Sunday, October 27, 2013

బందిపోటు దొంగలు--1969
సంగీతం::పెండ్యాలనాగేశ్వరరావు
రచన::దాశరథి 
గానం::ఘంటసాల
దర్శకత్వం::K.S.ప్రకాశరావు 
తారాగణం::అక్కినేని,S.V.రంగారావు, జగ్గయ్య, గుమ్మడి, నాగభూషణం,జమున,
కాంచన, రాజబాబు

పల్లవి::

విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో 
తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో 
విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో 
తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో
విరిసిన వెన్నెలవో..ఓ ఓ ఓ ఓ ఓ

చరణం::1

సిగలో గల జాబిల్లి చిరునగవులు చిందగా.
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ...
సిగలో గల జాబిల్లి చిరునగవులు చిందగా 
అడుగడుగున హంసలు ఒయ్యారము లొలుకగా 
వెతికే పెదవులతో..తొణికే మధువులతో 
వెతికే పెదవులతో..తొణికే మధువులతో 
పొందుగోరి చెంతజేరి మురిపించే నా చెలీ 
విరిసిన వెన్నెలవో..పిలిచిన కోయిలవో 
తీయని కోరికవో..చెలీ చెలీ నీవెవరో 
విరిసిన వెన్నెలవో..ఓ ఓ ఓ ఓ ఓ 

చరణం::2

కరుణలేని శిలనైనా కరిగించే నవ్వుతో 
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ...
కరుణలేని శిలనైనా కరిగించే నవ్వుతో 
ముల్లునైన మల్లియగా మలచే కనుదోయితో 
నడిచే తీగియవై..పలికే దీపికవై 
నడిచే తీగియవై..పలికే దీపికవై 
అవతరించి ఆవరించి అలరించే నా చెలీ

విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో 
తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో 
విరిసిన వెన్నెలవో..ఓ ఓ ఓ ఓ ఓ

Sunday, October 20, 2013

సంపూర్ణ రామాయణం--1973:::రాగమాలిక

సంగీతం::K.V.మహదేవన్
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం::P.సుశీల

శహన::రాగం

ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది
ఓరగా నెమలి పింఛ మారవేసుకుంటుంది
ఎందుకో..ఎందుకో ప్రతిపులుగు
ఏదో చెప్పబోతుంది
వనములో చెట్టు చెట్టు
కనులు విప్పి చూస్తుంది
ఉండుండీ నా ఒళ్లు ఊగి ఊగి పోతుంది

అదుగో రామయ్యే
ఆ అడుగులు నా తండ్రివే
ఇదిగో శబరీ శబరీ వస్తున్నానంటున్నవి
కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని
నా కోసమె నా కోసమె నడచి నడచి నడచీ
నా కన్నా నిరుపేద
నా మహరాజు పాపం అదుగో

ఆనందభైరవి::రాగం 

అసలే ఆనదు చూపు ఆపై ఈ కన్నీరు
తీరా దయచేసిన
నీ రూపు తోచదయ్యయ్యో
ఎలాగో నా రామా! ఏదీ? ఏదీ? ఏదీ?
నీల మేఘమోహనము నీ మంగళరూపము

మోహన::రాగం 

కొలను నడిగీ తేటనీరు
కొమ్మనడిగీ పూలచేరు
పట్టునడిగీ చెట్టునడిగి 
పట్టుకొచ్చిన ఫలాలు పుట్టతేనె రసాలు
దోరవేవో కాయలేవో
ఆరముగ్గిన వేవోగాని
ముందుగా రవ్వంత చూసి
విందుగా అందియ్యనా..విందుగా అందియ్యనా

Sampoorna Ramaayanam--1971
Music::K.V.Mahadaevan
Lyrics::Devulapalli KrshnaSaastri
Singer's::P.Suseela

oorike kolanu neeru uliki uliki paDutundi
Oragaa nemali pincha maaravesukunTundi
endukO..endukO..pratipulugu
aedO cheppabOtuMdi
vanamulO cheTTu cheTTu
kanulu vippi choostundi
unDunDee naa ollu oogi oogi pOtundi

adugO raamayye
aa aDugulu naa tanDrive
idigO Sabaree Sabaree vastunnaa nanTunnavi
kadalaledu verri Sabari eduru chooDaledani
naa kOsame naa kOsame naDachi naDachi naDachee
naa kannaa nirupeda
naa maharaaju paapam adugO

asale aanadu choopu aapai ee kanneeru
teeraa dayachesina
nee roopu tOchadayyayyO
elaagO naa raamaa! Edee? Edee? Edee?
neela meghamOhanamu nee mangaLaroopamu

kolanu naDigee teTaneeru
kommanaDigee poolacheru
paTTunaDigee cheTTunaDigi 
paTTukochchina phalaalu..puTTatene rasaalu
dOravevO kaayalevO
aaramuggina vevOgaani
mundugaa ravvanta choosi

vindugaa andiyyanaa..vindugaa andiyyanaa

Friday, October 18, 2013

శ్రీ సత్యనారాయణ మహత్యం--1964


సంగీతం::ఘంటసాల
రచన::సముద్రాల(జూనియర్) 
గానం::ఘంటసాల,సుశీల

పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
జాబిల్లి శోభ నీవే..జలదాల మాల..నీవే
జలతారు మెరుపు నీవే..జగమేలు స్వామి..నీవే

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
జాబిల్లి శోభ నీవే..జలదాల మాల..నీవే
జగమేలు వలపు నీవే..జవరాలి ఆశ..నీవే

చరణం::1

కుసుమాల సొయగాల..శుకపాళికలరవాల 
కుసుమాల సొయగాల..శుకపాళికలరవాల

జగమంత నీదు లీల..ఆనంద మధుర కేల
జాబిల్లి శోభ నీవే..జలదాల మాల..నీవే

చరణం::2

మదిలోని మమత నీవే..మనసేలు సామి..నీవే 
మదిలోని మమత నీవే..మనసేలు సామి..నీవే
మురిపించు ఆశ నీవే..కరుణించి ఏలలేవే..ఏ..

Sree Satyanaaraayana Mahatyam--1964
Music::Ghantasala
Lyrics::Samudrala 
Singer's::Ghantasaala,P.Suseela 

:::::
aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa
jaabilli SObha neevE..jaladaala maala..neevE
jalataaru merupu neevE..jagamElu swaami..neevE

aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa
jaabilli SObha neevE..jaladaala maala..neevE
jagamElu valapu neevE..javaraali aaSa..neevE

:::::1

kusumaala soyagaala..SukapaaLikalaravaala 
kusumaala soyagaala..SukapaaLikalaravaala
jagamaMta needu leela..aananda madhura kEla

jaabilli SObha neevE..jaladaala maala..neevE

:::::2

madilOni mamata neevE..manasElu saami..neevE 
madilOni mamata neevE..manasElu saami..neevE
muripiMchu aaSa neevE..karuNiMchi..ElalEvE..E..

Tuesday, October 15, 2013

సిరి సిరి మువ్వ--1978

సంగీతం::K,V.మహాదేవన్
రచన::వేటూరి సుందరరామమూర్తి
గానం::S.P.బాలు

అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
అందరికీ అందనిదీ పూచిన కొమ్మ
పుత్తడిబొమ్మా..పూచినకొమ్మా 
అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
అందరికీ అందనిదీ పూచిన కొమ్మ

చరణం::1

పలకమన పలకదే పంచదార చిలక
కులుకే సింగారమైన కొల సిగ్గుల మొలక
ఎదకన్నాలోతుగా పదిలంగా దాచుకో
నిదురించే పెదవిలో పదముందీ పాడుకో
పుత్తడిబొమ్మా, పూచిన కొమ్మా 

అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
అందరికీ అందనిదీ పూచిన కొమ్మ
పుత్తడిబొమ్మా..పూచినకొమ్మా

చరణం::2

ఆ రాణి పాదాల పారాణి జిలుగులో
నీ రాజభోగాలు పాడనీ తెలుగులో
ముడి వేసిన కొంగునే గుడివుంది తెలుసుకో
గుడిలోని దేవతని గుండెలో కలుసుకో
పుత్తడి బొమ్మా..పూచిన కొమ్మా 

అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
అందరికీ అందనిదీ పూచిన కొమ్మ
పుత్తడిబొమ్మా..పూచినకొమ్మా

సాకీ: ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను
ముందు జన్మవుంటే ఆ కాలి మువ్వనై పుడతాను
పుత్తడి బొమ్మా..పూచినకొమ్మా 

అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
అందరికీ అందనిదీ పూచిన కొమ్మ
పుత్తడిబొమ్మా..పూచినకొమ్మా

సిరి సిరి మువ్వ--1978


సంగీతం::K,V.మహాదేవన్
రచన::వేటూరి సుందరరామమూర్తి
గానం::S.P.బాలు, P. సుశీల

ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు
ఒక గొంతులోనే పలికింది..అది
ఏ రాగమని నన్నడిగింది 
ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు
ఒక గొంతులోనే పలికింది..అది
ఏ రాగమని నన్నడిగింది

చరణం::1

అది మనవూరి కోకిలమ్మా నిన్నడిగింది కుశలమమ్మా 
నీజమేమొ తెలుపు నీ మనసు తెలుపు
ఎగిరేను మన వూరివైపు
అది మనవూరి కోకిలమ్మా నిన్నడిగింది కుశలమమ్మా
పదిమంది కామాట తెలుపు 
నీజమేమొ తెలుపు నీ మనసు తెలుపు
ఎగిరేను మన వూరివైపు

గోదారల్లే..ఎన్నెట్లో గోదారల్లే..ఎల్లువ
గోదారల్లే..వెన్నెట్లో గోదారల్లె ఎదలో ఏదోమాట
రొదలో ఏదో పాట 
గోదారల్లే..ఎన్నెట్లో గోదారల్లే..ఎల్లువ
గోదారల్లే..వెన్నెట్లో గోదారల్లె
అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే
గట్టుమీన రెల్లు పువ్వా బిట్టులికి పడుతుంటే 
అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే
గట్టుమీన రెల్లు పువ్వా బిట్టులికి పడుతుంటే
ఏటివార లంకలోనా ఏటవాలు డొంకలోనా 
ఏటివార లంకలోనా ఏటవాలు డొంకలోనా
పల్లంకి పిట్టా పల్లకిలోనా
సల్లంగ మెల్లంగ ఊగుతు ఉంటే 

గోదారల్లే..ఎన్నెట్లో గోదారల్లే..ఎల్లువ
గోదారల్లే..వెన్నెట్లో గోదారల్లె ఎదలో ఏదోమాట
రొదలో ఏదో పాట 
గోదారల్లే..ఎన్నెట్లో గోదారల్లే..ఎల్లువ
గోదారల్లే..వెన్నెట్లో గోదారల్లె

సిరి సిరి మువ్వ--1978
సంగీతం::K,V.మహాదేవన్
రచన::వేటూరి సుందరరామమూర్తి
గానం::S.P.బాలు,పట్టాభి,కోరస్‌ 

పల్లవి::

ఊరేగినా వాడే..ఏ..ఊరేలినా వాడే..ఏ..
ఊరూ పేరున్న వాడు..ఉన్నవాడూ వాడే

మా వూరి దేవుడమ్మా
చల్లంగ మమ్మేలు రాముడమ్మా 
మా వూరి దేవుడమ్మా..చల్లంగ మమ్మేలు రాముడమ్మా

మా వాడ వెలసినాడు మా వారి గాంచినాడు 
మా వాడ వెలసినాడు మా వారి గాంచినాడు
మహి లోపల దేముడై మహిమలెన్నో చూపినాడు 
మా వూరి దేవుడమ్మా..చల్లంగ మమ్మేలు రాముడమ్మా

చరణం::1

మహాప్రభో నీ మహిమ తెలియగా..మానవు లెంతటివారు
ఓ..మహాప్రభో నీ మహిమ తెలియగా..మానవు లెంతటివారు
పరమాత్మ నీ భజనకు పిలచితే..బద్దకమని పలికేరు
చర్మపు తిత్తులే శాశ్వత మనుకొని..చర్మపు తిత్తులే శాశ్వత మనుకొని
చర్మపు తిత్తులే శాశ్వత మనుకొని..చర్మపు తిత్తులే శాశ్వత మనుకొని 
చర్మపు తిత్తులే శాశ్వత మనుకొని..చంచల మతులయ్యేరు
హరి..హరిలో రంగ హరి..వైకుంఠ వాసా హరి
హరిలో రంగ హరి హరి హరి హరి హరి
ఒక మాట ఒక బాణం అన్నాడు
ఒక సీతమ్మనే ఏలుకున్నాడు 
ఒక మాట ఒక బాణం అన్నాడు
ఒక సీతమ్మనే ఏలుకున్నాడు 

మడేలోడి మాటైనా మన్నించాడూ
మడేలోడి మాటైనా మన్నించాడూ
అడవికంపి సీతమ్మను ఆదర్శం నిలిపాడు 

మా వూరి దేవుడమ్మా..చల్లంగ మమ్మేలు రాముడమ్మా

చరణం::2

ఓ హోయ్‌ రాములు సా హోయ్‌ సాములు 
ఓ హోయ్‌ రాములు సా హోయ్‌ సాములు
పడతా పడతా నేను పప్పు దాకలో పడతా
పడతా పడతా నేను పాతర గోతిలో పడతా
సీతమ్మప్పో..హనుమంతప్పొ..హనుమంతప్పో..సీతమ్మప్పొ
ఓ హోయ్‌ రాములు సా హోయ్‌ సాములు
మా ఆడపడుచులు మా తల్లులు సీతమ్మలు
మగసిరిగల దొరలంతా..మా తండ్రులు రామయ్యలు 
మా ఆడపడుచులు మా తల్లులు సీతమ్మలు
మగసిరిగల దొరలంతా..మా తండ్రులు రామయ్యలు

లేదూ రావణబాధ రాదు మాకు ఏ కొరత 
లేదూ రావణబాధ రాదు మాకు ఏ కొరత
రాముడే దేముడైన రామాయణమే మా కథ 

మా వూరి దేవుడమ్మా..చల్లంగ మమ్మేలు రాముడమ్మా..ఆఆఅ
మా వూరి దేవుడమ్మా..చల్లంగ మమ్మేలు రాముడమ్మా..ఆఆఅ

Monday, October 14, 2013

సిరి సిరి మువ్వ--1978

సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు

కీరవాణి:::రాగం{హిందుస్తాని కర్నాటక} 

పల్లవి::

ఝణన ఝణన నాదంలో ఝుళిపించిన పాదంలో
జగము జలదరిస్తుంది పెదవి పలకరిస్తుంది
గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది 
గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది
గుండె ఝల్లు మంటుంటే..కవిత వెల్లువవుతుంది
గుండె ఝల్లు మంటుంటే..కవిత వెల్లువవుతుం
గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది

చరణం::1

అమరావతి శిల్పంలో..అందమైన కళలున్నాయి
అవి..నీలో..మిల మిల మెరిసే..అరకన్నుల కలలైనాయి
అమరావతి శిల్పంలో..అందమైన కళలున్నాయి
అవి..నీలో..మిల మిల మెరిసే..అరకన్నుల కలలైనాయి
నాగార్జున కొండ కోనలో..నాట్యరాణి కృష్ణవేణి
నాగార్జున కొండ కోనలో..నాట్యరాణి కృష్ణవేణి
నీ విరుపుల మెరుపులలో..నీ పాదాల పారాణి 

గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది
గుండె ఝల్లు మంటుంటే..కవిత వెల్లువవుతుంది
గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది

చరణం::2

తుంగభద్ర తరంగాలలో..సంగీతం నీలో వుంది
రంగ రంగ వైభవంగా..పొంగి పదం పాడిస్తుంది
తుంగభద్ర తరంగాలలో..సంగీతం నీలో వుంది
రంగ రంగ వైభవంగా..పొంగి పదం పాడిస్తుంది
అచ్చ తెలుగు నుడికారంలా..మచ్చలేని మమకారంలా 
అచ్చ తెలుగు నుడికారంలా..మచ్చలేని మమకారంలా
వచ్చినదీ కవితా గానం..నీ విచ్చిన ఆరవ ప్రాణం 

గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది
గుండె ఝల్లు మంటుంటే..కవిత వెల్లువవుతుంది
గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది
a

సిరి సిరి మువ్వ--1978


సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు

పల్లవి::

రా దిగిరా దివినుంచి భువికి దిగిరా
రా దిగిరా దివినుంచి భువికి దిగిరా
రామ హరే శ్రీరామ హరే..రామ హరే శ్రీరామ హరే
రాతి బొమ్మకు రవ్వలు పొదిగి రామ హరే శ్రీరామ హరే
రాతి బొమ్మకు రవ్వలు పొదిగి రామ హరే శ్రీరామ హరే అని
పట్టిన హారతి చూస్తూ ఏమీ పట్టనట్టు కూర్చుంటే చాలదు

రా దిగిరా దివినుంచి భువికి దిగిరా
రా దిగిరా దివినుంచి భువికి దిగిరా
రామ హరే శ్రీరామ హరే..రామ హరే శ్రీరామ హరే


చరణం::1

అలనాటి ఆ సీత ఈనాటి దేవత
శతకోటి సీతల కలబోత ఈ దేవత
రామచంద్రుడా కదలిరా రామాబాణమే వదలరా
ఈ ఘోర కలిని మాపరా ఈ క్రూర బలిని ఆపరా 

రా దిగిరా దివినుంచి భువికి దిగిరా
రా దిగిరా దివినుంచి భువికి దిగిరా
రామ హరే శ్రీరామ హరే..రామ హరే శ్రీరామ హరే


చరణం::2

నటరాజ శత సహ్రస రవితేజా
నటగాయక వైతాళిక మునిజన భోజా 
నటరాజ శత సహ్రస రవితేజా
నటగాయక వైతాళిక మునిజన భోజా
దీనావన భవ్య కళాదివ్య పదాంభోజా చెరి సగమై రస జగమై
చెలరేగిన నీ చెలి ప్రాణము బలిపశువై యజ్ఞవాటి
వెలి బూడిద అయిన క్షణము
సతీ వియోగము సహించక
దుర్మతి¸° దక్షుని మదమడంచగ
ఢమ ఢమ ఢమ ఢమ డమరుక ధ్వనుల
నమక చమక యమ గమక లయంకర
సకలలోక జర్జరిత భయంకర
వికట సటత్పద విస్ఫు లింగముల
విలయ తాండవము సలిపిన నీవే
శిలవే అయితే పగిలిపో
శివుడే అయితే రగిలిపో

సిరి సిరి మువ్వ--1978

సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల

రేవతి::రాగం 

పల్లవి::

ఝుమ్మంది నాదం సై అంది పాదం
తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల
ఝుమ్మంది నాదం సై అంది పాదం
తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల


చరణం::1

ఎదలోని సొదలా ఎలదేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
ఎదలోని సొదలా ఎలదేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
చలిత లలిత పద కలిత కవితలెద సరిగమ పలికించగా
స్వర మధురిమలొలికించగా
సిరి సిరి మువ్వలు పులకించగా

ఝుమ్మంది నాదం సై అంది పాదం
తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల

చరణం::2

నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి
నటియించు నీవని తెలిసి
నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి
నటియించు నీవని తెలిసి
ఆకాశమై పొంగె ఆవేశం
కైలాసమే వంగె నీకోసం

ఝుమ్మంది నాదం సై అంది పాదం
తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల

చరణం::3

మెరుపుంది నాలో అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో అది మువ్వ పిలుపు
చినుకు చినుకులో చిందులయలతో
కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే ఏడు రంగులుగా

ఝుమ్మంది నాదం సై అంది పాదం
తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల

సిరి సిరి మువ్వ--1978
సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు

చక్రవాకం::రాగం

పల్లవి::

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటుపోతుందో ఎవరిని అడుగక
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటుపోతుందో ఎవరిని అడుగక
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక

చరణం::1

వాన కురిసి కలిసేది..వాగులో
వాగువంక కలిసేది..నదిలో హ
వాన కురిసి కలిసేది..వాగులో
వాగువంక కలిసేది..నదిలో
కదిలి కదిలి నదులన్నీ..కలిసేది కడలిలో
కదిలి కదిలి నదులన్నీ..కలిసేది కడలిలో
కాని ఆ కడలి కలిసేది..ఎందులో

ఎవరికెవరు ఈ లోకంలో..ఎవరికి ఎరుక
ఏ దారెటుపోతుందో..ఎవరిని అడుగక
ఎవరికెవరు ఈ లోకంలో...ఓఓఓఓ

Thursday, October 10, 2013

శ్రీ సింహాచల క్షేత్ర మహిమ--1965సంగీతం::T.V. రాజు
రచన::రాజశ్రీ 
గానం::S.జానకి,P.B.శ్రీనివాస్
శ్రీ సరస్వతీ మూవీస్ వారి
దర్శకత్వం::B.V..ప్రసాద్
తారాగణం::కాంతారావు,కృష్ణకుమారి,రాజనాల,రాజశ్రీ,రేలంగి,గిరిజ.

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రావోయి రాజా..కనరావోయి రాజా
రా..వో..యి..రా..జా..ఆఆఅ 
కన..రా..వో..యి..రాజా..ఆఆఅ 
చెలి నేరాలు..మన్నించరావా
అనురాగాల..తేలించరావా
ఓ..హో..హో..హో..ఓఓ
నేరాలు..మన్నించరావా
అనురాగాల..తేలించరావా..ఆఆ
రా..వో..యి..రా..జా..ఆఆ
కన..రా..వో..యి..రాజా..ఆఆఅ 
రావోయి రాజా..ఆఆ

చరణం::1

విరహాల తిమిరాలు..తొలగించవా..ఆ
ఓ..హో..హో..ఓఓఓ 
అనురాగ దీపాలు..వెలిగించవా
విరహాల తిమిరాలు..తొలగించవా 
అనురాగ దీపాలు..వెలిగించవా
నిను కానక..నిలువలేనిక 
మనసు నీదే..ఓ ప్రియ
రావోయి రాజా..కనరావోయి రాజా 
రావోయి రాజా..కనరావోయి రాజా

చరణం::2

విరహాల తిమిరాలు..తొలగించవా 
మ్మ్ మ్మ్ మ్మ్ హు హు హూ 
అనురాగ దీపాలు..వెలిగించవా
విరహాల తిమిరాలు..తొలగించవా 
అనురాగ దీపాలు..వెలిగించవా
చెలి కన్నుల..విరిసే వెన్నెల
కనవదేలా..ఓ ప్రియ
రావే విరి బాల..ఆ..హా
దరి రావే..ఈ వేళా
నయగారాల..మన ప్రేమ గాధ
కలకాలాలు..నిలిచేది కాదా..ఓ..హోహోహో
గారాల మన..ప్రేమ గాధ
కలకాలాలు..నిలిచేది కాదా

రావే విరి బాల..దరి రావే ఈ వేళా
రావే విరి బాల..దరి రావే ఈ వేళా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం::3

విడలేని బంధాల..అనుబంధము
ఆ..హా..హా
వెలలేని రాగల..ఆనురాగము
విడలేని బంధాల..అనుబంధము
వెలలేని రాగల..ఆనురాగము
మనదేనుగా..ఆ
రావోయీ రాజా..కనరావోయీ రాజా 

Sree Simhaachala Kshetra Mahima--1965
Music::T.v. Raaju
Lyrics::Raajasree 
gaanam::S.jaanaki,P.B..Sreenivas
Sree Saraswatii Movies Vaari
Film Directed By::B.V.Prasaad
Cast::KaantaRao,Krishnakumaari,Raajanaala,RaajaSree,Relangi,Girija.

:::::::::::::::::::::::::

aa aa aa aa aa aa..aa aa aa aa aa aa
raavOyi raajaa..kanaraavOyi raajaa
raa..vO..yi..raa..jaa..aaaaaaa 
kana..raa..vO..yi..raajaa..aaaaaaa 
cheli nEraalu..mannincharaavaa
anuraagaala..tElincharaavaa
O..hO..hO..hO..OO
nEraalu..mannincharaavaa
anuraagaala..tElincharaavaa..aaaaaa
raa..vO..yi..raa..jaa..aaaaaa
kana..raa..vO..yi..raajaa..aaaaaaa 
raavOyi raajaa..aaaaaa

::::1

virahaala timiraalu..tolaginchavaa..aa
O..hO..hO..OOO 
anuraaga deepaalu..veliginchavaa
virahaala timiraalu..tolaginchavaa 
anuraaga deepaalu..veliginchavaa
ninu kaanaka..niluvalEnika 
manasu needE..O..priya
raavOyi raajaa..kanaraavOyi raajaa 
raavOyi raajaa..kanaraavOyi raajaa

::::2

virahaala timiraalu..tolaginchavaa 
mm mm mm hu hu huu 
anuraaga deepaalu..veliginchavaa
virahaala timiraalu..tolaginchavaa 
anuraaga deepaalu..veliginchavaa
cheli kannula..virisE vennela
kanavadElaa..O priya
raavE viri baala..aa..haa
dari raavE..ii vELaa
nayagaaraala..mana prEma gaadha
kalakaalaalu..nilichEdi kaadaa..O..hOhOhO
gaaraala mana..prEma gaadha
kalakaalaalu..nilichEdi kaadaa

raavE viri baala..dari raavE ii vELaa
raavE viri baala..dari raavE ii vELaa
aa aa aa aa aa aa aa aa aa

::::3

viDalEni bandhaala..anubandhamu
aa..haa..haa
velalEni raagala..aanuraagamu
viDalEni bandhaala..anubandhamu
velalEni raagala..aanuraagamu
manadEnugaa..aa
raavOyii raajaa..kanaraavOyii raajaa 

సిపాయి చిన్నయ్య--1969


సంగీతం::M.S..విశ్వనాథన్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల 

పల్లవి::

నా జన్మ భూమి..నా జన్మ భూమి 
నా జన్మ భూమి ఎంత అందమైన దేశము
నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామి రంగ హొయ్ హొయ్ నా సామి రంగ 

నా జన్మ భూమి ఎంత అందమైన దేశము
నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామి రంగ హొయ్ హొయ్ నా సామి రంగ

చరణం::1

నడిచేదారిలో..నవ్వులే పువ్వులు
శాంతి నాదాలతో..ఎగిరే పిట్టలు అ..హ..హా..హా 
అ..హ..హా..హా..అ..హ..హా..హా  
నడిచేదారిలో..నవ్వులే పువ్వులు
శాంతి నాదాలతో..ఎగిరే పిట్టలు
పచ్చనీ పంటలు..వెచ్చనీ జంటలు
చల్లనీ జీవితం
ఇదే నవభారతం..హొయ్ హొయ్ నా సామి రంగ

నా జన్మ భూమి ఎంత అందమైన దేశము
నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామి రంగ హొయ్ హొయ్ నా సామి రంగ 

చరణం::2

బతకాలందరూ..దేశం కోసమే
దేశమంటేను మట్టికాదోయ్..మనుషులె అ..హ..హా..
అ..హ..హా..హా..అ..హ..హా..హా  
బతకాలందరూ..దేశం కోసమే
దేశమంటేను మట్టికాదోయ్..మనుషులె
స్వార్ధమూ..వంచన..లేనిదే పుణ్యము
త్యాగము రాగము..విడిన ధన్యము..హొయ్ హొయ్ నా సామి రంగ 

నా జన్మ భూమి ఎంత అందమైన దేశము
నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామి రంగ హొయ్ హొయ్ నా సామి రంగ 

Sipaayi Chinnayya--1969
Music::M.S.Viswanathan
Lyrics::Arudra
Singer's::Ghantasaala

::::

naa janma bhoomi..naa janma bhoomi 
naa janma bhoomi enta andamaina deSamu
naa illu andulOna kammani pradeSamu
naa saami ranga hoy^ hoy^ naa saami ranga 


naa janma bhoomi enta andamaina deSamu
naa illu andulOna kammani pradeSamu
naa saami ranga hoy^ hoy^ naa saami ranga

::::1

nadichedaarilO..navvule puvvulu
Saanti naadaalatO..egire pittalu a..ha..haa..haa 
a..ha..haa..haa..a..ha..haa..haa  
nadichedaarilO..navvule puvvulu
Saanti naadaalatO..egire pittalu 
pachchanee pantalu..vechchanee jantalu
challanee jeevitam
ide navabhaaratam..hoy^ hoy^ naa saami ranga


naa janma bhoomi enta andamaina deSamu
naa illu andulOna kammani pradeSamu
naa saami ranga hoy^ hoy^ naa saami ranga

:::2

batakaalandaroo..deSam kOsame
deSamamtenu mattikaadOy^..manushule a..ha..haa..
a..ha..haa..haa..a..ha..haa..haa  
batakaalandaroo..deSam kOsame
deSamamtenu mattikaadOy^..manushule
svaardhamoo..vanchana..lenide puNyamu
tyaagamu raagamu..vidina dhanyamu..hoy^ hoy^ naa saami ranga 

naa janma bhoomi enta andamaina deSamu
naa illu andulOna kammani pradeSamu
naa saami ranga hoy^ hoy^ naa saami ranga

Wednesday, October 09, 2013

శ్రీ సింహాచల క్షేత్ర మహిమ--1965


సంగీతం::T.V. రాజు
రచన::రాజశ్రీ 
గానం::S.జానకి,P.సుశీల
శ్రీ సరస్వతీ మూవీస్ వారి
దర్శకత్వం::B.V.ప్రసాద్
తారాగణం::కాంతారావు,కృష్ణకుమారి,రాజనాల,రాజశ్రీ,రేలంగి,గిరిజ.

పల్లవి::

ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ
అందాల ఓ సుందరా..అందాల ఓ సుందరా..ఆ
అందాల ఓ సుందరా..అనురాగభావ రసకేళివిహారా
అందాల ఓ సుందరా..ఆఆ

చరణం::1

మధుర వసంతాన..తొలివెలుగు నేనూ
తొలకరి పరువాన..చిరునవ్వు నేనూ

భావతరాగాల..లాలింతునోయీ..ఈ
భోగివిలాసాల..తేలింతునోయీ
నాట్య గానముల..నాసాటి నేనే
నాట్య గానముల..నాసాటి నేనే

అందాల ఓ సుందరా..ఆఆఅ
అందాల ఓ సుందరా..ఆఆఅ

చరణం::2

ఝణన ఝణన ఝణ..మంజీర ధ్వనిలో
ధిమికిట ధిమికిట..అడుగుల సడిలో
లలిత మనోహర..సంగీత ఝరిలో
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆఆ
లలిత మనోహర..సంగీత ఝరిలో
సరస సుధామయ..శృంగార గతిలో
ఆఆఆ ఆఆఆ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సరస సుధామయ..శృంగార గతిలో

నాట్య గానముల..నాసాటి నేనే
నాట్య గానముల..నాసాటి నేనే

అందాల ఓ సుందరా..అనురాగభావ రసకేళివిహారా
అందాల ఓ సుందరా..ఆఆ

అందాల ఓ సుందరా..ఆఆఅ
అందాల ఓ సుందరా..ఆఆఅ

Sree Simhachala Kshetra Mahima--1965
Music::T.V.Raju
Lyrics::Rajasree
gaanam::jaanaki,suSeela
Sree saraswatii muvies
Film Directed By::B.V.Prasaad
Cast::Kanta Rao, Krishna Kumari, Rajanaala,,Raajasrii,Relangi,Girija.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::

aa aa aa aa..aa aa aa aa aa 
aa aa aa aa..aa aa aa aa aa
andaala O sundaraa..andaala O sundaraa..aa
andaala O sundaraa..anuraagabhaava rasakELivihaaraa
andaala O sundaraa..aaaaaa

::::1

madhura vasantaana..tolivelugu nEnuu
tolakari paruvaana..chirunavvu nEnuu

bhaavataraagaala..laalintunOyii..ii
bhOgivilaasaala..tElintunOyii
naaTya gaanamula..naasaaTi nEnE
naaTya gaanamula..naasaaTi nEnE

andaala O sundaraa..aaaaaaa
andaala O sundaraa..aaaaaaa

::::2

jhaNana jhaNana jhaNa..manjeera dhwanilO
dhimikiTa dhimikiTa..aDugula saDilO
lalita manOhara..sangeeta jharilO
aa aa aa aa aa aa aa aa aa aaaaaaaaa
lalita manOhara..sangeeta jharilO
sarasa sudhaamaya..SRngaara gatilO
aaaaaaaa aaaaaaaa..aa aa aa aa aa aa
sarasa sudhaamaya..SRngaara gatilO

naaTya gaanamula..naasaaTi nEnE
naaTya gaanamula..naasaaTi nEnE

andaala O sundaraa..anuraagabhaava rasakELivihaaraa
andaala O sundaraa..aaaaaa

andaala O sundaraa..aaaaaaa

andaala O sundaraa..aaaaaaa

చివరకు మిగిలేది--1960సంగీతం::అశ్వద్ధామ
రచన::మల్లాది
గానం::K. జమునారాణి
దర్శకత్వం::G.రామినీడు
తారాగణం::బాలయ్య, సావిత్రి, కాంతారావు, జమున, ప్రభాకర రెడ్డి

పల్లవి::

అందానికి అందం నేనే 
జీవన మఖరందము నేనే 
అందానికి అందం నేనే 
జీవన మఖరందము నేనే
తీవకు పూవును నేనే 
పూవుకు తావిని నేనే
తీవకు పూవును నేనే 
పూవుకు తావిని నేనే 
ధరణి అమరధామమయి 
ఆనందము నేనే 

అందానికి అందం నేనే 
జీవన మఖరందము నేనే

చరణం::1

వాలు కళ్ళ సోయగాలే 
చెంగల్వ తోరణాలు 
ఆరారు చిరు నవ్వులే..లే..
కన్నె విరుల హారాలు 
నా మేనే..ఏ..మెరుపు తీవ 
నగు మోమే..ఏ..చందమామ 
నా మేనే మెరుపు తీవ 
నగు మోమే చందమామ 
నవ చైతన్య సమ్మోహ సమ్మేళన నేనే

అందానికి అందం నేనే 
జీవన మఖరందము నేనే

చరణం::2

మలయానిల..లాలనలో 
పదే పదే..పరవశమై
మలయానిల..లాలనలో 
పదే పదే..పరవశమై   
గానమేలు ఎల కోయిల 
గళ మధురిమ నేనే 
గానమేలు ఎల కోయిల 
గళ మధురిమ నేనే
మాయని తియ్యందనాలు 
మన వరాలు 
అవలీలగా..జగమేలగా 
అవలీలగా..జగమేలగా 
నవచైతన్య..సమ్మోహ..సమ్మేళన..నేనే 

అందానికి అందం నేనే 
జీవన మఖరందము నేనే 
అందానికి అందం నేనే 
జీవన మఖరందము నేనేChivaraku Migilaedi--1960
Music::Aswadhama
Lyrics::Mallaadi
Singer's::K.JamunaaRaaNi
Directed by::G.RaamiNeedu
Cast::Baalayya, Saavitri, KaaMtaaRao, Jamuna, Prabhaakara ReDDi

::::

andaaniki andam nene 
jeevana makharaMdamu nene 
andaaniki andam nene 
jeevana makharandamu nene
teevaku poovunu nene 
poovuku taavini nene
teevaku poovunu nene 
poovuku taavini nene 
dharaNi amaradhaamamayi 
aanandamu nene 

andaaniki andam nene 
jeevana makharandamu nene

::::1

vaalu kaLLa sOyagaale 
chengalva tOraNaalu 
aaraaru chiru navvule..le..
kanne virula haaraalu 
naa mene..e..merupu teeva 
nagu mOme..e..chandamaama 
naa mene merupu teeva 
nagu mOme chandamaama 
nava chaitanya sammOha sammeLana nene

andaaniki andam nene 
jeevana makharandamu nene

:::::2

malayaanila..laalanalO 
pade pade..paravaSamai
malayaanila..laalanalO 
pade pade..paravaSamai   
gaanamelu ela kOyila 
gaLa madhurima nene 
gaanamelu ela kOyila 
gaLa madhurima nene
maayani tiiyyandanaalu 
mana varaalu 
avaleelagaa..jagamelagaa 
avaleelagaa..jagamelagaa 
navachaitanya..sammOha..sammeLana..nene 

andaaniki andam nene 
jeevana makharaMdamu nene 
andaaniki andam nene 
jeevana makharandamu nene

Sunday, October 06, 2013

ఇంటికి దీపం ఇల్లాలే--1961సంగీతం::M.S.విస్వనాథన్
రచన::ఆచార్య - ఆత్రేయ
గానం::P.సుశీల
Film Directed By::T.R.Ramanna
తారాగణం::N.T.రామారావు,జగ్గయ్య,జమున,B.సరోజాదేవి,నాగయ్య,కన్నాంబ,రేలంగి,గిరిజ,రమణారెడ్డి,E.V.సరోజ,K.మాలతి.

పల్లవి::

ఒకే రాగం ఒకే తాళం..
ఒకే రాగం ఒకే తాళం..ఒకే గీతం పాడేనమ్మా
ఒకే రాగం ఒకే తాళం..ఒకే గీతం పాడేనమ్మా

చరణం::1

కనులలో ఒక రూపే కదలాడే చూడూ
మనసు ఒక మాటే మరిపించె నేడూ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కనులలో ఒక రూపే కదలాడే చూడూ
మనసు ఒక మాటే మరిపించె నేడూ
విరుయు విరిబాలలో..ప్రణయ చిరుగాలిలో
మరియు మదిలోతులో..ఒకే అనురాగమే
విరుయు విరిబాలలో..ప్రణయ చిరుగాలిలో
మరియు మదిలోతులో..ఒకే అనురాగమే

ఒకే రాగం ఒకే తాళం..ఒకే గీతం పాడేనమ్మా

చరణం::2

నాడు నెలరాజు వలె..వచ్చినాడు
నేడు నారాజే..నను పంపినాడు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నాడు నెలరాజు వలె..వచ్చినాడు
నేడు నారాజే..నను పంపినాడు
తలపు పులకించెనే..వలపు బులిపించెనే
కలలు ఫలియించెనే..ఇదే ఆనందమే
తలపు పులకించెనే..వలపు బులిపించెనే
కలలు ఫలియించెనే..ఇదే ఆనందమే

ఒకే రాగం ఒకే తాళం..ఒకే గీతం పాడేనమ్మా
ఒకే రాగం ఒకే తాళం..ఒకే గీతం పాడేనమ్మా

Intiki Deepam Illaale--1961--1961
Music::M.S.Viswanaathan
Lyrics::Achaarya - Atreya
Singer::P.Suseela
Film Directed By::T.R.Ramanna
తారాగణం::N.T.RamaRao,Jaggayya,Jamuna,B.Sarojadevi,Nagayya,Kannamba,Relangi,Girija,Ramanareddi,E.V.Saroja,K.Malati. 

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

okE raagam okE taaLam..
okE raagam okE taaLam..okE geetam paaDEnammaa
okE raagam okE taaLam..okE geetam paaDEnammaa

::::1

kanulalO oka roopE kadalaaDE chooDuu
manasu oka maaTE maripinche nEDuu
aa aa aa aa aa aa aa aa aa aa
kanulalO oka roopE kadalaaDE chooDuu
manasu oka maaTE maripinche nEDuu
viruyu viribaalalO..praNaya chirugaalilO
mariyu madilOtulO..okE anuraagamE
viruyu viribaalalO..praNaya chirugaalilO
mariyu madilOtulO..okE anuraagamE

okE raagam okE taaLam..okE geetam paaDEnammaa

::::2

naaDu nelaraaju vale..vachchinaaDu
nEDu naaraajE..nanu pampinaaDu
aa aa aa aa aa aa aa aa aa aa
naaDu nelaraaju vale..vachchinaaDu
nEDu naaraajE..nanu pampinaaDu
talapu pulakinchenE..valapu bulipinchenE
kalalu phaliyinchenE..idE AnandamE
talapu pulakinchenE..valapu bulipinchenE
kalalu phaliyinchenE..idE AnandamE

okE raagam okE taaLam..okE geetam paaDEnammaa

okE raagam okE taaLam..okE geetam paaDEnammaa

Friday, October 04, 2013

పునర్జన్మ--1963
సంగీతం::T.చలపతిరావు
రచన::శ్రీశ్రీ
గానం::P.సుశీల
Film Directed By::Kotayya Pratyagatma 
తారాగణం::అక్కినేని,కృష్ణకుమారి,వాసంతి,గుమ్మడి,పద్మనాభం,ప్రభాకర్ రెడ్డి,సూర్యకాంతం,రమణరెడ్డి.

పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..ఆఆ..
ఓఓఓఓఓ..ఆఆఅ 
ఆఆఆఆఆఆఆఆఆఅ 

దీపాలు వెలిగె..పరదాలు తొలిగె
దీపాలు వెలిగె..పరదాలు తొలిగె
ప్రియురాలు పిలిచె రావోయీ
ప్రియురాలు పిలిచె రావోయీ

దీపాలు వెలిగె..పరదాలు తొలిగె
ప్రియురాలు పిలిచె రావోయీ
ప్రియురాలు పిలిచె రావోయీ

చరణం::1

నా వయసు నీది..నీ వలపు నాది
నా వయసు నీది..నీ వలపు నాది
మన మనసులు కలసిన వోయీ
నీ అడుగు జాడ..నా పూల మేడ
నీ అడుగు జాడ..నా పూల మేడ
మన మిరువుర మొకటే లేవోయీ

దీపాలు వెలిగె..పరదాలు తొలిగె
ప్రియురాలు పిలిచె రావోయీ

చరణం::2

నా తోడు నీవు..నీ నీడ నేను
నా తోడు నీవు..నీ నీడ నేను
మన యిరువురిదే యీ రేయీ
యిక జాగుసేయ తగదోయి నీకు
యిక జాగుసేయ తగదోయి నీకు
నా చల్లని రాజా రావోయీ

దీపాలు వెలిగె..పరదాలు తొలిగె
దీపాలు వెలిగె..పరదాలు తొలిగె

Punarjanma--1963
Music::T.Chalapati Rao
Lyrics::Sree Sree
Singer's::P.Suseela
Film Directed By::Kotayya Pratyagatma
Cast::A.N.R.Krishnakumaari,GummaDu,Prabhaakar Reddi,Vaasanti,

Padmanaabham,Sooryakaantam,Ramanareddi.

:::::::::::::::::::::::

mmmmm..aaaa..oooooo..aaaaa 
aaaaaaaaaaaaaaaaaaa 

deepaalu velige..paradaalu tolige
deepaalu velige..paradaalu tolige
priyuraalu piliche raavoyee
priyuraalu piliche raavoyee

deepaalu velige..paradaalu tolige
priyuraalu piliche raavoyee
priyuraalu piliche raavoyee

::::1

naa vayasu needi..nee valapu naadi
naa vayasu needi..nee valapu naadi
mana manasulu kalasina voyee
nee adugu jaada..naa poola meda
nee adugu jaada..naa poola meda
mana miruvura mokate levoyee

deepaalu velige..paradaalu tolige
priyuraalu piliche raavoyee

::::2

naa todu neevu..nee needa nenu
naa todu neevu..nee needa nenu
mana yiruvuride yee reyee
ika jaaguseya tagadoyi neeku
ika jaaguseya tagadoyi neeku
naa challani raajaa raavoyee

deepaalu velige..paradaalu tolige
deepaalu velige..paradaalu tolige

Thursday, October 03, 2013

ప్రేమనగర్--1971::యదుకుల కాంభోజి::రాగం


సంగీతం::K.V. మహాదేవన్ 
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల

రాగం::యదుకుల కాంభోజి::
(పహడి)

పల్లవి::

తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా
ఏరులా సేలయేరులా కలకల గలగల
కదలి వచ్చింది కన్నె అప్సర
వచ్చి నిలిచింది కనులముందర
తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా
ఏరులా సేలయేరులా కలకల గలగల
కదలి వచ్చింది కన్నె అప్సర
వచ్చి నిలిచింది కనులముందర
తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా

చరణం::1

తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కోప్పులోని ముద్దబంతి పువ్వులా
తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కోప్పులోని ముద్దబంతి పువ్వులా
గోదారి కెరటాల గీతాలవలే నాలో పలికినది పలికినది పలికినది
చల్లగా చిరుజల్లుగా జలజల గలగల
కదలి వచ్చింది కన్నె అప్సర
వచ్చి నిలిచింది కనులముందర

తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా

చరణం::2

రెక్కలోచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
రెక్కలోచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
లోలోన నాలోన ఎన్నెనో రూపాలు వెలసినవి వెలసినవి వెలసినవి 
వీణలా నెరజాణల కలకల గలగల
కదలి వచ్చింది కన్నె అప్సర
వచ్చి నిలిచింది కనులముందర

తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా

ప్రేమనగర్--1971
సంగీతం::K.V. మహాదేవన్ 
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల

పల్లవి

తాగితే మరిచిపొగలను తాగనివ్వరు 
మరిచిపోతే తాగగలను మరువనివ్వరు 
మనసుగతి ఇంతే మనిషి బ్రతుకింతే 
మనసున్న మనిషికీ సుఖము లేదంతే 
మనసుగతి ఇంతే మనిషి బ్రతుకింతే 
మనసున్న మనిషికీ సుఖము లేదంతే 
మనసుగతి ఇంతే

చరణం::1

ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచి పోదు 
ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచి పోదు 
గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకు పడదు
మనసుగతి ఇంతే మనిషి బ్రతుకింతే 
మనసున్న మనిషికీ సుఖము లేదంతే 
మనసుగతి ఇంతే

చరణం::2

అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయెనని తెలుసు 
అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయెనని తెలుసు 
తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు
మనసుగతి ఇంతే మనిషి బ్రతుకింతే 
మనసున్న మనిషికీ సుఖము లేదంతే 
మనసుగతి ఇంతే

చరణం::3

మరు జన్మ వున్నదో లేదొ ఈ మమతలప్పుడేమౌతాయొ 
మరు జన్మ వున్నదో లేదొ ఈ మమతలప్పుడేమౌతాయొ 
మనిషికి మనసే తీరని శిక్షా దేవుడిలా తీర్చుకున్నడు కక్షా 
మనసుగతి ఇంతే మనిషి బ్రతుకింతే 
మనసున్న మనిషికీ సుఖము లేదంతే 
మనసుగతి ఇంతే

ప్రేమనగర్--1971::పటదీప్::రాగ

సంగీతం::K.V. మహాదేవన్ 
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల

పటదీప్::రాగ 

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ .....
ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి 
నీ తీగలు సవరించాలి 
నీలో రాగం పలికించాలి 
ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి 
నీ తీగలు సవరించాలి 
నీలో రాగం పలికించాలి ఎవరో రావాలి

చరణం::1

మూల దాగి ధూళి మూగి మూగవోయిన మధురవీణ 
మూల దాగి ధూళి మూగి మూగవోయిన మధురవీణ 
మరిచి పోయిన మమతలాగా..మరిచి పోయిన మమతలాగా 
మమతలుడికిన మనసు లాగా మాసిపోతగునా ఎవరో రావాలి 

చరణం::2

ఎన్ని పదములు నేర్చినావో ఎన్ని కళలను దాచినావో 
ఎన్ని పదములు నేర్చినావో ఎన్ని కళలను దాచినావో 
కొనగోట మీటిన చాలు
కొనగోట మీటిన చాలు నీలో కోటిస్వరములు పలుకును 
ఏవరో రావాలి

చరణం::3

రాచనగరున వెలసినావు రస పిపాసకు నోచినావు 
రాచనగరున వెలసినావు రస పిపాసకు నోచినావు 
శక్తి మరచి రక్తి విడచి
శక్తి మరచి రక్తి విడచి మత్తు ఎదో మరగినావు మరచిపోతగునా

ఏవరో రావాలి నీ హృదయం కదిలించాలి 
నీ తీగలు సవరించాలి 
నీలో రాగం పలికించాలి ఎవరో రావాలి