సంగీతం::ఘంటసాల రచన::మల్లాది రామకృష్ణశాస్త్రి గానం::ఘంటసాల పల్లవి:: మిగిలింది నేనా బ్రతుకిందుకేనా ఇందుకేనా..ఆ మిగిలింది నేనా బ్రతుకిందుకేనా మిగిలింది నేనా బ్రతుకిందుకేనా మరచేవా ఎడబాసి మాయమయేవా మరచేవా ఎడబాసి మాయమయేవా మిగిలింది నేనా బ్రతుకిందుకేనా చరణం::1 కన్నార చూసింది కలకలా నవ్వింది కన్నార చూసింది కలకలా నవ్వింది మనసార దరిజేరి మురిసిపోయింది మనసైన పాట..ఆ.. మనసైన పాట మన పూలబాట మరచేవా ఎడబాసి మాయమయేవా మిగిలింది నేనా బ్రతుకిందుకేనా చరణం::2 నీవు నేను కలసి కలగన్న మన ఇల్లు నీవు నేను కలసి కలగన్న మన ఇల్లు ఈ తీరై కన్నీరై కూలిపోయెనా ఆకాశమేలే అలనాటి మన ఊహ ఆకాశమేలే అలనాటి మన ఊహ ఈ తీరై కన్నీరై రాలిపోయెనా..ఆ మిగిలింది నేనా బ్రతుకిందుకేనా చరణం::3 కనుల వెలుగు లేదు నీ పలుకు వినరాదు మనసు నిలువలేదు నిన్ను మరువలేదు భారమై విషమై రగిలే ఈ బ్రతుకెందుకో..ఓ
సంగీతం::ఘంటసాల రచన::మల్లాది రామకృష్ణశాస్త్రి గానం::ఘంటసాల తారాగణం::N.T.రామారావు, జమున, గుమ్మడి, C.S.R. ఆంజనేయులు, బాలసరస్వతి, మాష్టర్ బాబ్జి, బేబి శశికళ పల్లవి:: మనసు నీదే మమత నాదే నా దానవే నే నీవాడనే మనసు నీదే మమత నాదే నా దానవే నే నీవాడనే చరణం::1 చివురు మామిడి పందిళ్లనీడా నిలిచింది చిలక నా కోసమే చివురు మామిడి పందిళ్లనీడా నిలిచింది చిలక నా కోసమే చివురింటి చిన్నదానా నా దానవే నే నీవాడనే మనసు నీదే మమత నాదే నా దానవే నే నీవాడనే చరణం::2 కనుల కాటుక కళ్యాణ తిలకం నగుమోము కలకల నా కోసమే కనుల కాటుక కళ్యాణ తిలకం నగుమోము కలకల నా కోసమే చిరునవ్వు చిన్నదాన నా దానవే నే నీవాడన మనసు నీదే మమత నాదే నా దానవే నే నీవాడనే చరణం ::3 పువ్వులు జల్లి పన్నీరు జల్లి దీవించి మీ వారు పంపేరులే పువ్వులు జల్ల్లి పన్నీరు జల్లి దీవించి మీ వారు పంపేరులే మనసైన చిన్నదానా మీ ఇంటికి మా ఇంటికీ మనసు నీదే మమత నాదే నా దానవే నే నీవాడనే
సంగీతం::ఇళయరాజా రచన::వెన్నెలకంటి గానం::S.P.బాలు కానడ::రాగం పల్లవి:: ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు నిన్నే ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు కనులా నీరు రానీకు కానీ పయనం కడ వరకూ కదిలే కాలం ఆగేను కథగా నీతో సాగేను నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు ఉదయించు సూర్యీడు నిదురించేనె నేడు నా చిట్టి తండ్రి ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు ఎవరు కొట్టారు కనులా నీరు రానీకు కానీ పయనం కడ వరకూ కదిలే కాలం ఆగేను కథగా నీతో సాగేను ఉదయించు సూర్యీడు ఓ చుక్క రాలింది ఓ జ్యోతి ఆరింది కన్నీరు మిగిలింది కధముగిసింది కధముగిసింది కధముగిసింది కధముగిసింది కధముగిసింది కాలం తోడై కదిలాడు కధగా తానే మిగిలాడు మరణంలేని నాయకుడు మదిలో వెలుగై వెలిశాడు ఓ చుక్క రాలింది నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు నా చిట్టి తల్లీ నిన్నెవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు కనులా నీరు రానీకు కానీ పయనం కడ వరకూ కదిలే కాలం ఆగేను కథగా నీతో సాగేను
సంగీతం::ఇళయరాజా రచన::వెన్నెలకంటి గానం::S.P.బాలు,S.P.శైలజ పల్లవి:: ఏదో తెలియని బంధమిది ఏదో తెలియని బంధమిది ఎదలో ఒదిగే రాగమిది ఏదో తెలియని బంధమిది ఎదలో ఒదిగే రాగమిది ఏదో తెలియని బంధమిది చరణం::1 పూజకు నోచని పూవును కోరి వలచిన స్వామివి నువ్వేలే రూపం లేని అనురాగానికి ఊపిరి నీ చిరునవ్వేలే కోవెల లేని..ఈ..ఈఈఈ కోవెల లేని దేవుడవు గుండెల గుడిలో వెలిశావు పలికే జీవన సంగీతానికి వలపుల స్వరమై ఒదిగావు తనువూ మనసు ఇక నీవే ఏదో తెలియని బంధమిది ఏదో తెలియని బంధమిది ఎదలో ఒదిగే రాగమిది ఏదో తెలియని బంధమిది చరణం::2 వేసవి దారుల వేళలలోన వెన్నెల తోడై కలిసావు పూచే మల్లెల తీగకు నేడు పందిరి నీవై నిలిచావు ఆశలు రాలే..ఏఏఏఏఏ ఆశలు రాలే శిశిరంలో ఆమనీ నీవై వెలిశావు ఆలుమగల అద్వైతానికి అర్ధం నీవై నిలిచావు తనువు మనసు ఇక నీవే ఏదో తెలియని బంధమిది ఏదో తెలియని బంధమిది ఎదలో ఒదిగే రాగమిది ఏదో తెలియని బంధమిది హ్హాహ్హా....హా