భైరవద్వీపం--1994 సంగీతం::మాధవపెద్ది సురేష్ రచన::వేటూరి సుందర రామమూర్తి గానం::S.జానకి పల్లవి:: నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక చరణం::1 రా దొరా ఒడి వలపుల చెరసాలర లే వరా ఇవి దొరకని సరసాలురా దోర దొంగ సోకులేవి దోచుకో సఖా రుతువే వసంతమై పువ్వులు విసరగా ఎదలే పెదవులై సుధలే కొసరగా ఇంత పంతమేల బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక చరణం::2 నా గిలి నిను అడిగెను తొలి కౌగిలి నీ కసి స్వరమెరుగని ఒక జావళి లేత లేత వన్నెలన్నీ వె న్నెలేనయా రగిలే వయసులో రసికత నాదిరా పగలే మనసులో మసకలు కమ్మెరా ఇంత బింకమేల బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక Bhairava Dweepam--1994 Music:;Madhava Peddi Suresh Lyricist::Veturi Singer's::S.Janaki :::: naruda o naruda yemi korika naruda o naruda yemi korika koruko kori cheruko cheri yeluko balaka koruko kori cheruko cheri yeluko balaka naruda o naruda yemi korika :::1 ra dora odi valapula cherasalara le vara ivi dorakani sarasalura dora dora sokulevi dochuko sakha rutuve vasantamai puvvulu visaraga yedale pedavulai sudhale kosaraga inta pantamela balaka naruda o naruda yemi korika koruko kori cheruko cheri yeluko balaka naruda o naruda yemi korika :::2 na gili ninu adigenu toli kougili nee kasi swaramerugani oka javali letha letha vannelanni vennelenaya ragile vayasulo rasikata nadira pagalae manasulo masakalu kammera inka binkamela balaka naruda o naruda yemi korika naruda o naruda yemi korika koruko kori cheruko cheri yeluko balaka koruko kori cheruko cheri yeluko balaka naruda o naruda yemi korika
సంగీతం::T.చలపతిరావు రచన::ఆత్రేయ గానం::ఘంటసాల తారాగణం::అక్కినేని, లక్ష్మి, నాగభూషణం, రాజబాబు,రమాప్రభ,శుభ పల్లవి:: ఒసే వయ్యరి రంగీ..నా మనసే కుంగీ పాడిందే కన్నీటి..పాట నా ఆశలారి..నా రాత మారి అయ్యిందే నా బతుకు..బొమ్మలాట చరణం::1 ఆ నాటి మా పెళ్ళీ..మేళాలే నేడు వినిపించే నాలోని..వేదనలు కన్నాను ఎన్నెన్నో..తీయని కలలు అవి కరిగి కురిసేను..కాన్నీళ్ళు మూణ్ణాళ్ళు చేశాను..కాపురము మూణ్ణాళ్ళు చేశాను..కాపురము మోశాను తీరని..అవమానము నా మనసు..నా మమత తెగదెంచి ఓ రంగమ్మా వెళ్ళిందే..యిల్లాలు వెళ్ళిపోయిందే..యిల్లాలు ఒసే వయ్యరి రంగీ..నా మనసే కుంగీ పాడిందే కన్నీటి..పాట నా ఆశలారి..నా రాత మారి అయ్యిందే నా బతుకు..బొమ్మలాట చరణం::2 నా కంటి వెలుగై..వచ్చినది నా యిల్లు చీకటి..చేసినది కట్టిన తాళినే..కాదన్నది తన కడుపున..నన్నే మోస్తున్నది ముగిసిందిలే ఒక..వూరేగింపూ ముగిసిందిలే ఒక..వూరేగింపూ ఇక మిగిలింది ఒక్కటే..తుది పిలుపూ నా యిల్లు..నా కళ్ళు..వెలివేసి ఓ రంగమ్మా వెళ్ళిందే..యిల్లాలు వెళ్ళిపోయిందే..యిల్లాలు ఒసే వయ్యరి రంగీ..నా మనసే కుంగీ పాడిందే కన్నీటి పాట నా ఆశలారి..నా రాత మారి అయ్యిందే నా బతుకు బొమ్మలాట