సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.P.శైలజ
తన్ననన్న తన్ననన్న న తన్ననన్న తన్ననన్న న
తన్ననన్న తన్ననన్న తన్ననన్న
చమకు చమకు జింజిన్న చమకు చమకు జిన్నజిన్నజిన్న
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి
చమకు చమకు జింజిన్న చమకు చమకు జిన్నజిన్నజిన్న
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి
విశ్వనాథ పలుకై అది విరులతేనె చిలుకై
కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
పచ్చని చేల తన్ననన్న పావడ కట్టి తన్ననన్న
పచ్చని చేల పావడ కట్టి కొండమల్లెలే కొప్పున పెట్టి
వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి
ఎండల కన్నె సోకని రాణి
పల్లెకు రాణి పల్లవపాణి
కోటను విడిచి పేటను విడిచి
కోటను విడిచి పేటను విడిచి
కలలా గంగ పొంగేవేళ నదిలా తానే సాగేవేళ
రాగాల రాదారి గోదారి అవుతుంటే
ఆ రాగాల రాదారి గోదారి అవుతుంటే
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి
మాగాణమ్మ చీరలునేసె మలిసందెమ్మ కుంకుమపూసె
మువ్వలబొమ్మ ముద్దులగుమ్మ
మువ్వలబొమ్మ ముద్దులగుమ్మ
గడపదాటి నడిచే వేళ
అదుపే విడిచి ఎగిరే వేళ
వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే
ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి
విశ్వనాథ పలుకై అది విరులతేనె చిలుకై
కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
పచ్చని చేల తన్ననన్న పావడ కట్టి తన్ననన్న
హొయ్ పచ్చని చేల పావడ కట్టి కొండమల్లెలే కొప్పున పెట్టి
వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి