Wednesday, December 11, 2013

రాజా--1976




సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::శోభన్ బాబు,జయసుధ,జగ్గయ్య,అంజలీదేవి,కాంతారావు,జయమాలిని,
అల్లు రామలింగయ్య

పల్లవి::

కోటి జన్మల ఆనందం..శతకోటి జన్మల అనుబంధం
కోటి జన్మల ఆనందం..శతకోటి జన్మల అనుబంధం
నీవు నేనై వెలిశాము..నేడు మళ్ళీ కలిశాము 
రాజా..ఓ నా రాజా..రాజా..ఓ నా రాజా

కోటి జన్మల ఆనందం..శతకోటి జన్మల అనుబంధం
కోటి జన్మల ఆనందం..శతకోటి జన్మల అనుబంధం
నీవు నేనై మిగిలాము..నేడు మళ్ళీ కలిశాము
రాణీ..ఓ నా రాణీ..రాణీ..ఓ నా రాణీ

చరణం::1

నీ సుతిమెత్తని..ఒడిలో పవలిస్తాను
నీ నులివెచ్చని..ఊపిరిలో పులకిస్తాను
నీ సుతిమెత్తని..ఒడిలో పవలిస్తాను
నీ నులివెచ్చని..ఊపిరిలో పులకిస్తాను
నీ నునుపారని నొసట..నేను ముద్దవుతాను
నీ కనుపాపల..క్రీనీడా జీవిస్తాను
జీవితాన చీకటంతా..చెదిరిపోవాలి
చెదిరి పోనీ మమతలు..మనకు చెరలు కావాలి చెరలు కావాలి
రాజా..ఓ నా రాజా..రాజా..ఓ నా రాజా..ఆఆ 

చరణం::2

ఆనీ ఎద లోపలి.. దీపాన్నై నే ఉంటాను
నా కథ నడిపే..నాయకుడై నీవుంటావు
నీ ఎద లోపలి..దీపాన్నై నే ఉంటాను
నా కథ నడిపే..నాయకుడై నీవుంటావు
నా చిరకాలపు..కోరికవై నీ వుంటావు
నీ పరువానికి..పండుగనై నే ఉంటాను
మల్లెపూల మనసులనే..అల్లుకుందాము
ఎల్లలన్ని తుడిపివేసి ఏలుకుందాము..ఏలుకుందాము
రాణీ..ఓ నా రాణీ.రాణీ..ఓ నా రాణీ..ఈఈ 
కోటి జన్మల ఆనందం..శతకోటి జన్మల అనుబంధం
నీవు నేనై వెలిశాము..నేడు మళ్ళీ కలిశాము
రాణీ..ఓ నా రాణీ.రాణీ..ఓ నా రాణీ..ఈఈ 
రాజా..ఓ నా రాజా..రాజా..ఓ నా రాజా..ఆఆ

వింతకథ--1973


















సంగీతం::పుహళేంది 
రచన::D.C.నారాయణరెడ్డి   
గానం::S.P.బాలు,P.సుశీల    
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,గుమ్మడి,నల్ల రామూర్తి,సత్తిబాబు,లీలారాణి,ఝాన్సి,విజయలక్ష్మి

పల్లవి::
లలలలలలల..లలలలలలలలలా
లాలాలాలాలాలాలా..ఆ..లలల్లా..ఆ
ఎదురు చూసిన కాముని పున్నమి..ఈనాడేహో..ఈనాడే
ఎదలో పయ్యెదలో పదును కోరికలు పొరలాడే..పొరలాడే
హ్హా..ఎదురు చూసిన కాముని పున్నమి..ఈనాడే..హ్హా..ఈనాడే
ఎదలో పయ్యెదలో పదును..కోరికలు పొరలాడే..పొరలాడే
హ్హా..హా హా..ఎదురు చూసిన కాముని పున్నమి..ఈనాడే..హో..ఈనాడే

చరణం::2

హ్హా...హా హా హా..ఆఊఊఆ.. 
తడిసిన కురులే కోడెనాగులై..తనువుపైన పారాడెనులే
హా హా హా...పారాడెనులే
విరిసిన మరులే మెరుపుతీగలై..సరనరాలలో ఉరికెనులే
హ్హా హా హా..ఎదురు చూసిన కాముని పున్నమి..ఈనాడే..హో..ఓ..ఈనాడే

చరణం::2

పొంగే వయసు ఏ బందాలకు..లొంగిపోనని అంటున్నది..మ్మ్ మ్మ్..అంటున్నది  
ఇంద్రజాలమా..కాదు కాదు..ఇది చంద్రజాలమే..అనిపిస్తున్నది
చంద్రజాలమే...అనిపిస్తున్నది  
ఎదురు చూసిన కాముని పున్నమి..ఈనాడే..హో..ఈనాడే
ఎదలో పయ్యెదలో పదును..కోరికలు పొరలాడే పొరలాడే
హ్హా హా హా..ఎదురు చూసిన కాముని పున్నమి..ఈనాడే..హో..ఈనాడే

చరణం::3

మ్మ్ మ్మ్ ఉహూ ఆ ఆహా..లలా ఆహా హా లా హో
నా వూపిరి నీ వూపిరి అల్లుకుపోనీ..మ్మ్ హూ హూ..మ్మ్ హూ హూ
ఆ...పెదవీ ఈ పెదవీ అద్దుకుపోనీ..ఈఈ 
ఆ...పెదవీ ఈ పెదవీ అద్దుకుపోనీ..అద్దుకుపోనీ
కలవని అంచులు రెండూ కలుసుకోనీ..ఈఈ..కలుసుకోనీ
కలుసుకోనీ కలుసుకోనీ..తెలియని రుచులు ఈ క్షణమే
   
ఎదురు చూసిన కాముని పున్నమి..ఈనాడే..హో..ఈనాడే
ఎదలో పయ్యెదలో పదును..కోరికలు పొరలాడే పొరలాడే
ఆ హా..ఎదురు చూసిన కాముని పున్నమి..ఈనాడేఓ..ఈనాడే
ఎదలో పయ్యెదలో పదును..కోరికలు పొరలాడే పొరలాడే
ఆ హా..ఎదురు చూసిన కాముని పున్నమి..ఈనాడే..ఆ..ఈనాడే
లాలలలాలా లాలలలలా లాలలలా లాలలలాలలా

వింతకథ--1973


  
సంగీతం::పుహళేంది 
రచన::దేవులపల్లికృష్ణశాస్త్రి  
గానం::S.P.బాలు 
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,గుమ్మడి,నల్ల రామూర్తి,సత్తిబాబు,లీలారాణి,ఝాన్సి,విజయలక్ష్మి

పల్లవి::

ఆగు..రవంత ఆగు..ఓ మలుపుల ఒంపులవాగు 
కరిగించకు ఈ స్వప్నం..కదిలించకు నా స్వర్గం
కరిగించకు ఈ స్వప్నం..కదిలించకు నా స్వర్గం
అల మునికుమారివని అనుకోనీ..అనుకోనీ
ఒక వనమయూరివని...అనుకోనీ
కరిగించకు ఈ స్వప్నం..కదిలించకు నా స్వర్గం

చరణం::1

ఎరుగుదు నిను ఎప్పటినించో..ఎదురుచూతు ఏనాటినించో
ఎరుగుదు నిను ఎప్పటినించో..ఎదురుచూతు ఏనాటినించో
అలనాటి ఆశ్రమవాటిలో..నడయాడే కనె లేడివనీ
ఒక మావి బోదెపై ఒరిగి..ఊగాడే వన్నెలాడివనీ
పొదచాటున మెదలే తుమ్మెదలే..అటుపొంచి చూచి నీ కన్నులనీ    
అనుకోనీ..కరిగించకు ఈ స్వప్నం..కదిలించకు నా స్వర్గం

చరణం::2

కవిదేవుని మానస సరోవరం..కదిలించిన ఓ కలహంసీ
కవిదేవుని మానస సరోవరం..కదిలించిన ఓ కలహంసీ
దివిజమోహినీ అమృతవాహినీ..తెలుసు నాకు నీవెవరో
దివిజమోహినీ అమృతవాహినీ..తెలుసు నాకు నీవెవరో
ఏ తపసి మనసు భావించెనో..ఏ తరుణి సొగసు ప్రసవించెనో
ఏ తపసి మనసు భావించెనో - ఏ తరుణి సొగసు ప్రసవించెనో 
కరుణించిన కణ్వ తపోవనిలో..విరబూచిన వసంతలక్ష్మీవనీ
అనుకోనీ కరిగించకు ఈ స్వప్నం..కదిలించకు నా స్వర్గం
అల మునికుమారివని అనుకోనీ..అనుకోనీ
ఒక వనమయూరివని...అనుకోనీ
కరిగించకు ఈ స్వప్నం..కదిలించకు నా స్వర్గం