Wednesday, July 04, 2007

మీన--1970-- రాగం:ఖామాస్
















!! రాగం:ఖామాస్ !!

సంగీతం: రమేష్ నాయుడు
రచన::దాశరథి
గానం: P.సుశీల

తారాగణం::కృష్ణ,విజయనిర్మల,జగ్గయ్య,గుమ్మడి,చంద్రకళ,ఎస్.వరలక్ష్మి,సూర్యకాంతం,రమాప్రభ


మల్లె తీగవంటిదీ మగువ జీవితం 2
చల్లనిపందిరి వుంటే
అల్లుకొపోయేనూ అల్లుకొ పోయేనూ


!! మల్లె తీగవంటిదీ మగువ జీవితం !!

తల్లి తండ్రుల ముద్దూమురిపెం
చిన్నతనం లో కావాలీ 2
ఇల్లలికి పతి అనురాగం
ఎల్లకాలమూ నిలవాలి 2
తల్లికి పిల్లల ఆదరణ
పండు వయసులో కావాలీ
ఆడవారికీ అన్నివేళలా
తోడూనీడ వుండాలీ
తోడూనీడ వుం
డాలీ

!! మల్లె తీగవంటిదీ మగువ జీవితం !!

నుదుట కుంకుమ కళ కళ లాడే
సుధతే ఇంటికి శోభా 2
పిల్లల పాపలప్రేమగ పెంచే
తల్లే ఆరని జ్యోతీ 2
అనురాగం తో మనసును దోచే
వనితే మమతల పంటా
జన్మను ఇచ్చి జాతిని నిలిపే
జననే జగతికి ఆధారం
జననే జగతికి ఆధా
రం
!! మల్లె తీగవంటిదీ మగువ జీవితం !!

శ్రీ కృష్ణార్జున యుద్ధం--1963::ఆనందభైరవి::రాగం



సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు
రచన::పింగళి నాగేంద్ర రావు 
గానం::ఘంటసాల 
తారాగణం::N.T. రామారావు,అక్కినేని,కాంతారావు,B. సరోజాదేవి,S. వరలక్ష్మి, ధూళిపాళ,
అల్లు రామలింగయ్య.

ఆనందభైరవి::రాగం   

పల్లవి::

సోహం..సోహం..సోహం..సోహం

అంచెలంచెలు లేని మోక్షము 
చాల కష్టమే భామినీ
కష్టమైనను ఇష్టమేనని 
కోరి నిలిచితి చినమునీ 
అంచెలంచెలు లేని మోక్షము 
చాల కష్టమే భామినీ
కష్టమైనను ఇష్టమేనని 
కోరి నిలిచితి చినమునీ 

చరణం::1

అయిన కుదురుగ ఎదుట 
కూర్చుని గాలి గట్టిగా పీల్చుమా
స్వామీ స్వామీ..ఏమీ ఏమీ
నేను పీల్చిన..గాలి నిలువక 
అకటా మీపై..విసిరెనే
అకట మీపై..విసిరినే 
అందుకే..మరి 

అంచెలంచెలు లేని మోక్షము 
చాల కష్టమే భామినీ
కష్టమైనను ఇష్టమేనని 
కోరి నిలిచితి చినమునీ 

చరణం::2

ఐన కన్నులు మూసి చూపును
ముక్కు కొనపై..నిలుపుమా..ఆ
స్వామీ స్వామీ..ఈ మారేమీ
అచట నిలువక..చుపులన్నీ 
అయ్యో..మీపై దూకెనే..ఏఏఏఏ
అయ్యో..మీపై దూకెనే..ఏఏఏఏ 
అదే..మరి 

అంచెలంచెలు లేని మోక్షము 
చాల కష్టమే భామినీ
కష్టమైనను ఇష్టమేనని 
కోరి నిలిచితి చినమునీ 

శ్రీ కృష్ణార్జున యుద్ధం--1963::ఆభేరి..దర్భారి కానడ::రాగం



సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు
రచన::పింగళి నాగేంద్ర రావు 
గానం::ఘంటసాల 
తారాగణం::N.T. రామారావు,అక్కినేని,కాంతారావు,B. సరోజాదేవి,S. వరలక్ష్మి, ధూళిపాళ,
అల్లు రామలింగయ్య.

ఆభేరి..దర్భారి కానడ::రాగం  

పల్లవి::

దేవ దేవ నారాయణ..పరంధామ పరమాత్మ 
దేవ దేవ నారాయణ..పరంధామ పరమాత్మ 
నీ లీలలనెన్నెతరమ..భక్త పారిజాతమా 
దేవ దేవ..ఆ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆఆఅ ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ

చరణం::1

సకల భువన సంచాలక..అఖిల దనుజ సంహారక 
సకల భువన సంచాలక..అఖిల దనుజ సంహారక  
ఎప్పుడెచట అవతరించి..ఏమి నటన సేతువో  
దేవ దేవ నారాయణ..పరంధామ పరమాత్మ  
నీ లీలలనెన్నెతరమ..భక్త పారిజాతమా..ఆ  
దేవ దేవా..ఆ 

చరణం::2

దీనసుజన పరిపాలా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆఆఆఆ..ఆఆఆ ఆఆఆఆ..ఆఆఅ ఆఆఆఆ
ఆ ఆఆఅ ఆఆఆఆ..ఆ ఆఆఅ ఆఆఆఆ 
దీనసుజన పరిపాలా
మునిసన్నుత గుణజాల
ధరణినేమి మహిమ చాట 
ద్వారకలో నుంటివో
దేవ దేవ నారాయణ..ఆ 
ఆఆఅ ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ
ఆఆఅ ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ
దేవ దేవ
ఆఆఅ ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ
ఆఆఅ ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ
దేవ దేవ 
ఆఆఅ ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ
ఆఆఅ ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ
ఆఆఅ ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ
ఆఆఅ ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ
ఆఆఅ ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ
దేవ దేవ..నారాయణ 
ధరణినేమి మహిమ చాట..ద్వారకలో ఉంటివో
దేవ దేవ నారాయణ..పరంధామ పరమాత్మ