Saturday, April 27, 2013

గోపాలరావు గారి అమ్మాయి--1980




సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::G.ఆనంద్,P.సుశీల
Film Directed By::K.Vaasu
తారాగణం::రావుగోపాల్‌రావు,జయసుధ,చంద్రమోహన్,షావుకారు జానకి,
నాగభూషణం,మోహన్‌బాబు,చక్రవర్తి,సాక్షి రంగారావు,శరత్,ఝాన్సి,కాకరాల.

పల్లవి::

మనవే వినవా మనసే కనవా
మది లోపలి మాటను మన్నించవా
కలలే మరిచి..కనులే తెరిచి
నిజమేదో స్వామీ గుర్తించవా
ఇక ఒంటిగ నన్నూ వదిలెయ్యవా
మనవే విననా..మనసే కననా
మది లోపలి మాటను మన్నించనా
గతమే మరచి..కనులే తెరచి
నిజమైతే స్వామీ..గుర్తించనా
ఇక ఒంటరితనమే వదిలించనా

మనవే వినవా మనసే కనవా
మది లోపలి మాటను మన్నించవా

చరణం::1

నిను చూడగనే నే బెంగపడి
సంపెంగలలో అది దాచుకుని
చిరునవ్వులకే మది జివ్వుమని
కసి చూపులతో కబురంపుకొని
పరుగులు తీసే పరువంతో
పైటలు జారే అందంతో
చక్కలిగిలిగా సరసాలాడే
చలి చలిగా సరిగమ పాడే
వలపులు పిలిచే ఈ వేళలో
వయసులు తెలిసే ఈ వేళలో
మనవే వినవా..మనసే కనవా
మది లోపలి మాటను మన్నించవా

చరణం::2

తొలిచూపులనే మునిమాపులుగా
మరుమల్లెల జల్లులు జల్లుకుని
బిగి కౌగిలినే నా లోగిలిగా
అరముద్దుల ముగ్గులు పెట్టుకుని

కలలైపోయిన కన్నులతో
వలలైపోయిన చూపులతో
ప్రేమే ముదిరీ పెళ్ళైపోయీ
పెళ్ళే కుదిరీ ఇల్లైపోయే
మనసులు కలిసే ఈ వేళలో
మమతలు విరిసే ఈ వేళలో

మనవే వినవా..మనసే కనవా
మది లోపలి మాటను మన్నించవా
కలలే మరిచి కనులే తెరిచి
నిజమేదో స్వామీ గుర్తించవా
ఇక ఒంటిగ నన్నూ వదిలెయ్యవా

Gopaalaraavu Gaari Ammaayi--1980
Music::Chakravarti
rachana::Vetoorisundarraammoorti
Singer's::G.Anand,P.Suseela
Film Directed By::K.Vaasu
Cast::Raavugopaal Rao,Jayasudha,Chandramohan,Shaavukaaru Jaanaki,
Naagabhooshanam,Mohanbaabu

::::::::::::::::

manavE vinavaa manasE kanavaa
madi lOpali maaTanu manninchavaa
kalalE marichi..kanulE terichi
nijamEdO swaamee gurtinchavaa
ika onTiga nannoo vadileyyavaa
manavE vinanaa..manasE kananaa
madi lOpali maaTanu manninchanaa
gatamE marachi..kanulE terachi
nijamaitE swaamee..gurtinchanaa
ika onTaritanamE vadilinchanaa

manavE vinavaa manasE kanavaa
madi lOpali maaTanu manninchavaa

::::1

ninu chooDaganE nE bengapaDi
sampengalalO adi daachukuni
chirunavvulakE madi jivvumani
kasi choopulatO kaburampukoni
parugulu teesE paruvamtO
paiTalu jaarE andamtO
chakkaligiligaa sarasaalaaDE
chali chaligaa sarigama paaDE
valapulu pilichE ii vELalO
vayasulu telisE ii vELalO
manavE vinavaa..manasE kanavaa
madi lOpali maaTanu manninchavaa

::::2

tolichoopulanE munimaapulugaa
marumallela jallulu jallukuni
bigi kaugilinE naa lOgiligaa
aramuddula muggulu peTTukuni

kalalaipOyina kannulatO
valalaipOyina choopulatO
prEmE mudiree peLLaipOyee
peLLE kudiree illaipOyE
manasulu kalisE ii vELalO
mamatalu virisE ii vELalO

manavE vinavaa..manasE kanavaa
madi lOpali maaTanu manninchavaa
kalalE marichi kanulE terichi
nijamEdO swaamee gurtinchavaa
ika onTiga nannoo vadileyyavaa