సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::శోభన్ బాబు,జయచిత్ర,జయసుధ,అంజలీదేవి,రమాప్రభ,సత్యనారాయణ, రాజబాబు,నగేష్
పల్లవి::
సోగ్గాడు లేచాడు చూచి చూచి
నీ దుమ్ము లేపుతాడు..అహ
సోగ్గాడు లేచాడు చూచి చూచి
నీ దుమ్ము లేపుతాడు
పట్టణాని కొచ్చాడు పల్లెటూరి సోగ్గాడు
బిక్కమొహం వేశాడు
బొక్క బోర్ల పడ్డాడు..డు డు డు డు
సోగ్గాడు..అహ..లేచాడు..యహై
చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు
చరణం::1
మీసాలు దువ్వుతాడు మీది మీది కొస్తాడు
మిడిగుడ్లు వేసుకుని చూస్తాడు పిచ్చోడు
గరిడిసాము చేసినోడు బిరుసైన కండలోడు
కర్రెత్తినాడంటే ఆగబోడు తిక్కోడు
మీసాలు దువ్వుతాడు మీది మీది కొస్తాడు
మిడిగుడ్లు వేసుకుని చూస్తాడు పిచ్చోడు
గరిడిసాము చేసినోడు బిరుసైన కండలోడు
కర్రెత్తినాడంటే ఆగబోడు తిక్కోడు
లేస్తేనే కుంటోడు మొనగాడు..ఏహేయ్
లేస్తేనే..కుంటోడు మొనగాడు
పడుకున్న ఏనుగైనా గుర్రమెత్తె అంటాడు..డు డు డు డు
సోగ్గాడు..అహ..లేచాడు చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు
చరణం::2
కోక మడత చూశాడు రెవిక ముడిని చూశాడు
కొంగుపట్టి పగలంతా గుంజాడు వెర్రోడు
కోక మడత చూశాడు రెవిక ముడిని చూశాడు
కొంగుపట్టి పగలంతా గుంజాడు వెర్రోడు
కోక డాబు తెలిసినోడు రవిక సోకు ఎరిగినోడు
కోక డాబు తెలిసినోడు రవిక సోకు ఎరిగినోడు
ఆకలేస్తే ఎండుగడ్డి తినబోడు గడుసోడు
మరి గడ్డివాము చాటుకేల పిలిచాడు
మరి గడ్డివాము చాటుకేల పిలిచాడు
నీకింత గడ్డెట్టి గాటిలో కడతాడు..డు డు డు డు
సోగ్గాడు..అహ..లేచాడు..అరెరెరె
చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు
చరణం::3
మంచి గుంటావన్నాడు మాపు రమ్మన్నాడు
తెల్లార్లు జాగారమన్నాడు పిల్లోడు
ఇట్టాగే ప్రతి ఏడు ఎందర్నో పిలుస్తాడు
బాగోతం ఆడించి చూస్తాడోయ్ సోగ్గాడు
మంచి గుంటావన్నాడు మాపు రమ్మన్నాడు
తెల్లార్లు జాగారమన్నాడు పిల్లోడు
ఇట్టాగే ప్రతి ఏడు ఎందర్నో పిలుస్తాడు
బాగోతం ఆడించి చూస్తాడోయ్ సోగ్గాడు
నువ్వు సత్తెభామవని పొగిడాడు..అబ్బా
నువ్వు సత్తెభామవని..పొగిడాడు
ఈ జన్మ రాముడు పై జన్మే కిష్ణుడు..డు డు డు డు
సోగ్గాడు..అహ..లేచాడు..అరెరెరె
చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు
సోగ్గాడు..అహహ..లేచాడు..అహహహ
చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు