Tuesday, August 18, 2009

భార్య బిడ్డలు--1972





సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల

పల్లవి::

వలచీనానమ్మ..హమ్మా..హమ్మా..హమ్మా..హమ్మా
వలచీనానమ్మ
వలచినానని తెలిసికూడా నే పలకరించినా పలకడమ్మా 
వలచీనానమ్మ..వలచీనానమ్మ 
హేయ్..వలచీనావమ్మా..హమ్మా..హమ్మా..హమ్మా..హమ్మా
వలచీనావమ్మా
వలచినావని తెలిసినంతనే పలుకరాక నే నిలిచానమ్మా
వలచీనావమ్మా..వలచీనావమ్మా

చరణం::1 

కళ్ళున్నందుకు ఒకసారైనా కలపాలోయి
కమ్మని కబురులు సరదాకైనా చెప్పాలోయి..ఈ
కళ్ళున్నందుకు ఒకసారైనా కలపాలోయి
కమ్మని కబురులు సరదాకైనా చెప్పాలోయి..ఈ

కబురులు కమ్మగ ఉండవమ్మ జరగకపోతేనూ
కబురులు కమ్మగ ఉండవమ్మ జరగకపోతేనూ
కళ్ళు కలిపితే ఊరకపోదు..కలతేరేగేను..ఊఊఉ 

వలచీనానమ్మ..హమ్మా..హమ్మా..హమ్మా..హమ్మా
వలచీనానమ్మ

వలచినావని తెలిసినంతనే పలుకరాక నే నిలిచానమ్మా
వలచీనావమ్మా..వలచీనావమ్మా

చరణం::2

వయసంటేనే నీ ఒంటికి పడదా ఊరకుంటావు
సొగసంటే నీ కంటికి చేదా చూడనంటావు
వయసంటేనే నీ ఒంటికి పడదా ఊరకుంటావు
సొగసంటే నీ కంటికి చేదా చూడనంటావు

సొగసులోనా సొగసే లేదు సొంతం కాకుంటే
సొగసులోనా సొగసే లేదు సొంతం కాకుంటే
వయసే ఒంటికి చెరుపౌతుంది..వదలి ఊరుకుంటే

వలచీనానమ్మ..హమ్మా..హమ్మా..హమ్మా
వలచీనానమ్మ

వలచినావని తెలిసినంతనే పలుకరాక నే నిలిచానమ్మా
వలచీనావమ్మా..వలచీనావమ్మా

ఓఓ..ఓ..హోఓ..ఓ..ఓఓ..ఓ..హోఓ..ఓ