Wednesday, June 20, 2012

గుప్పెడుమనసు--1979






సంగీతం::M.S.విశ్వనాధన్
రచన::ఆత్రేయ
గానం:: S.P.బాలు...వాణీ జయరాం

పల్లవి::

నేనా.....పాడనా పాటా
మీరా.....అన్నదీ మాటా

నేనా.....పాడనా పాటా
మీరా.....అన్నదీ మాటా

నీ వదనం భూపాలమూ........నీ హృదయం ధ్రువతాళమూ
నీ సహనం సాహిత్యమూ.......నువ్వు పాడిందే సంగీత

నీ వదనం భూపాలమూ........నీ హృదయం ధ్రువతాళమూ
నీ సహనం సాహిత్యమూ.......నువ్వు పాడిందే సంగీత

నేనా.....పాడనా పాటా
మీరా.....అన్నదీ మాటా

చరణం:: 1

ఇల్లే సంగీతమూ.....వంటిల్లే సాహిత్యమూ
ఈ పిల్లలే నా సాధనం.....ఇంకా వింటారా నా గానం (2)

ఊగే ఉయ్యాలకూ....నువు పాడే జంపాలకూ
ఊగే ఉయ్యాలకూ.....నువు పాడే జంపాలకూ
సరితూగదు ఏ గానమూ.....నీకు ఎందుకు సందేహమూ

నీకు ఎందుకు సందేహము !

నేనా.....పాడనా పాటా
మీరా.....అన్నదీ మాటా

చరణం:: 2

ఉడకని అన్నానికీ.....మీకొచ్చే కోపానికీ
ఏ రాగం బాగుండునో.....చెప్పే త్యాగయ్య మీరేగా (2)

కుత కుత వరి అన్నం.....తై తక తక మను నాట్యం
ఏ భరతుడు రాసిందీ.....నీకా పదునెటు తెలిసిందీ

నీకా పదునెటు తెలిసింది !

నేనా.....పాడనా పాటా
మీరా.....అన్నదీ మాటా

నీ వదనం భూపాలమూ........నీ హృదయం ధ్రువతాళమూ
నీ సహనం సాహిత్యమూ.......నువ్వు పాడిందే సంగీత

గుప్పెడుమనసు--1979






సంగీతం::M.S.విశ్వనాధన్
రచన::ఆత్రేయ
గానం::మంగళంపల్లి బాలమురళీక్రిష్ణ


మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు

మౌనమే నీ భాష ఓ మూగ మనసా..
ఓ మూగ మనసా

చీకటి గుహ నీవు
చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా..తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో
ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో..ఏమై మిగిలేవో
ఎందుకు రగిలేవో..ఏమై మిగిలేవో

మౌనమే నీ భాష ఓ మూగ మనసా..
ఓ మూగ మనసా

కోర్కెల సెల నీవు
ఊరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా..మాయల దెయ్యానివే
లేనిది కోరేవు..ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు

మౌనమే నీ భాష ఓ మూగ మనసా..
ఓ మూగ మనసా

గుప్పెడుమనసు--1979




సంగీతం::M.S.విశ్వనాధన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు

నువ్వేనా సంపంగి పూల నువ్వేనా
నువ్వేనా సంపంగి పూల నువ్వేనా
జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా ,నువ్వేనా

నిన్నేనా అది నేనేనా కలగన్నానా కనుగొన్నానా
నిన్నేనా అది నేనేనా కలగన్నానా కనుగొన్నానా
అల్లిబిల్లి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా
అల్లిబిల్లి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా

నువ్వేనా
నువ్వేనా సంపంగి పూల నువ్వేనా
జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా ,నువ్వేనా

చరణ్మ్::2

కళ్ళేనా...
కళ్ళేనా హరివిల్లేనా అది చూపేనా విరితూపేనా
కళ్ళేనా హరివిల్లేనా అది చూపేనా విరితూపేనా
తుళ్ళితుళ్ళిపడు వయసేనా నను తొందరవందర చేసేనా
తుళ్ళితుళ్ళిపడు వయసేనా నను తొందరవందర చేసేనా

నువ్వేనా
నువ్వేనా సంపంగి పూల నువ్వేనా
జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా ,నువ్వేనా

చరణం::3

ఆ ఆ ఆ ఆ ఆ
నువ్వైనా నీ నీడైనా ఏనాడైనా నా తోడౌనా
నువ్వైనా నీ నీడైనా ఏనాడైనా నా తోడౌనా
మళ్లీమళ్లీ కల వచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా
మళ్లీమళ్లీ కల వచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా

నువ్వేనా సంపంగి పూల నువ్వేనా
జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా ,నువ్వేనా
నువ్వేనా సంపంగి పూల నువ్వేనా