Friday, October 09, 2015

ఏప్రిల్ 1 విడుదల--1991



సంగీతం::ఇళయరాజా 
రచన::సిరివెన్నెల 
గానం::మనో, K.S.చిత్ర
Film Directed By::Vamshi
తారాగణం::రాజేంద్రప్రసాద్,శోభన,కృష్ణభగవాన్,జయలలిత.

పల్లవి::

ఆమె::ఒక్కటే ఆశ..అందుకో శ్వాస
అచ్చగా అంకితం చేశా..పుచ్చుకో ప్రాణేశా
అచ్చగా అంకితం చేశా..పుచ్చుకో ప్రాణేశా

అతడు::చుక్కనే చూశా..లెక్కలే వేశా
నింగిపై అంగలే వేశా..కిందికే దించేశా
నింగిపై అంగలే వేశా..కిందికే దించేశా

ఆమె::ఒక్కటే ఆశ..
అతడు::అందుకో శ్వాసా..ఆఆఆ 

చరణం::1

ఆమె::మెత్తగా ఒళ్లో పెట్టుకో కాళ్లు ఉందిగా అంకపీఠం ఆడపుట్టుకే అందుకోసం
అతడు::గట్టిగా పట్టుకో భక్తిగా అద్దుకో పుచ్చుకో పాదతీర్థం పాదపూజలే అది పాఠం
ఆమె::చాకిరీ చెయ్యనా బానిసై..నీ సేవలే చెయ్యనా పాదుషా
అతడు::దీవెనే తీసుకో బాలికా..నీ జీవితం సార్థకం పొమ్మిక
ఆమె::మొక్కులే తీరి అక్కునే చేరి..దక్కెనే సౌభాగ్యం

అతడు::చుక్కనే చూశా లెక్కలే వేశా నింగిపై అంగలే వేశా కిందికే దించేశా
ఆమె::అచ్చగా అంకితం చేశా పుచ్చుకో ప్రాణేశా
ఆమె::ఒక్కటే ఆశ..
అతడు::అందుకో శ్వాస..ఆఆఆ 

చరణం::2

ఇద్దరు: తాతారరు తారరు తాతారరు తారూ తాతరరు తారరు
తాతారరు తారూ తారా తారారా తారారా తారరారా
అతడు::::నచ్చనే నారీ వచ్చెనే కోరీ తెచ్చెనే ప్రేమ సౌఖ్యం సాటిలేనిదీ ఇంతి సఖ్యం
ఆమె::మెచ్చెనే చేరీ ముచ్చటే తీరీ ఇచ్చెనే ప్రేమరాజ్యం అంతులేనిదే సంతోషం
అతడు::స్వప్నమే సత్యమై వచ్చెనేమో వెచ్చగా సర్వము పంచగా
ఆమె::స్వర్గమే స్వంతమై దక్కెనేమో అచ్చటా ముచ్చటా తీర్చగా
అతడు::మక్కువే మీరి ముద్దులే కోరి అందెనా ఇంద్రభోగం 

ఆమె::ఒక్కటే ఆశ..అందుకో శ్వాస
అచ్చగా అంకితం చేశా..పుచ్చుకో ప్రాణేశా

అతడు::నింగిపై అంగలే వేశా..కిందికే దించేశా
ఒక్కటే ఆశ..
ఆమె::అందుకో శ్వాస..ఆఆఆ 

April 1 Vidudala--1991
Music::Ilayaraajaa 
Lyrics:Sirivennela  
Singer's::Mano, K.S.Chitra
Film Directed By::Vamshi
Cast::Rajendraprasaad,Sobhana,Krishnabhagavan,Jayalalita.

:::::::::

Ame::okkaTE aaSa..andukO Swaasa
achchagaa ankitam chESaa..puchchukO praaNESaa
achchagaa ankitam chESaa..puchchukO praaNESaa

Atadu::chukkanE chooSaa..lekkalE vESaa
ningipai angalE vESaa..kindikE dinchESaa
niMgipai angalE vESaa..kindikE dinchESaa

Ame::okkaTE aaSa..
Atadu::andukO Swaasaa..aaaaaaaa 

::::1

Ame::mettagaa oLlO peTTukO kaaLlu undigaa ankapeeTham aaDapuTTukE andukOsam
Atadu::gaTTigaa paTTukO bhaktigaa addukO puchchukO paadateertham paadapoojalaE adi paaTham
Ame::chaakiree cheyyanaa baanisai..nee sEvalE cheyyanaa paadushaa
Atadu::deevenE teesukO baalikaa..nee jeevitam saarthakam pommika
Ame::mokkulE teeri akkunE chEri..dakkenE saubhaagyam

Atadu::chukkanE chooSaa lekkalE vESaa ningipai angalE vEeSaa kindikE dinchESaa

Ame::achchagaa ankitam chESaa puchchukO praaNESaa
Ame::okkaTae aaSa..

Atadu::andukO Swaasa..aaaaaaaa 

::::2

Iddaru::taataararu taararu taataararu taaroo taatararu taararu
taataararu taaroo taaraa taaraaraa taaraaraa taararaaraa
Atadu::nachchanE naaree vachchenE kOree techchenE prEma saukhyam saaTilEnidee inti sakhyam
Ame::mechchenE chEree muchchaTE teeree ichchenE prEmaraajyam antulEnidE santOsham
Atadu::swapnamE satyamai vachchenEmO vechchagaa sarvamu panchagaa
Ame::swargamE swantamai dakkenEmO achchaTaa muchchaTaa teerchagaa
Atadu::makkuvEe meeri muddulE kOri andenaa indrabhOgam

Ame::okkaTE aaSa..andukO Swaasa
achchagaa ankitam chESaa..puchchukO praaNESaa

Atadu::ningipai angalE vESaa..kindikE dinchESaa
okkaTE ASa..
Ame::andukO Swaasa..aaaaaaaa 

ఏప్రిల్ 1 విడుదల--1991



సంగీతం::ఇళయరాజా 
రచన::సిరివెన్నెల 
గానం::మనో, చిత్ర
Film Directed By::Vamshi
తారాగణం::రాజేంద్రప్రసాద్,శోభన,కృష్ణభగవాన్,జయలలిత.

పల్లవి::

చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా

నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను
వస్తానమ్మా...ఎట్టాగైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైన చేస్తానే ఏమైనా

చరణం::1

షోలే ఉందా ఇదిగో ఇందా 
ఇది జ్వాల కాదా..ఆ..ఆ
తెలుగులో తీసారే..బాల
ఖైదీ ఉందా ఇదిగో ఇందా 
ఖైదీ కన్నయ్య కాదే..ఏ..ఏ 
వీడికి అన్నయ్య..వాడే

జగదేకవీరుని కథ ఇది పాత పిక్చరు కదా
అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పదా
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి

చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా

చరణం::2

ఒకటా రెండా..పదులా వందా
బాకీ ఎగవేయకుండా బదులే తీర్చేది ఉందా
మెదడే ఉందా..మతి పోయిందా
చాల్లే మీ కాకి గోల వేళా పాళంటు లేదా
ఏమైంది...భాగ్యం కథ..కదిలిందా లేదా కథ
వ్రతమేదో చేస్తుందట అందాక ఆగాలట
లౌక్యంగా బ్రతకాలి సౌఖ్యాలే పొందాలి

చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా

నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను
వస్తానమ్మా...ఎట్టాగైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైన చేస్తానే ఏమైనా

April 1 Vidudala--1991
Music::Ilayaraajaa 
Lyrics:Sirivennela  
Singer's::Mano, K.S.Chitra
Film Directed By::Vamshi
Cast::Rajendraprasaad,Sobhana,Krishnabhagavan,Jayalalita.

::::::::

chukkalu temmannaa tenchukuraanaa
choostaavaa naa mainaa chEstaanE Emainaa

chukkalu temmannaa tenchukuraanaa
choostaavaa naa mainaa chEstaanE Emainaa

ninnE meppistaanu nannE arpistaanu
vastaanammaa...eTTaagainaa

chukkalu temmannaa tenchukuraanaa
choostaavaa naa mainaa chEstaanE Emainaa

::::1

shOlE undaa idigO indaa 
idi jwaala kaadaa..aa..aa
telugulO teesaarE..baala
khaidee undaa idigO indaa 
khaidee kannayya kaadE..E..E 
veeDiki annayya..vaaDE

jagadEkaveeruni katha idi paata picture kadaa
atilOka sundari tala atikinchi istaa padaa
E maaya chEsainaa oppinchE teeraali

chukkalu temmannaa tenchukuraanaa
choostaavaa naa mainaa chEstaanE Emainaa

::::2

okaTaa renDaa..padulaa vandaa
baakee egavEyakunDaa badulE teerchEdi undaa
medaDE undaa..mati pOyindaa
chaallE mee kaaki gOla vELaa paaLanTu lEdaa
Emaindi...bhaagyam katha..kadilindaa lEdaa katha
vratamEdO chEstundaTa andaaka aagaalaTa
loukyangaa bratakaali soukhyaalE pondaali

chukkalu temmannaa tenchukuraanaa
choostaavaa naa mainaa chEstaanE Emainaa

ninnE meppistaanu nannE arpistaanu
vastaanammaa...eTTaagainaa

chukkalu temmannaa tenchukuraanaa
choostaavaa naa mainaa chEstaanE Emainaa

ఏప్రిల్ 1 విడుదల--1991



సంగీతం::ఇళయరాజా 
రచన::వేటూరిసుందరరామమూర్తి 
గానం::S.P.బాలు, K.S.చిత్ర
Film Directed By::Vamshi
తారాగణం::రాజేంద్రప్రసాద్,శోభన,కృష్ణభగవాన్,జయలలిత.

పల్లవి::

ఒంపుల వైఖరీ..సొంపుల వాకిలీ
ఇంపుగ చూపవే..వయ్యారీ 
వెల్లువ మాదిరీ..అల్లరి ఆకలీ
ఎందుకు పోకిరీ..చాలు మరీ 
మోవినీ మగతావినీ..ముడి వేయనీయవా 
కాదనీ అనలేననీ..ఘడియైన ఆగవా 
అదుపూ పొదుపూ లేనీ..ఆనందం కావాలీ
హద్దూ పొద్దూ లేనీ..ఆరాటం ఆపాలీ
ఒంపుల వైఖరీ..సొంపుల వాకిలీ
ఇంపుగ చూపవే...వయ్యారీ 
వెల్లువ మాదిరీ..అల్లరి ఆకలీ
ఎందుకు పోకిరీ..చాలు మరీ..హో

చరణం::1

"మాంగల్యం తంతునానేన..మమజీవన హేతునా 
కంఠే భద్రామి శుభకే..త్వం జీవ శరదస్యకం 
త్వం జీవ శరదస్యకం..త్వం జీవ శరదస్యకం "
కాంక్షలో కైపు నిప్పూ..ఎంతగా కాల్చినా 
దీక్షగా ఓర్చుకున్నా..మోక్షమే ఉండదా 
శ్వాసలో మోహదాహం..గ్రీష్మమై వీచగా 
వాంఛతో వేగు దేహం..మరయాగ వాటికా
కాలమే కాలిపోయే..ఆజ్యమే పోయవా 
మౌనమే గానమయ్యే..మూర్తమే చూడవా 
హో..హో 
ఒంపుల వైఖరీ..సొంపుల వాకిలీ
ఇంపుగ చూపవే..వయ్యారీ 
వెల్లువ మాదిరీ..అల్లరి ఆకలీ
ఎందుకు పోకిరీ..చాలు మరీ..హో

చరణం::2

నిష్ఠగా నిన్ను కోరీ..నీమమే దాటినా 
కష్ఠమే సేద తీరే..నేస్తమే నోచనా 
నిద్రహం నీరు గారే..జ్వాలలో నింపినా 
నేర్పుగా ఈది చేరే..నిశ్చయం మెత్తనా
సోయగం సొంతమయ్యే..స్వర్గమై చేరవా 
మధనమే అంతమయ్యే..అమృతం అందుకో 
హో..హో 
ఒంపుల వైఖరీ..సొంపుల వాకిలీ
ఇంపుగ చూపవే..వయ్యారీ 
వెల్లువ మాదిరీ..అల్లరి ఆకలీ
ఎందుకు పోకిరీ..చాలు మరీ..హో

April 1 Vidudala--1991
Music::Ilayaraajaa 
Lyrics:Veturisundararaamamoorti   
Singer's::S.P.Baalu, K.S.Chitra
Film Directed By::Vamshi
Cast::Rajendraprasaad,Sobhana,Krishnabhagavan,Jayalalita.

::::

ompula vaikharee..sompula vaakilee
impuga choopavE..vayyaaree 
velluva maadiree..allari aakalee
enduku pOkiree..chaalu maree 
mOvinee magataavinee..muDi vEyaneeyavaa 
kaadanee analEnanee..ghaDiyaina aagavaa 
adupoo podupoo lEnee..aanandam kaavaalee
haddoo poddoo lEnee..aaraaTam aapaalee
ompula vaikharee..sompula vaakilee
impuga choopavE...vayyaaree 
velluva maadiree..allari aakalee
enduku pOkiree..chaalu maree..hO

::::1

"maangalyam tantunaanEna..mamajeevana hEtunaa 
kanThE bhadraami SubhakE..twam jeeva Saradasyakam 
twam jeeva Saradasyakam..twam jeeva Saradasyakam "
kaankshalO kaipu nippoo..entagaa kaalchinaa 
deekshagaa Orchukunnaa..mOkshamE unDadaa 
SwaasalO mOhadaaham..greeshmamai veechagaa 
vaanChatO vEgu dEham..marayaaga vaaTikaa
kaalamE kaalipOyE..aajyamE pOyavaa 
maunamE gaanamayyE..moortamE chooDavaa 
hO..hO 
ompula vaikharee..sompula vaakilee
impuga choopavE..vayyaaree 
velluva maadiree..allari aakalee
enduku pOkiree..chaalu maree..hO

::::2

nishThagaa ninnu kOree..neemamE daaTinaa 
kashThamE sEda teerE..nEstamE nOchanaa 
nidraham neeru gaarE..jwaalalO nimpinaa 
nErpugaa iidi chErE..niSchayam mettanaa
sOyagam sontamayyE..swargamai chEravaa 
madhanamE antamayyE..amRtam andukO 
hO..hO 
ompula vaikharee..sompula vaakilee
impuga choopavE..vayyaaree 
velluva maadiree..allari aakalee
enduku pOkiree..chaalu maree..hO

మాభూమి--1980



సంగీతం::వింజమూరి సీత,గౌతం ఘోష్
రచన::సుద్దాల హనుమంతు
గానం::సంధ్య
Film Directed By::B.Narasingarao
రాతాగణం::సాయిచంద్,శకుంతల,హంస.     

పల్లవి::

పల్లెటూరీ...పిల్లగాడా
పశులగాసే..మొనగాడ  
పల్లెటూరీ...పిల్లగాడా
పశులగాసే..మొనగాడ 
పాలు మరచీ..ఎన్నాల్లయ్యిందో
ఓ..పాలబుగ్గలా..జీతగాడా
కొలువు కుదిరీ..ఎన్నాల్లయ్యిందో  

చాలి చాలని..చింపులంగీ 
చల్లగాలికి..సగము ఖాళీ 
చాలి చాలని..చింపులంగీ 
చల్లగాలికి..సగము ఖాళీ  
గోనె చింపూ..కొప్పెర పెట్టావా
ఓ..పాలబుగ్గలా జీతగాడా 
దాని చిల్లులెన్నో..లెక్కాబెట్టేవా

తాటి గెగ్గలా..కాలి జోడూ 
తప్పటడుగుల..నడక తీరు
తాటి గెగ్గలా..కాలి జోడూ 
తప్పటడుగుల..నడక తీరు
బాటతో పని..లేకుంటయ్యిందా 
ఓ..పాలబుగ్గలా జీతగాడా 
చేతికర్రే తోడైపోయిందా

గుంపు తరలే..వంపులోకి 
కూరుచున్నవు..గుండు మీద
గుంపు తరలే వంపులోకి 
కూరుచున్నవు..గుండు మీద
దొడ్డికే నీవు..దొరవై పోయావా 
ఓ..పాలబుగ్గలా జీతగాడా  
దొంగ..గొడ్లనడ్డగించేవా 

కాలువై..కన్నీరు గారా
కల్ల పై రెండు..చేతులాడ 
కాలువై..కన్నీరు గారా
కల్ల పై రెండు..చేతులాడ 
వెక్కి వెక్కి..ఏడ్చెదవదియేలా
ఓ..పాలబుగ్గలా జీతగాడా
ఎవ్వరేమన్నారో చెప్పేవా

మాయదారి..ఆవుదూడలు 
మాటి మాటికి..ఎనుగుదుమికి
మాయదారి..ఆవుదూడలు 
మాటి మాటికి..ఎనుగుదుమికి
పంట చేను పాడు..చేసాయా
ఓ..పాలబుగ్గలా జీతగాడా
పాలికాపూ..నిన్నే గొట్టాడా

నీకు జీతము..నెలకు కుంచము
తాలు వడిపిలి..కల్తి గాసము
నీకు జీతము..నెలకు కుంచము
తాలు వడిపిలి..కల్తి గాసము
కొలువగ శేరు..తక్కువ వచ్చాయా 
ఓ..పాలబుగ్గలా జీతగాడా 
తల్చుకుంటే..దుఖం వచ్చిందా 

పల్లెటూరీ...పిల్లగాడా
పశులగాసే..మొనగాడ 
పల్లెటూరీ...పిల్లగాడా
పశులగాసే..మొనగాడ 

పాలు మరచీ..ఎన్నాల్లయ్యిందో  
ఓ..పాలబుగ్గలా జీతగాడా 
కొలువు కుదిరీ..ఎన్నాల్లయ్యిందో  
కొలువు కుదిరీ..ఎన్నాల్లయ్యిందో  
కొలువు కుదిరీ..ఎన్నాల్లయ్యిందో 

Maabhuumi--1980
Music::Vinjamoori seeta goutam ghosh
Lyrics::Suddaal Hanumantu
Singer's::Sandhya
Film Directed By::B.Narasingarao 
Cast::Saayichand,Sakuntala,Hamsa.  

:::::::::