయణ--1954::భౌళి..మలయమారుతం :::రాగాలు







సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::సముద్రాల
గానం::A.M. రాజా

భౌళి..మలయమారుతం :::రాగాలు 

పల్లవి::

మేలుకో శ్రీరంగ..aa..మేలుకోవయ్య
మేలుకోవయ్య..మమ్మేలుకోవయ్య

చరణం::1

భాసిల్లె ఉదయాద్రి బాలభాస్కరుడు
వెదజల్లె నెత్తావి విరబూసి విరులు
విరితేనెలా అని మైమరచు తుమ్మెదలు
లేచెను విహగాలి..లేచెను నిదుర
చల్లచల్లగ వీచె..పిల్లతెమ్మెరలు
రేయి వేగినది..వేళాయె పూజలకు
మేలుకో శ్రీరంగ..మేలుకోవయ్య
మేలుకోవయ్య..మమ్మేలుకోవయ్య


చరణం::2

పరిమళద్రవ్యాలు బహువిధములౌ నిధులు గైకొని దివ్యులు
కపిలధేనువును అద్దమ్ము పూని మహర్షి పుంగవులు
మురువు కాపాడ తుంబురు నారదులును
నీ సేవకై వచ్చి నిలిచి వున్నారు సకుటుంబముగ సురేశ్వరులు
కానుకలు గైకొని మొగసాల కాచియున్నారు
మేలుకో శ్రీరంగ మేలుకోవయ్య
మేలుకోవయ్య మమ్మేలుకోవయ్య


దేవరవారికై పూవులసరులు తెచ్చిన తొండరడిప్పొడి మురియ స్నేహ దయాదృష్టి చిల్కగా చేసి సెజ్జను విడి కటాక్షింపరావయ్య
మేలుకో శ్రీరంగ మేలుకోవయ్య
మేలుకోవయ్య మమ్మేలుకోవయ్య