Monday, February 08, 2016

భోగి మంటలు--1981

సంగీతం::రమేష్ నాయుడు
రచన::ఆచార్య- ఆత్రేయ
గానం::S.P.బాలు,వాణీ జయరామ్,బృందం 
Film Directed By::Vijayanirmala
తారాగణం::కృష్ణ,కాంతారావు.సుధాకర్,గుమ్మడి,కైకాల సత్యనారాయణ,అల్లురామలింగయ్య,గిరిబాబు,నూతన్‌ప్రసాద్,కృష్ణకుమారి,రతి,గీత,అంజలిదేవి,జయమాలిని,జ్యోతిలక్ష్మీ,హెలన్.

పల్లవి::

అరవైలో ఇరవై..వచ్చింది
మా అమ్మానాన్నకు మళ్ళీ..ఒక వసంతమొచ్చింది
అరవైలో ఇరవై..వచ్చింది 
మా అమ్మానాన్నకు మళ్ళీ..ఒక వసంతమొచ్చింది
అరవైలో ఇరవై..వచ్చింది 

మా అత్తామామకు మళ్ళీ..ఒక వసంతమొచ్చింది
అరవైలో ఇరవై..వచ్చింది 
మా అత్తామామకు మళ్ళీ..ఒక వసంతమొచ్చింది

చరణం::1

పెళ్ళికూతురుగ చేస్తుంటే..మళ్ళీ అప్పటి సిగ్గొచ్చింది
పెళ్ళికూతురుగ చేస్తుంటే..మళ్ళీ అప్పటి సిగ్గొచ్చింది
పెళ్ళి కాని ఈనాటి పిల్లలకు..ఆడతనం నేర్పింది 
పెళ్ళి కాని ఈనాటి పిల్లలకు..ఆడతనం నేర్పింది
నెరిసీనెరవని మీసాల్లో మెరిసే..ముసిముసినవ్వులలో
నెరిసీనెరవని మీసాల్లో మెరిసే..ముసిముసినవ్వులలో
పెళ్ళికొడుకు..ఎంత అల్లరివాడో 
పెళ్ళికొడుకు ఎంత అల్లరివాడో..ఇప్పుడే మాకు తెలిసింది
పెళ్ళికొడుకు ఎంత అల్లరివాడో..ఇప్పుడే మాకు తెలిసింది

అరవైలో ఇరవై..వచ్చింది 
మా అమ్మానాన్నకు మళ్ళీ..ఒక వసంతమొచ్చింది

అరవైలో ఇరవై..వచ్చింది 
మా అత్తామామకు మళ్ళీ..ఒక వసంతమొచ్చింది

చరణం::2

మనసులు మమతలు..మారని వాళ్ళే దేవుళ్ళు
మనసులు మమతలు..మారని వాళ్ళే దేవుళ్ళు
మనకగపడుతున్న దేవుళ్ళే..అమ్మా నాన్నలూ
ఆ దేవుళ్ళకు చేసే పెళ్ళే..మనకూ దీవెనలూ 
ఆ దేవుళ్ళకు చేసే పెళ్ళే..మనకూ దీవెనలూ 
ఆ దీవెనలే మన కోరికలైతే వీళ్లకు నూరేళ్లు..వీళ్లకు నూరేళ్లు

అరవైలో ఇరవై..వచ్చింది
మా అత్తామామకు మళ్ళీ..ఒక వసంతమొచ్చింది

అరవైలో ఇరవై..వచ్చింది
మా అమ్మానాన్నకు..మళ్ళీ ఒక వసంతమొచ్చింది

చరణం::3

ఆనాటి శ్రీరఘురాముడే..ఈనాటి పట్టాభిరాముడు
జనకుడు లేని కల్యాణాన్నే..కొడుకులు కలిసి చేస్తున్నారు
చక్కగ గంధం అలగండి..చల్లని పన్నీరు చిలకండి
చక్కగ గంధం అలగండి..చల్లని పన్నీరు చిలకండి
తాళిని కట్టే వేళయ్యింది..గట్టి మేళం మ్రోగించండి
గట్టి మేళం...మ్రోగించండి
సీతామ్మ పెళ్లికూతురాయనే..మన రామయ్య పెళ్ళికొడుకాయనే
సీతామ్మ పెళ్లికూతురాయనే..మన రామయ్య పెళ్ళికొడుకాయనే

Bhogimantalu--1981
Music::RameshNaayudu
Lyrics::Achaarya-Atreya
Singer's::S.P.Baalu,Vanijayaraam
Film Directed By::Vijayanirmala
Cast::Krishna,KaantaaRao,Kaikaala Satyanaaraayana,Sudhaakar,GummaDi,Giribaabu,NootanPrasad,Alluraamalingayya,Rati,Geeta,Anjalidevi,Jayamaalini,Jyotilakshmii,Helan.

:::::::::::::::::::::::::::::::::::::::::

aravailO iravai..vachchindi
maa ammaanaannaku maLLii..oka vasantamochchindi
aravailO iravai..vachchindi 
maa ammaanaannaku maLLii..oka vasantamochchindi
aravailO iravai..vachchindi 

maa attaamaamaku maLLii..oka vasantamochchindi
aravailO iravai..vachchindi 
maa attaamaamaku maLLii..oka vasantamochchindi

::::1

peLLikooturuga chEstunTE..maLLii appaTi siggochchindi
peLLikooturuga chEstunTE..maLLii appaTi siggochchindi
peLLi kaani iinaaTi pillalaku..aaDatanam nErpindi 
peLLi kaani iinaaTi pillalaku..aaDatanam nErpindi
neriseeneravani meesaallO merisE..musimusinavvulalO
neriseeneravani meesaallO merisE..musimusinavvulalO
peLLikoDuku..enta allarivaaDO 
peLLikoDuku enta allarivaaDO..ippuDE maaku telisindi
peLLikoDuku enta allarivaaDO..ippuDE maaku telisindi

aravailO iravai..vachchindi 
maa ammaanaannaku maLLii..oka vasantamochchindi

aravailO iravai..vachchindi 
maa attaamaamaku maLLii..oka vasantamochchindi

::::2

manasulu mamatalu..maarani vaaLLE dEvuLLu
manasulu mamatalu..maarani vaaLLE dEvuLLu
manakagapaDutunna dEvuLLE..ammaa naannaluu
aa dEvuLLaku chEsE peLLE..manakoo deevenaluu 
aa dEvuLLaku chEsE peLLE..manakoo deevenaluu 
aa deevenalE mana kOrikalaitE veeLLaku noorELLu..veeLLaku noorELLu

aravailO iravai..vachchindi
maa attaamaamaku maLLii..oka vasantamochchindi

aravailO iravai..vachchindi
maa ammaanaannaku..maLLii oka vasantamochchindi

::::3

aanaaTi SreeraghuraamuDE..iinaaTi paTTaabhiraamuDu
janakuDu lEni kalyaaNaannE..koDukulu kalisi chEstunnaaru
chakkaga gandham alaganDi..challani panneeru chilakanDi
chakkaga gandham alaganDi..challani panneeru chilakanDi
taaLini kaTTE vELayyindi..gaTTi mELam mrOginchanDi
gaTTi mELam...mrOginchanDi
seetaamma peLlikooturaayanE..mana raamayya peLLikoDukaayanE
seetaamma peLlikooturaayanE..mana raamayya peLLikoDukaayanE