Saturday, February 28, 2015

దేవుడు మావయ్య--1981




సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామ్మూర్తి 
గానం::S.P.బాలు,P.సుశీల 
Film Directed By::K.Vaasu
తారాగణం::శోభన్‌బాబు,వాణిశ్రీ,విజయలలిత,పద్మనాభం,శ్రీధర్,చాయాదేవి.

పల్లవి::

హా..అందమంతా చీరగట్టి..పరువంతా పైట లేసి
అందమంతా చీరగట్టి..పరువంతా పైట లేసి
బిడియమంతా బొట్టు పెట్టి..బిడియమంతా బొట్టు పెట్టి
అటు తిరిగి నిలబడితే..ఏం తక్కువా
అటు కన్నా ఇటు వైపే..అందమెక్కువా
అటు తిరిగి నిలబడితే..ఏం తక్కువా
అటు కన్నా ఇటు వైపే..అందమెక్కువా 

ఆరుబైటా కన్నుగొట్టి..ఊరుబైటా కొంగు పట్టి
ఆరుబైటా కన్నుగొట్టి..ఊరుబైటా కొంగు పట్టి
అలకలెన్నో మొలకలెత్తి..అలకలెన్నో మొలకలెత్తి..
అటు తిరిగి నిలబడితే..అల్లరెక్కువ
ఎటు తిరిగి నిలబడ్డా..ఆకలెక్కువ
అటు తిరిగి నిలబడితే..అల్లరెక్కువ
ఎటు తిరిగి నిలబడ్డా..ఆకలెక్కువ

చరణం::1

ఆ కుర్రబుగ్గలో..ఎర్రగులాబి 
ఆ లేత పెదవిలో..తీపి జిలేబి
కోసుకోమంటున్నది..కోడెవయసు
తీసుకోమంటున్నదా..కన్నెమనసు

చెరువునడిగి కోసుకో..చేపనడిగి తీసుకో
చెరువునడిగి కోసుకో..చేపనడిగి తీసుకో
కలువపువ్వు తెమ్మంటే..తేనెవిందులిమ్మంటే
కాదంటానా..లేదంటానా..హా
కాదంటానా..హా..లేదంటానా 

అందమంతా చీరగట్టి..అహా
పరువంతా పైట లేసి..ఓహో 

చరణం::2 

ఆ పూత పొగరులో..కోటి స్వరాలు
అవి వింటే నాలో..కొంటె జ్వరాలు
ఆదుకోమంటున్నది..కన్నెపడుచు
చేదుకోమంటున్నదా..తీపి వయసు

చెట్టునడిగి కోసుకో..పిట్టనడిగి తీసుకో
చెట్టునడిగి కోసుకో..పిట్టనడిగి తీసుకో
కన్ను చెదిరిపోతుంటే..కన్ను చెదిరిపోతుంటే
కాదంటానా లేదంటానా..కాదంటానా లేదంటానా  

అందమంతా చీరగట్టి..పరువంతా పైట లేసి
బిడియమంతా బొట్టు పెట్టి..బిడియమంతా బొట్టు పెట్టి
అటు తిరిగి నిలబడితే..ఏం తక్కువా 
అటు కన్నా ఇటు వైపే..అందమెక్కువా
అటు తిరిగి నిలబడితే..ఏం తక్కువా 
అటు కన్నా ఇటు వైపే..అందమెక్కువా 

ఆరుబైటా కన్నుగొట్టి..ఊరుబైటా కొంగు పట్టి
ఆరుబైటా కన్నుగొట్టి..ఊరుబైటా కొంగు పట్టి
అలకలెన్నో మొలకలెత్తి..అలకలెన్నో మొలకలెత్తి..
అటు తిరిగి నిలబడితే..అల్లరెక్కువ
ఎటు తిరిగి నిలబడ్డా..ఆకలెక్కువ
అటు తిరిగి నిలబడితే..అల్లరెక్కువ
ఎటు తిరిగి నిలబడ్డా..ఆకలెక్కువ


Devudu Maavayya--1981
Music::chakravarti
Lyrics::Veeturisundararammoorti
Singer::S.P.Baalu,P.Suseela
Film Directed By::K.Vaasu
Cast::Sobhanbabu,Vanisree,Vijayalalita,Padmanaabham,Sriidhar,Chaayaadevi.

::::::::::::::::::::::::::::::::::::::::::::::::

haa..andamantaa cheeragaTTi..paruvantaa paiTa lEsi
andamantaa cheeragaTTi..paruvantaa paiTa lEsi
biDiyamantaa boTTu peTTi..biDiyamantaa boTTu peTTi
aTu tirigi nilabaDitE..aem takkuvaa
aTu kannaa iTu vaipE..andamekkuvaa
aTu tirigi nilabaDitE..aem takkuvaa
aTu kannaa iTu vaipE..andamekkuvaa 

aarubaiTaa kannugoTTi..UrubaiTaa kongu paTTi
aarubaiTaa kannugoTTi..UrubaiTaa kongu paTTi
alakalennO molakaletti..alakalennO molakaletti
aTu tirigi nilabaDitE..allarekkuva
eTu tirigi nilabaDDaa..aakalekkuva
aTu tirigi nilabaDitE..allarekkuva
eTu tirigi nilabaDDaa..aakalekkuva

::::1

A kurrabuggalO..erragulaabi 
A lEta pedavilO..teepi jilEbi
kOsukOmanTunnadi..kODevayasu
teesukOmanTunnadaa..kannemanasu

cheruvunaDigi kOsukO..chEpanaDigi teesukO
cheruvunaDigi kOsukO..chEpanaDigi teesukO
kaluvapuvvu temmanTE..tEnevindulimmanTE
kaadanTaanaa..lEdanTaanaa..haa
kaadanTaanaa..haa..lEdanTaanaa 

ndamantaa cheeragaTTi..ahaa
paruvantaa paiTa lEsi..OhO 

::::2 

A poota pogarulO..kOTi swaraalu
avi vinTE naalO..konTe jwaraalu
aadukOmanTunnadi..kannepaDuchu
chEdukOmanTunnadaa..teepi vayasu

cheTTunaDigi kOsukO..piTTanaDigi teesukO
cheTTunaDigi kOsukO..piTTanaDigi teesukO
kannu chediripOtunTE..kannu chediripOtunTE
kaadanTaanaa lEdanTaanaa..kaadanTaanaa lEdanTaanaa  

andamantaa cheeragaTTi..paruvantaa paiTa lEsi
biDiyamantaa boTTu peTTi..biDiyamantaa boTTu peTTi
aTu tirigi nilabaDitE..Em takkuvaa 
aTu kannaa iTu vaipE..andamekkuvaa
aTu tirigi nilabaDitE..Em takkuvaa 
aTu kannaa iTu vaipE..andamekkuvaa 

ArubaiTaa kannugoTTi..UrubaiTaa kongu paTTi
ArubaiTaa kannugoTTi..UrubaiTaa kongu paTTi
alakalennO molakaletti..alakalennO molakaletti..
aTu tirigi nilabaDitE..allarekkuva
eTu tirigi nilabaDDaa..aakalekkuva
aTu tirigi nilabaDitE..allarekkuva
eTu tirigi nilabaDDaa..aakalekkuva

చిన్ననాటి కలలు--1975




సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.P.బాలు,S.జానకి
Film Directed By::T.Lelin Babu
తారాగణం::కృష్ణంరాజు,జయంతి,ప్రమీల,అల్లు రామలింగయ్య,రమాప్రభ,రావుగోపాలరావు, 
K.V. చలం

పల్లవి::

ఓ చెలి ఒహో చెలి..ఓ చల్లని నవ్వుల జాబిలీ
ఎ మబ్బులలో దాగున్నావో..నీవెందుకు కనరావో

ఎదురుగా నీ ఎదురుగా..నీ మదిలోనే కుదురుగా
ఉన్నాను నేనున్నాను..నీ పిలుపే విన్నాను

చరణం::1

మనసులోని కోరికలన్నీ..పంచుకొంటినే
మరువలేక నిన్నే నాలో..నిలుపుకొంటినే
చీకటి నిండిన జీవితమంత..నీవే వెలుగై నిలవాలి

మనసులోని మనసును నేనై..నిలిచి ఉంటిని
దాగిఉన్న నీ వలపులనే..గెలుచు కొంటిని 
జాబిలి వెలుగు సుర్యునిదేలే..నాలో అందం నీదేలే

ఎదురుగా నీ ఎదురుగా..నీ మదిలోనే కుదురుగా
ఉన్నాను నే ఉన్నాను..నీ పిలుపే విన్నాను

చరణం::2

ఎన్ని ఎన్ని జన్మలనుండో..కలలు కంటిని
ఈనాటికైనా నిన్నే..కోరుకొంటిని
ఎన్నటికైనా నాతో చేరి..వలపులు నాలో నింపాలి

చిన్న నాటి నా కలలన్నీ నిజములాయలే
నిన్ను చూసి ఆనందంతో మనసు నిండెలే
నీవు నేను జీవితమంతా వీడని జతగా ఉండాలి

ఓ చెలి ఒహో చెలి..ఓ చల్లని నవ్వుల జాబిలీ
ఎ మబ్బులలో దాగున్నావో..నీవెందుకు కనరావో

ఎదురుగా నీ ఎదురుగా..నీ మదిలోనే కుదురుగా
ఉన్నాను నేనున్నాను..నీ పిలుపే విన్నాను

ChinnaNaati Kalalu
Music::T.ChalapatiRao
Lyrics::D.C.Narayanareddi
Singer's::S.P.Baalu,S.Janaki
Film Directed By::T.Lelin Babu
Cast::Krishnamraju,Jayanti,Prameela,Alluramalingayya,RamaaprabhaRavugopalRao,K.V.Chalam.

::::::::::::

O cheli ohO cheli..O challani navvula jaabilee
e mabbulalO daagunnaavO..neevenduku kanaraavO

edurugaa nee edurugaa..nee madilOnE kudurugaa
unnaanu nEnunnaanu..nee pilupE vinnaanu

::::1

manasulOni kOrikalannee..panchukonTinE
maruvalEka ninnE naalO..nilupukonTinE
cheekaTi ninDina jeevitamanta..neevE velugai nilavaali

manasulOni manasunu nEnai..nilichi unTini
daagiunna nee valapulanE..geluchu konTini 
jaabili velugu suryunidElE..naalO andam needElE

edurugaa nee edurugaa..nee madilOnE kudurugaa
unnaanu nE unnaanu..nee pilupE vinnaanu

::::2

enni enni janmalanunDO..kalalu kanTini
eenaaTikainaa ninnE..kOrukonTini
ennaTikainaa naatO chEri..valapulu naalO nimpaali

chinna naaTi naa kalalannii nijamulaayalE
ninnu chUsi AnandamtO manasu ninDelE
neevu nEnu jeevitamantaa veeDani jatagaa unDaali

O cheli ohO cheli..O challani navvula jaabilee
e mabbulalO daagunnaavO..neevenduku kanaraavO

edurugaa nee edurugaa..nee madilOnE kudurugaa
unnaanu nEnunnaanu..nee pilupE vinnaanu

నీడలేని ఆడది--1974










http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8033
సంగీతం::సత్యం 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి,S.P.బాలు
తారాగణం::నరసింహరాజు,సుధీర్,వరప్రసాద్,ప్రభ,ఉమాదేవి,కల్పన,సీతాలత. 

పల్లవి::

తెరసాప నీడలోన..ఆ..మునిమాపు యేళలోన..ఆ 
యెలుగు నీడల్లాగా..ఆ..యేకమై పోదామా యేకమై పోదామా
యేకమై పోదామా

హోయ్..చక్కనైన చిన్నోడా..పక్కనున్న నావోడా 
కోరినవన్నీ కాదనకుండా యిస్తావా మరి..చేరుకుంటే నీరుగారి పోతావా

చేేప కళ్ళ చినదానా..చింతపువ్వు వన్నెదానా
కోరినవన్నీ కాదనకుండా యిస్తానే అవి..మళ్ళీ మళ్ళీ కోరకుండా చూస్తానే 
  
ఆహుం..హేయ్..ఆహుం..హేయ్..ఆహుం..హేయ్..ఆహుం..హేయ్ 

    
చరణం::1


కదిలే గాలిలోన..నే కరిగే మబ్బునౌతా  
ఆ కరిగే మబ్బుపైన..ఎగిరెగిరే గువ్వనౌతా                
ఎగిరే గువ్వవు..నువ్వైతే..తరిమే డేగ నేనౌతా
నారెక్కల్లోన నిన్ను..వెచ్చగ దాచేస్తా హోయ్
రెతిరి పగలూ..నీ మనసంతా కాజేస్తా 
హోయ్..చేేప కళ్ళ చినదానా..చింతపువ్వు వన్నెదానా
కోరినవన్నీ కాదనకుండా..యిస్తానే 
అవి మళ్ళీ మళ్ళీ కోరకుండా..చూస్తానే  

చరణం::2

ఒయ్యహో..ఒయ్యహో..ఆ..ఒయ్యహో..ఒయ్యహో
పారే యేటిలోన..పొంగారే పాయనౌతా 
ఆ ఏటి పాయలోన..ఎదురీదే చేపనౌతా 
ఈదే చేపవు.. నువ్వైతే...ఐతే  
ఈదే చేపవు నువ్వైతే గాలాన్ని నేనౌతా 
నీ గుండెల్లోకి గురిచూసి..లాగేస్తా  
నీ అందాలన్నీ వడబోసీ..తాగేస్తా 
హొయ్..చక్కనైన చిన్నోడా..పక్కనున్న నావోడా 
కోరినవన్నీ కాదనకుండా..యిస్తావా
నువు కోరినవన్నీ..కాదనకుండా ఇస్తానే