ఈ పాట ఇక్కడ వినండి
సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::బాలు
పల్లవి::
ఆ ఆ ఆ అ ఆ..ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ
అందాల హృదయమా..అనురాగ నిలయమా
అందాల హృదయమా..అనురాగ నిలయమా
నీ గుండెలోని తొలిపాటా..వినిపించు నాకు ప్రతి పూట
వెంటాడు నన్ను ప్రతి చోటా..
అందాల హృదయమా..అనురాగ నిలయమా
చరణం::1
మనసుయ్న్న వారికే మమతాను బంధాలు
కనులున్న వారికే..కనిపించు అందాలు
అందరి సుఖమే నీదను కొంటే..
నవ్వుతు కాలం గడిపేస్తుంటే
ప్రతి రుతువూ ఒక వాసంతం
ప్రతి బ్రతుకూ ఒక మధుగీతం
అందాల హృదయమా..అనురాగ నిలయమా
నీ గుండెలోని తొలిపాటా..వినిపించు నాకు ప్రతి పూట
వెంటాడు నన్ను ప్రతి చోటా..
అందాల హృదయమా..అనురాగ నిలయమా
చరణం::2
ఏ పాటకైనా రావాలి రాగమూ..ఏ జంటకైనా రావాలి యోగం
జీవితమెంతో తీయనైనదని..మనసున మమతే మాసిపోదనీ
తెలిపే నీతో సహవాసం..వలచేవారికి సందేశం
అందాల హృదయమా..అనురాగ నిలయమా
నీ గుండెలోని తొలిపాటా..వినిపించు నాకు ప్రతి పూట
వెంటాడు నన్ను ప్రతి చోటా..
అందాల హృదయమా..అనురాగ నిలయమా
Monday, October 31, 2011
అనురాగదేవత--1982
సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::SP.బాలు
నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూటా
నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూటా
చిరునవ్వుకు ముద్దంట..సిగపూవ్వుకు ముద్దంట
సిరి మువ్వగ నేనుంటా..సిరి మువ్వగ నేనుంటా
నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూటా
అందాలు నీలోన పందాలు వేస్తుంటే..ఏ..ఏ..
అరచేత పగడాలు..జగడాలు పడుతుంటే..ఏ..
అందాలు నీలోన పందాలు వేస్తుంటే
అరచేత పగడాలు..జగడాలు పడుతుంటే
ఎద మీద హారాలు..తారాడుతుంటే
తారల్లు నీ కంట..తానాలు చేస్తుంటే
తెలుగు పాటకో ఎంకివై..తెలుగుతోట వరికంకివై
కిన్నెర మీటే నవ్వులతో..కిన్నెర మీటే నవ్వులతో
కిన్నెరసానీ..నడకలతో..కిన్నెరసానీ..నడకలతో
నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూటా
చిరునవ్వుకు ముద్దంట..సిగపూవ్వుకు ముద్దంట
సిరి మువ్వగ నేనుంటా..సిరి మువ్వగ నేనుంటా
నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూటా
జడకొప్పే నీ మొగ్గ నడుమెక్కడంటుంటే..ఏ..హా..
పెదవుల్లు నీ గుట్టు గోరింతలవుతుంటే..ఏ..ఏ..
జడకొప్పే నీ మొగ్గ నడుమెక్కడంటుంటే
పెదవుల్లు నీ గుట్టు గోరింతలవుతుంటే
మాయింటి దీపాలు నీ రూప మవుతుంటే
నీ కంటి నీడల్లో..నే రాగ మవుతుంటే
కూచిపూడికొక ఆటవై..కూనలమ్మ తొలి పాటవై..ఈ..
జాబిలి దాటే వెన్నెలతో.జాబిలి దాటే వెన్నెలతో
జాబులు పంపే కన్నులతో..జాబులు పంపే కన్నులతో
నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూటా
నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూటా
చిరునవ్వుకు ముద్దంట..సిగపూవ్వుకు ముద్దంట
సిరి మువ్వగ నేనుంటా..సిరి మువ్వగ నేనుంటా
Labels:
Hero::N.T.R,
SP.Baalu,
అనురాగదేవత--1982
అనురాగదేవత--1982
సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చూసుకోపదిలంగా..హృదయాన్ని అద్దంలా
చూసుకోపదిలంగా..హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైన..రగిలేను నీలో వేదనా
చూసుకో పదిలంగా ఆ ఆ
వికసించే పూలు ముళ్ళు..విధిరాతకు ఆనవాళ్ళు
వికసించే పూలు ముళ్ళు..విధిరాతకు ఆనవాళ్ళు
ఒకరి కంట పన్నీరైనా..ఒకరి కంట కన్నీళ్ళు
ఒకరి కంట పన్నీరైనా..ఒకరి కంట కన్నీళ్ళు
ఎండమావి నీరుతాగి..గుండెమంటలార్చుకోకు
ఎండమావి నీరుతాగి..గుండెమంటలార్చుకోకు
ఆశపెంచుకోకు నేస్తం..అది నిరాశ స్వాగత హస్తం
చూసుకోపదిలంగా..హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైన..రగిలేను నీలో వేదనా
చూసుకో పదిలంగా
కాలమనే నదిలో కదిలే..ఖర్మమనే నావమీద
కాలమనే నదిలో కదిలే..ఖర్మమనే నావమీద
ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా..చివరి తోడు నువ్వేలే
ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా..చివరి తోడు నువ్వేలే
సాగుతున్న బాటసారి..ఆగి చూడు ఒక్కసారి
సాగుతున్న బాటసారి..ఆగి చూడు ఒక్కసారి
కలుసుకోని ఇరుతీరాలు..కనిపించని సుడిగుండాలు
చూసుకోపదిలంగా..హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైన..రగిలేను నీలో వేదనా
చూసుకో పదిలంగా
Labels:
Hero::N.T.R,
P.Suseela,
అనురాగదేవత--1982
మైనర్ బాబు --1973
సంగీతం::T.చలపతిరావ్
రచన::C.నారాయణరెడ్డి
గానం:;ఘంటసాల,సుశీల
పల్లవి::
శోభన్::నేను..నీవు..ఇలాగే..వుండిపోతే..
వాణీశ్రీ::హ్హా
శోభన్::నేను..నీవు..ఇలాగే..వుండిపోతే
వాణీశ్రీ::ప్రతిక్షణం..ఈ సుఖం..ఇలాగే పండిపోతే
శోభన్::ఎంత..హాయీ..ఎంత..హాయీ..
వాణీశ్రీ::ఎంత..హాయీ..ఎంత..హాయీ..
చరణం::1
వాణీశ్రీ::నీ కళ్ళల్లో పొదరిల్లు కట్టుకొని ఉండనా
శోభన్::నీ సిగ్గుల నిగ్గుల బుగ్గలు చిదిమి దీపం పెట్టనా
వాణీశ్రీ::నీ కళ్ళల్లో పొదరిల్లు కట్టుకొని ఉండనా
శోభన్::నీ సిగ్గుల నిగ్గుల బుగ్గలు చిదిమి దీపం పెట్టనా
శోభన్::నేను..నీవు..ఇలాగే..వుండిపోతే
వాణీశ్రీ::ప్రతిక్షణం..ఈ సుఖం..ఇలాగే పండిపోతే
శోభన్::ఎంత..హాయీ..ఎంత..హాయీ..
వాణీశ్రీ::ఎంత..హాయీ..ఎంత..హాయీ..
చరణం::2
శోభన్::నీ పెదవిపై మధురిమనై ప్రణయ మధురిమలు నింపనా
చరణం::2
శోభన్::నీ పెదవిపై మధురిమనై ప్రణయ మధురిమలు నింపనా
వాణీశ్రీ::నీ..ఎదపాన్‌పుపై నవ వధువునై
నే ఒదిగి ఒదిగి నిదురించనా
శోభన్::నీ పెదవిపై మధురిమనై ప్రణయ మధురిమలు నింపనా
వాణీశ్రీ::నీ..ఎదపాన్‌పుపై నవ వధువునై
నే ఒదిగి ఒదిగి నిదురించనా
వాణీశ్రీ::నేను..నీవు ఇలాగే ఉండిపోతే
శోభన్::ప్రతిక్షణం..ఈ సుఖం..ఇలాగే పండిపోతే
వాణీశ్రీ::ఎంత..హాయీ..ఎంత..హాయీ..
శోభన్::ఎంత..హాయీ..ఎంత..హాయీ..
అత్తలూ కోడళ్లు--1971
సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
పల్లవి::
పాలపిట్ట పాలపిట్ట పరుగులెందుకు
నీకు వరసైన బావతోటి వాదులెందుకూ
పాలపిట్ట పాలపిట్ట పరుగులెందుకు
నీకు వరసైన బావతోటి వాదులెందుకూ
పాలపిట్ట వెంట నీకు పరుగులెందుకు
అంత వరసైన బావవైతె వాదులెందుకూ
పాలపిట్ట వెంట నీకు పరుగులెందుకూ
చరణం::1
టెక్కులునిక్కులుఎన్నాళ్ళూ
నీకు ముకుతాడేసిన మూన్నాళ్ళే
టెక్కులునిక్కులుఎన్నాళ్ళూ
నీకు ముకుతాడేసిన మూన్నాళ్ళే
గీరలు జోరులు ఎన్నాళ్ళూ
నాగాలి తగిలితే రెన్నాల్లే రెన్నాల్లే
గీరలు జోరులు ఎన్నాళ్ళూ
నాగాలి తగిలితే రెన్నాల్లే రెన్నాల్లే
పాలపిట్ట పాలపిట్ట పాలపిట్ట పరుగులెందుకు
అంత వరసైన బావవైతె వాదులెందుకు
పాలపిట్ట వెంట నీకు పరుగులెందుకు
చరణం::2
గాజుల గలగల వింటే చాలు
రాతిరి నిద్దురపోలేవు
ఆహాహా..ఓహోహో
ఓహో ఓ గాజుల గలగల వింటే
చాలు రాతిరి నిద్దురపోలేవు
పక్కన నేను వుంటే చాలు
పగలే కలలు కంటావు
ఆహాహా..ఆ ఓహోహో ఓ
పక్కన నేను వుంటే చాలు
పగలే కలలు కంటావు
కాపురమంటూ ఏర్పడితే
నా హృదయం నీకే తెలియాలి
కాపురమంటూ ఏర్పడితే
నా హృదయం నీకే తెలియాలీ
దీపం పెడుతూ నేనుంటే
నా ఆశలు నువ్వే తీర్చాలి తీర్చాలీ
దీపం పెడుతూ నేనుంటే
నా ఆశలు నువ్వే తీర్చాలి తీర్చాలీ
పాలపిట్ట పాలపిట్ట పరుగులెందుకు
నీకు వరసైన బావతోటి వాదులెందుకూ
పాలపిట్ట వెంట నీకు పరుగులెందుకు
అంత వరసైన బావవైతె వాదులెందుకూ
పాలపిట్ట పాలపిట్ట పరుగులెందుకూ
కొడుకు కోడలు--1972
సంగీతం::K.V. మహదేవన్ర
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
పల్లవి::
నాకంటే చిన్నోడు..నాతమ్ముడూన్నాడు
నాకంటే చిన్నోడు..నాతమ్ముడూన్నాడు
అన్నాడు ఒక పిల్లగాడు..అల్లరల్లరీ బుల్లోడు
నిలదీసి అడిగితే..నీళ్ళునములుతున్నాడు
నాకంటే చిన్నోడు..నాతమ్ముడూన్నాడు
నాకంటే చిన్నోడు..నాతమ్ముడూన్నాడు
అన్నాడు ఒక పిల్లగాడు..అల్లరల్లరీ బుల్లోడు
నిలదీసి అడిగితే..నీళ్ళునములుతున్నాడు
నాకంటే చిన్నోడు..నాతమ్ముడూన్నాడు
అన్నాడు ఒక పిల్లగాడు
చరణం::1
పిల్లిలా వచ్చాడు..ప్రేమలో పడ్డాడు..ఓయ్
పిల్లిలా వచ్చాడు..ప్రేమలో పడ్డాడు
కల్లబొల్లి మాటలతో..కళ్ళలోకి పాకాడు
పిల్లిలా వచ్చాడు..ప్రేమలో పడ్డాడు
కల్లబొల్లి మాటలతో..కళ్ళలోకి పాకాడు
దమ్ములేని సోగ్గాడు..తమ్ముడిపై నెట్టాడు
దమ్ములేని సోగ్గాడు..తమ్ముడిపై నెట్టాడు
ఆ తమ్ముడే నచ్చాడంటే..ఈ అన్న ఏమౌతాడు
నాకంటే చిన్నోడు..నాతమ్ముడూన్నాడు
అన్నాడు ఒక పిల్లగాడు
చరణం::2
తమ్ముడేమో కొరకరాని గడుగ్గాయి
అన్నేమో చేతగాని వెంగళాయి
తమ్ముడేమో కొరకరాని గడుగ్గాయి
అన్నేమో చేతగాని వెంగళాయి
తెలివుంది అన్నకూ..కండబలముంది తమ్ముడికీ
ఈ రెండు కావాలీ..హా
ఈ రెండు కావాలి దోర దోర అమ్మాయికి
నాకంటే చిన్నోడు నా తమ్ముడున్నాడు
అన్నాడు ఒక పిల్లగాడు..హాయ్
చరణం::3
గువ్వలా గున్నాను..కోతినను కొన్నానా
పడుచుపిల్ల ఎదకున్న..చలికి వణుకుతున్నానా..హాయ్
గువ్వలా గున్నాను..కోతినను కొన్నానా
పడుచుపిల్ల ఎదకున్న..చలికి వణుకుతున్నానా
వంటరిగా వస్తున్నానూ..జంటని చూస్తున్నాను
ఒంటరిగా వచ్చానూ..జంటనెదురు చూస్తున్నాను
అసలేమి లేని వాడవనీ..మ్మ్ ..ఆశవదులు కొన్నాను
నాకంటే చిన్నోడు..నాతమ్ముడూన్నాడు
నాకంటే చిన్నోడు..నాతమ్ముడూన్నాడు
అన్నాడు ఒక పిల్లగాడు..అల్లరల్లరీ బుల్లోడు
నిలదీసి అడిగితే..నీళ్ళునములుతున్నాడు
నాకంటే చిన్నోడు..నాతమ్ముడూన్నాడు
అన్నాడు ఒక పిల్లగాడు
హేయ్..పిల్లగాడు..
హేయ్ హేయ్ పిల్లగాడు
హేయ్ హేయ్ పిల్లగాడు.
హేయ్ హేయ్ పిల్లగాడు
హేయ్ హేయ్ పిల్లగాడు..
కొడుకు కోడలు --1972
సంగీతం::K.V. మహదేవన్ర
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
పల్లవి::
అతడు::నువ్వూ..నేనూ..ఏకమైనామూ
నువ్వూ..నేనూ..ఏకమైనామూ
ఇద్దరము..మనమిద్దరము..ఒక లోకమైనాము
ఆమె::లోకమంతా ఏకమైనా..వేరు కాలేము..వేరు కాలేము
ఇద్దరు::నువ్వూ..నేనూ..ఏకమైనామూ
నువ్వూ..నేనూ..ఏకమైనామూ
చరణం::1
అతడు::కళ్లు నాలుగు కలిపి మనము ఇల్లు కడదాము
ఆమె::అందులో మన చల్లచల్లని వలపు దీపం నిలుపుకుందాము
అతడు::కళ్లు నాలుగు కలిపి మనము ఇల్లు కడదాము
ఆమె::అందులో మన చల్లచల్లని వలపు దీపం నిలుపుకుందాము
అతడు::పసిడి మనసుల పట్టెమంచం వేసుకుందాము
ఆమె::అందులో మన పడుచుకోర్కెల మల్లెపూలు పరుచుకుందాము
ఇద్దరు::నువ్వూ..నేనూ..ఏకమైనామూ
చరణం::2
అతడు::చెలిమితో ఒక చలువ పందిరి వేసుకుందాము
ఆమె::కలల తీగల అల్లిబిల్లిగ అల్లుకుందాము
అతడు::ఆ..అల్లికను మన జీవితాలకు పోల్చుకుందాము
ఆమె::ఏ ప్రొద్దుగాని వాడిపోని పువ్వులవుదాము..ఉ..ఉ..
ఇద్దరు::నువ్వూ..నేనూ..ఏకమైనామూ
చరణం::3
అతడు::లేత వెన్నెల చల్లదనము..నువ్వు తెస్తావు
ఆమె::అందులో నీరెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు
అతడు::లేత వెన్నెల చల్లదనము..నువ్వు తెస్తావు
ఆమె::అందులో నీరెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు
అతడు::సూర్యచంద్రులు లేని జగతిని సృష్టి చేద్దాము
ఆమె::అందులో ఈ సృష్టికెన్నడు లేని సొగసు మనము తెద్దాము..ఉ..
అతడు::నువ్వూ..నేనూ..ఏకమైనామూ
ఇద్దరము..మనమిద్దరము..ఒక లోకమైనాము
ఆమె::లోకమంతా ఏకమైనా..వేరు కాలేము..వేరు కాలేము
ఇద్దరు::నువ్వూ..నేనూ..ఏకమైనామూ
ఆ హహహా..ఆహహాహాహా..
కొడుకు కోడలు--1972
సంగీతం::K.V. మహదేవన్ర
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
అతడు::చేయీ చేయీ తగిలింది
హాయి హాయిగా వుంది
ఆమె::పగలు రేయిగా మారింది
పరువం వురకలు వేసింది
ఆమె::చేయీ చేయీ తగిలింది
హాయి హాయిగా వుంది
అతడు::పగలు రేయిగా మారింది
పరువం వురకలు వేసింది
చరణం::1
అతడు:: నా తలుపును తట్టింది
నా తలుపును తట్టింది
నీ మనసుకు మెలుకువ వచ్చింది
నీ వయసుకు గడియను తీసింది
ఆమె:: నీ పిలుపే లోనికి రమ్మంది
నీ పిలుపే లోనికి రమ్మంది
నా బిడియం వాకిట ఆపింది
నా సిగ్గే ముగ్గులు వేసిందీ
అహాహహా అహాహాహా
అతడు::చేయీ చేయీ తగిలింది
హాయి హాయిగా వుంది
ఆమె::ఆ ఆ పగలు రేయిగా మారింది
పరువం వురకలు వేసింది
చరణం::2
అతడు::సిగ్గుతో నీవు నిలుచుంటే
నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే
సిగ్గుతో నీవు నిలుచుంటే
నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే
ఊపిరాడక నా మనసు
వుక్కిరి బిక్కిరి అయ్యింది
ఆమె::వాకిట నేను నిలుచుంటే
ఆకలిగా నువు చూస్తుంటే
వాకిట నేను నిలుచుంటే
ఆకలిగా నువు చూస్తుంటే
ఆశలు రేగి నా మనసు
అటు ఇటు కాక నలిగిందీ
అతడు::చేయీ చేయీ తగిలింది
హాయి హాయిగా వుంది
ఆమె::పగలు రేయిగా మారింది
పరువం వురకలు వేసింది
చరణం::3
ఆమె::నీ చూపే మెత్తగ తాకింది
నీ చూపే మెత్తగ తాకింది
నా చుట్టూ మత్తును చల్లింది
నిను చూస్తూ వుంటే చాలంది
అతడు::నీ సొగసే నిలవేసింది
నీ సొగసే నిలవేసింది
నా మగసిరికీ సరితూగిందీ
నా సగమును నీకు ఇమ్మందీ
లలలలలా..లలాల్లా
ఇద్దరు::
చేయీ చేయీ తగిలింది
హాయి హాయిగా వుంది
పగలు రేయిగా మారింది
పరువం వురకలు వేసింది
కొడుకు కోడలు --1972
సంగీతం::K.V. మహదేవన్ర
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల
పల్లవి::
గొప్పోళ్ల చిన్నది..గువ్వల్లే వున్నది
కొండమీద కోతల్లే..చిక్కనంటది
చెట్టుకొమ్మల్లే..గుండెను వూపేస్తది
గొప్పోళ్ల చిన్నది..గువ్వల్లే వున్నది
కొండమీద కోతల్లే..చిక్కనంటది
చెట్టుకొమ్మల్లే..గుండెను వూపేస్తది
చరణం::1
నడుమెంత సన్నదో..నడకంత చక్కంది
చూపెంత చురుకైందో..రూపంత సొగసైంది
నడుమెంత సన్నదో..నడకంత చక్కంది
చూపెంత చురుకైందో..రూపంత సొగసైంది
మనిషేమో దుడుకైంది..వయసేమో వుడుకైంది
మనిషేమో దుడుకైంది..వయసేమో వుడుకైంది
మనసెలా వుంటుందో..అది ఇస్తేనే తెలిసేది
గొప్పోళ్ల చిన్నది..గువ్వల్లే వున్నది
కొండమీద కోతల్లే..చిక్కనంటది
చెట్టుకొమ్మల్లే..గుండెను వూపేస్తది
చరణం::2
ఒంటరిగా వచ్చిందంటే..జంటకోసమే వుంటుంది
పేచీతో మొదలెట్టిందంటే..అహా..ప్రేమ పుట్టే వుంటుంది
కొమ్మనున్న దోరపండు..కోరుకుంటే చిక్కుతుందా? నాకు దక్కుతుందా?
హ్హా..హ్హా..హ్హా..
కొమ్మనున్న దోరపండు..కోరుకుంటే చిక్కుతుందా? నాకు దక్కుతుందా?
కొమ్మబట్టి గుంజితేనే..కొంగులోకి పడుతుంది
గొప్పోళ్ల చిన్నది..గువ్వల్లే వున్నది
కొండమీద కోతల్లే..చిక్కనంటది
చెట్టుకొమ్మల్లే..గుండెను వూపేస్తది
చరణం::3
ఊరుకున్న కుర్రవాడ్ని..వుడికించి పోతుంది
మాపటికీ పాపమంతా వేపించుకు తింటుంది
ఒకచోట నిలవలేక..పక్కమీద వుండలేక
ఒకచోట నిలవలేక..పక్కమీద వుండలేక
ఆ టెక్కూ నిక్కూ తగ్గి..రేపిక్కడికే తానొస్తుంది
గొప్పోళ్ల చిన్నది..గువ్వల్లే వున్నది
కొండమీద కోతల్లే..చిక్కనంటది
చెట్టుకొమ్మల్లే..గుండెను వూపేస్తది
లలలాలాలిలాలాలాలలలా
లలిలాలాలిలాలాలాలాలలా
ఈ తరం మనిషి --1977
సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::SP.బాలు,P.సుశీల
పల్లవి:
శొభన్::-ఇచ్చేశా నా హృదయం తీసుకో
ఎదలోపల పదిలంగా దాచుకో
అద్దంలా చూసుకో
ముద్దల్లే వాడుకో
జయప్రద::-ఇచ్చేశా నా హృదయం తీసుకో
ఎదలోపల పదిలంగా దాచుకో
అద్దంలా చూసుకో
ముద్దల్లే వాడుకో
శొభన్::-ఇచ్చేశా నా హృదయం తీసుకో
ఎదలోపల పదిలంగా దాచుకో
చరణం1::-
అతడు::చిగురువంటి చినదానికి
చెంపలే సొంపులు
ఆమె::చిలిపి కళ్ల చినవాడితో
చెలిమిలోనే ఇంపులు
అతడు::చేసుకొనే బాసలు
చెరిగిపోని రాతలు
ఆమె::చేసుకొనే బాసలు
చెరిగిపోని రాతలు
అతడు::చెప్పలేని ఊహలు
చేయబోవు చేతలు
అహా..అహహా..లలలా
ఆమె:: నా హృదయం తీసుకో
అతడు::ఎదలోపల పదిలంగ దాచుకో
చరణం 2::-
అతడు::నిన్ను నన్ను కలిపిన ఈ కన్నులూ
ఆమె::అవి ఎన్నటికీ కాస్తాయి వెన్నెలలూ
అతడు::నిన్ను నన్ను కలిపిన ఈ కన్నులూ
ఆమె::అవి ఎన్నటికీ కాస్తాయి వెన్నెలలూ
అతడు::మనకౌగిలి వెన్నెలలో మల్లెలూ
మనకౌగిలి వెన్నెలలో మల్లెలూ
ఆమె::దిన దినము చల్లుతాయి మరపురాని మమతలు
అతడు::ఇచ్చేసా నా హృదయం తీసుకో
ఆమె::ఎదలోపల పదిలంగ దాచుకో
చరణం3::-
అతడు::మన మధ్యన గాలికూడ వుండనే వుండదు
ఆమె::కాలమైన పరుగిడనే పరుగిడదు
అతడు::నువ్వు నా ఊపిరి
ఆమె::నేను నీ లాహిరి
అతడు::నువ్వు నా ఊపిరి
ఆమె::నేను నీ లాహిరి
ఇద్దరు::ఇద్దరమూ చూద్దాము ఆనందహిమగిరి
అహా..అహహా..ల్లల్లలా..
ఆమె::ఇచ్చేశా నా హృదయం తీసుకో
ఎదలోపల పదిలంగా దాచుకో
అతడు::అద్దంలా చూసుకో
ముద్దల్లే వాడుకో..ఓ..ఓ..
ఇద్దరు:ఇచ్చేశా నా హృదయం తీసుకో
ఎదలోపల పదిలంగా దాచుకో
ఆమె::అవి ఎన్నటికీ కాస్తాయి వెన్నెలలూ
అతడు::నిన్ను నన్ను కలిపిన ఈ కన్నులూ
ఆమె::అవి ఎన్నటికీ కాస్తాయి వెన్నెలలూ
అతడు::మనకౌగిలి వెన్నెలలో మల్లెలూ
మనకౌగిలి వెన్నెలలో మల్లెలూ
ఆమె::దిన దినము చల్లుతాయి మరపురాని మమతలు
అతడు::ఇచ్చేసా నా హృదయం తీసుకో
ఆమె::ఎదలోపల పదిలంగ దాచుకో
చరణం3::-
అతడు::మన మధ్యన గాలికూడ వుండనే వుండదు
ఆమె::కాలమైన పరుగిడనే పరుగిడదు
అతడు::నువ్వు నా ఊపిరి
ఆమె::నేను నీ లాహిరి
అతడు::నువ్వు నా ఊపిరి
ఆమె::నేను నీ లాహిరి
ఇద్దరు::ఇద్దరమూ చూద్దాము ఆనందహిమగిరి
అహా..అహహా..ల్లల్లలా..
ఆమె::ఇచ్చేశా నా హృదయం తీసుకో
ఎదలోపల పదిలంగా దాచుకో
అతడు::అద్దంలా చూసుకో
ముద్దల్లే వాడుకో..ఓ..ఓ..
ఇద్దరు:ఇచ్చేశా నా హృదయం తీసుకో
ఎదలోపల పదిలంగా దాచుకో
Labels:
Hero::Sobhanbabu,
P.Suseela,
SP.Baalu,
ఈ తరం మనిషి --1977
అత్తలూ కోడళ్లు--1971
సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::P. సుశీల
పల్లవి::
ఈ వీణ పలికించు..ఎన్నిరాగాలో
నాలోన పులకించు..ఎన్నిభావాలో
ఈ వీణ పలికించు..ఎన్నిరాగాలో
నాలోన పులకించు..ఎన్నిభావాలో
ఈ వీణ పలికించు..ఎన్నిరాగాలో
చరణం::1
మనసులో రాగాలు..స్వరములై పలికాయి
కనులలో రాగాలు..కళలుగా వెలిశాయి
మనసులో రాగాలు..స్వరములై పలికాయి
కనులలో రాగాలు..కళలుగా వెలిశాయి
కన్నెగుండియలోన..గమకాలు తెలిశాయి
ఆఆఆఆఆఆఆఆఆ..
కన్నెగుండియలోన గమకాలు తెలిశాయి
సన్నసన్నగ వలపు సంగతులు వేశాయి
ఈ వీణ పలికించు ఎన్నిరాగాలో
నాలోన పులకించు ఎన్నిభావాలో
ఈ వీణ పలికించు ఎన్నిరాగాలో
చరణం::2
మోహనాలాపించ..మోహమే ఆపినది
కళ్యాణి లోలోన..కదలాడుతున్నది
మోహనాలాపించ..మోహమే ఆపినది
కళ్యాణి లోలోన..కదలాడుతున్నది
శ్రుతి కలిపి జతకలిపి..సొక్కులెరిగినవాడు
తోడైననాడే..నే తోడిపాడేదీ
ఈ వీణ పలికించు..ఎన్నిరాగాలో
నాలోన పులకించు..ఎన్నిభావాలో
ఈ వీణ పలికించు..ఎన్నిరాగాలో
చరణం::3
యిన్ని రాగాలు యీ..ఎదలోన దాచినది
ఏ మధురమూర్తికో..ఏమమత పంటకో
యిన్ని రాగాలు యీ..ఎదలోన దాచినది
ఏ మధురమూర్తికో..ఏమమత పంటకో
రాగమాలికలల్లి..రానున్న ప్రభువుకై
రాగమాలికలల్లి..రానున్న ప్రభువుకై
వేచియున్నది వీణ..కాచుకున్నది చాన
ఈ వీణ పలికించు..ఎన్నిరాగాలో
నాలోన పులకించు..ఎన్నిభావాలో
ఈ వీణ పలికించు..ఎన్నిరాగాలో
ఈ తరం మనిషి --1977
సంగీతం::చక్రవర్తి
రచన::ఆరుద్ర
గానం::సుశీల,బాలు
అహ్హా..
నవ నవ లాడే లేత జవరాలు చెవిలో ఏదో చెప్పింది
ఊహకు అందని ఆనంద౦ తో ఉక్కిరి బిక్కిరి చేసింది
ఓ మై డార్లింగ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ
అహ్హా..
నవ నవ లాడే లేత జవరాలు చెవిలో ఏదో చెప్పింది
ఊహకు అందని ఆనంద౦ తో ఉక్కిరి బిక్కిరి చేసింది
ఓ మై డార్లింగ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ
ఎర్రని పెదవుల మీదా..తెల్లని నవ్వుంది
తెల్లని నవ్వుల లోనా..నల్లని వలపుంది
ఎర్రని పెదవుల మీదా తెల్లని నవ్వుంది
తెల్లని నవ్వులలోనా చల్లని వలపుంది
చల్లని వలపు నాలో వెచ్చగా వెచ్చగా మారి
ఏదో అల్లరి చేస్తుంది ఎంతో తొందర పెడుతుంది
ఎహే...
నవ నవ లాడే లేత జవరాలు చెవిలో ఏదో చెప్పింది
ఊహకు అందని ఆనంద౦ తో ఉక్కిరి బిక్కిరి చేసింది
ఓ మై డార్లింగ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ
పగలే వెన్నెల కాసీ పండగ చేస్తుంది
విరిసిన పువ్వుల తోటా విందుల చేస్తుంది
పగలే వెన్నెల కాసీ పండగ చేస్తుంది
విరిసిన పువ్వుల తోటా విందుల చేస్తుంది
చేయి చేయి చేర్చి చిలకా గోరింకల్లె
మనసు మనసు కలపాలి
మల్లెల చాటుకు పోవాలి
అహ్హా..
నవ నవ లాడే లేత జవరాలు చెవిలో ఏదో చెప్పింది
ఊహకు అందని ఆనంద౦ తో ఉక్కిరి బిక్కిరి చేసింది
ఓ మై డార్లింగ్ ఐ లవ్ యూ హా ఐ లవ్ యూ
ఐ లవ్ యూ ఐ లవ్ యూ
ఐ లవ్ యూ ఐ లవ్ యూ
O my darling i love you i love you
O my darling i love you i love you
Labels:
Hero::Sobhanbabu,
P.Suseela,
SP.Baalu,
ఈ తరం మనిషి --1977
Subscribe to:
Posts (Atom)