Tuesday, April 19, 2011

పెళ్ళికానుక--1960::యదుకుల కాంభోజి::రాగం (పహాడి హిందుస్తాని)





సంగీతం::AM.రాజ
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల,AM.రాజ

యదుకుల కాంభోజి::రాగం
(పహాడి హిందుస్తాని)

వాడుక మరచెదవేల నను వేడుక చేసెదవేల
నిను చూడని దినము నాకోక యుగము
నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము

వాడుక మరువను నేను నిను వేడుక చెయగ లేను
నిను చూడని క్షణము నాకొక దినము
నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సంధ్య రంగుల చల్లని గాలుల
మధుర రాగము మంజుల గానము
సంధ్య రంగుల చల్లని గాలుల
మధుర రాగము మంజుల గానము
తేనె విందుల తీయని కలలు మరచి పోయిన వేళ
ఇక మనకీ మనుగడ ఏల
ఈ అందము చూపి డెందము వూపి
ఆశ రేపెద వేల ఆశ రేపెదవేల
ఓ ఓ ఓ సంధ్య రంగులు సాగినా చల్ల గాలులు ఆగినా
సంధ్య రంగులు సాగినా చల్ల గాలులు ఆగినా
కలసి మెలసిన కన్నులలోన....
కలసి మెలసిన కన్నులలోన మనసు చూడగ లేవా
మరులు తోడగ లేవా


వాడుక మరువను నేను నిను వేడుక చెయగ లేను
నిను చూడని క్షణము నాకొక దినము
నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కన్నుల ఇవి కలల వెన్నెల
చిన్నె వన్నెల చిలిపి తెన్నుల
కన్నుల ఇవి కలల వెన్నెల
చిన్నె వన్నెల చిలిపి తెన్నుల
మనసు తెలిసి మర్మమేల
ఇంత తొందర ఏలా
ఇటు పంతాలాడుట మేలా
నాకందరి కన్నా ఆశలు వున్నా
హద్దు కాదనగలనా హద్దు కాదనగలనా

వాడని నవ్వుల తోడ
నడయాడెడు పువ్వుల జాడ
అనురాగము విరిసి లొకము మరచి
ఏకమౌదము కలసీ ఏకమౌదము కలసి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

పెళ్ళికానుక--1960::మాండ్::రాగం





















సంగీతం::AM.రాజ
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల,AM.రాజ
మాండ్::రాగం 


కన్నులతో పలకరించు వలపులు

ఎన్నటికి మరువరాని తలపులు
కన్నులతో పలకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు
రెండు ఏకమై..ఒహొ
ప్రేమే లోకమై..అహా
నామది పాడే పరాధీనమై..అలాగా
కన్నులతో పలకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు

చల్లని వేళ మల్లెల నీడ చక్కని దొంగ దాగెనట
చల్లని వేళ మల్లెల నీడ చక్కని దొంగ దాగెనట
దారులకాచే సమయము చూచి దాచిన ప్రేమ దోచెనట
మరలా వచ్చెను మనసే ఇచ్చెను
మరలా వచ్చెను మనసే ఇచ్చెను
అతనే నీవైతే ఆమే నేనట..నిజంగా
ఉం..ఉం..

కన్నులతో పలకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు

నల్లని మేఘం మెల్లగ రాగ నాట్యము నెమలి చేసినది
నల్లని మేఘం మెల్లగ రాగ నాట్యము నెమలి చేసినది
వలచినవాడు సరసకురాగ ఎంతో సిగ్గు వేసినది
తనివితీరా తనలో తానే
తనివితీరా తనలో తానే
మనసే మురిసింది పరవశమొందగా
ఐ సీ..

కన్నులతో పలకరించు వలపులు..
ఎన్నటికి మరువరాని తలపులు
రెండు ఏకమై..ప్రేమే లోకమై..
నామది పాడే పరాధీనమై
కన్నులతో పలకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు

పెళ్ళికానుక--1960::కల్యాణి::రాగం





సంగీతం::AM.రాజ
రచన::ఆత్రేయ
గానం::జిక్కి

కల్యాణి::రాగం
పులకించని మది పులకించు వినిపించని కధ వినిపించు
అనిపించని ఆశల నించు మనసునే మరపించు
గానం మనసునే మరపించు
పులకించని మది పులకించు వినిపించని కధ వినిపించు
అనిపించని ఆశల నించు మనసునే మరపించు
గానం మనసునే మరపించు

రాగమందనురాగమొలికి రక్తి నొసగును గానం
రాగమందనురాగమొలికి రక్తి నొసగును గానం
రేపురేపను తీపి కలలతో రూపమిచ్చును గానం
చెదరి పోయే భావములను చేర్చి కూర్చును గానం
జీవమొసగును గానం మది చింత బాపును గానం

పులకించని మది పులకించు వినిపించని కధ వినిపించు
అనిపించని ఆశల నించు మనసునే మరపించు
గానం మనసునే మరపించు

వాడి పోయిన పైరులైనా నీరు గని నర్తించును
వాడి పోయిన పైరులైనా నీరు గని నర్తించును
కూలిపొయిన తీగలైన కొమ్మ నలమి ప్రాకును
కన్నె మనసు ఎన్నుకున్న తోడు దొరికిన మురియు
దోర వలపే కురియు మది దోచుకొమ్మని పిలుచు

పులకించని మది పులకించు వినిపించని కధ వినిపించు
అనిపించని ఆశల నించు మనసునే మరపించు
ప్రేమ మనసునే మరపించు

పెళ్ళికానుక--1960





సంగీతం::AM.రాజ
రచన::సముద్రాల
గానం::P.సుశీల

తీరెనుగా నేటితోనే తీయని గాధా..ఆఆ
మిగిలిపోయే నీ మదిలో..మాయనిబాధా..ఆ..2

రాగములపంటజూడ కోరినవేళా..
త్యాగములే..మీరరాని సోధనలాయే..2
బలి ఆయె నీదు ప్రేమ పాషాణికీ
కరిగీపోయావే కర్పూరమై..

తీరెనుగా నేటితోనే తీయని గాధా..
మిగిలిపోయే నీ మదిలో..మాయనిబాధా

పెళ్ళికానుక--1960




సంగీతం::AM.రాజ
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల,బృందం

వగనాలి వదనాన మాంగల్యకళలేను
పసిడివన్నియలెలు ఏ పసుపుగాజులు
ముత్తైదువులు తీర్చి మురిసేటి మెరిసేటి
కుంకుమారంగుతో..కులుకు నీ గాజులూ
నిత్యకల్యాణమ్ము..పచ్చతోరణమనీ..2
ఆశీస్సులిచ్చు నీ పచ్చనీ గాజులూ..
మర్మమేమీలేని మీ మనసులకు..ఈడుగా
మల్లెపూవులవంటి తెల్లనీ గాజులూ..2

అక్కయ్యకు శ్రీమంతం..చక్కని బావకు ఆనందం
అక్కయ్యకు శ్రీమంతం..చక్కని బావకు ఆనందం
ఊరంతా ఉత్సాహం..వచ్చారు అందరూ పేరంటం
తందానే..తనతానే..దిత్తానె తయతాన తందానె

మురిపించి ముద్దులొలికించు కొడుకు
మూడునెలలకే పుడతాడు..2
పండులాగ పూలచెండులాగ పసిడికొండలాగ
ఇంట వెలిసేడు
అక్కయ్యకు శ్రీమంతం..చక్కని బావకు ఆనందం
తందానే..తనతానే..తానతానన తయతాన తందానె

అన్నమూ పున్నెమూ ఎరుగనివానిలా
అల్లుడు ఉన్నాడు నంగనాచిలా..2
ఆ..అల్లుడు ఉన్నాడు నంగనాచిలా
ఆ బుంగమూతితోడు..దొంగచూపు చూడు..
సంగతి అడగవె చినదానా..తన సంగతి అడగవె చినదానా..
అదినాకు తెలియదు నీకు తెలియదు..
ఏమిట ఇద్దరి గుసగుసలూ..
అది కనుల భాషలే మనకు ఏలనే
కన్నెలెరుగని మర్మములూ..

అక్కయ్యకు శ్రీమంతం..చక్కని బావకు ఆనందం
ఉయ్యాలోయ్..జంపలా..ఉయ్యాలోయ్..జంపలా..
ఉయ్యాలోయ్..జంపలా..ఉయ్యాలోయ్..జంపలా..

ఉయ్యాలలూపి జోలల్లుపాడి ఉబ్బుబ్బిపోతుంది తల్లీ 2
నా ముత్యాలమూట ముద్దులతోటని..
ముప్పొద్దు మోస్తాడు తండ్రి..బాబును
ముప్పొద్దు మోస్తాడు తండ్రి..

అక్కయ్యకు శ్రీమంతం..చక్కని బావకు ఆనందం
ఊరంతా ఉత్సాహం..వచ్చారు అందరూ పేరంటం
తందానే..తనతానే..తానతానన తయతాన

పెళ్ళికానుక--1960::రాగేశ్రీ::రాగం



రాగం::::రాగేశ్రీ::

సంగీతం::AM.రాజ
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల


ఆడే పాడే పసివాడ ఆడేనొయి నీతోడ
ఆనందం పొంగేనోయి దీపావళి
ఇంటింట వెలుగు దీపాల మెరుగు
ఎనలేని వేడుకరా..ఆ..ఆ..
ఎనలేని వేడుకరా..

చిరునవ్వు వెన్నెల్లు చిలికేటి వాడ
అరుదైన చిరుముద్దు అరువీయరారా
చిరునవ్వు వెన్నెల్లు చిలికేటి వాడ
అరుదైన చిరుముద్దు అరువీయరారా
నా మదిలో నీకు నెలవే కలదు
నా మదిలో నీకు నెలవే కలదు
బదులే నాకు నీవీయవలదు
నీపై మేము నిలిపిన ఆశలు నిజమైన చాలునురా
ఆ..ఆ..నిజమైన చాలునురా...

చిన్నారి జయమంచు మ్రోగె పటాసు
చిటపటమని పూలు చిమ్మే మతాబు
చిన్నారి జయమంచు మ్రోగె పటాసు
చిటపటమని పూలు చిమ్మే మతాబు
నీరూపమే ఇంటి దీపము బాబు
నీరూపమే ఇంటి దీపము బాబు
మాలో పెరిగే మమతవు నీవు
మంచనిపించి మము మురిపించిన
మరె వేరే కోరమురాఆ..ఆ..
మరె వేరే కోరమురా..

ఆడే పాడే పసివాడ ఆడేనొయి నీతోడ
ఆనందం పొంగేనోయి దీపావళి
ఇంటింట వెలుగు దీపాల మెరుగు
ఎనలేని వేడుకరా ఆ ఆ
ఎనలేని వేడుకరా