సంగీతం::T.చలపతి
రచన::డా.సినారె
గానం::S.జానకి,M.రమేష్
ఒంటరిగా ఉన్నామూ..మనమిద్దరమే..వున్నామూ
ఉలకవెందుకు..పలకవెందుకు..
బిడియమెందుకు వలపు విందుకు..
కలసి పోదాము రారా..
ఒంటరిగా ..హ్హా..హ్హా..ఉన్నామూ
మనమిద్దరమే..హ్హే..హ్హే..వున్నామూ..
ఎవరికంటపడినా..ఏమనుకొంటారూ..
పడుచువాళ్ళ సరదా..పోనీ అంటారూ..2
ఏదో గుబులు..ఎందుకు దిగులు..2
ఎగిరిపోదాము రారా..
ఒంటరిగా ..హ్హా..హ్హా..ఉన్నామూ
మనమిద్దరమే..హ్హే..హ్హే..వున్నామూ..
గువ్వజంట ఏదో..గుసగుసలాడిందీ
వలపు ఓ న మాలూ..దిద్దుకోమన్నదీ..2
ఇపుడేవద్దు..ఒకటేముద్దు..2
రేపుచూద్దాము రా..రా..
ఒంటరిగా ..హ్హా..హ్హా..ఉన్నామూ
మనమిద్దరమే..హ్హే..హ్హే..వున్నామూ..
ఇంతమంచి సమయం..ఎపుడు దొరుకుతుందీ
మూడుముళ్ళుపడనీ..ప్రతిరోజు దొరుకుతుందీ..2
అప్పటి వరకు అల్లరివయసు..2
ఆగనంటుంది రా..రా..
ఒంటరిగా ..హ్హా..హ్హా..ఉన్నామూ
మనమిద్దరమే..హ్హే..హ్హే..వున్నామూ..
ఉలకవెందుకు..పలకవెందుకు..
బిడియమెందుకు వలపు విందుకు..
కలసి పోదాము రారా..
ఒంటరిగా ..హ్హా..హ్హా..ఉన్నామూ
మనమిద్దరమే..హ్హే..హ్హే..వున్నామూ..