Thursday, May 15, 2008

సోగ్గాడు--1975



సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::SP.బాలు,P.సుశీల

అవ్వబువ్వ కావాలంటే
అయ్యేదేన అబ్బాయీ
అబ్బాయీ ఓ..అబ్బా
యీ

అవ్వబువ్వ కావాలంటే
అయ్యేదేన అబ్బాయీ
అబ్బాయీ ఓ..అబ్బాయీ


అయ్యేదాకా...ఆ...
ఆగావంటే...ఆ...
అయ్యేదాక ఆగావంటే
అవ్వైపోతవ్ అమ్మాయీ
అమ్మాయీ...ఈ...
అయ్యేదాక ఆగావంటే
అవ్వైపోతావ్ అమ్మాయీ
అమ్మాయీ ఓ..అమ్మాయీ


లాలాలా...
మ్మ్...హు...మ్మ్ హు...
లాలాలా
మ్మ్...హు...మ్మ్ హు...


అయ్యో పాపం అత్తకొడుకువని
అడిగినదిస్తా నన్నాను..ఆ...
అయ్యో పాపం అత్తకొడుకువని
అడిగినదిస్తా నన్నాను
అహ్..వరసావావి వుందికదా అని
నేనూ ముద్దే..అడిగాను
నాకు ఇద్దామని వుందీ
కాని అడ్డేంవచ్చిందీ
నాకు ఇద్దామని వుందీ
కాని అడ్డేంవచ్చిందీ
అంతటితో నువ్ ఆగుతావని
నమ్మకమేముందీ...
అబ్బాయీ...ఓ...అబ్బాయ్యీ


అయ్యేదాక ఆగావంటే అవ్వైపోతవే అమ్మాయీ
అమ్మాయీ...ఓ...అమ్మాయీ


బస్తీకెళ్ళే మరదలుపిల్లా
తిరిగొస్తావా మళ్ళీ ఇలా
ఇంతకన్నా ఎన్నో ఎన్నో
సొగసులు ఎదిగీవస్తాను


బస్తీకెళ్ళే మరదలుపిల్లా
తిరిగొస్తావా మళ్ళీ ఇలా
ఇంతకన్నా ఎన్నో ఎన్నో
సొగసులు ఎదిగీవస్తాను
ముడుపుకట్టుకొని తెస్తావా
మడికట్టుకొని నువ్ వుంటావా
ముడుపుకట్టుకొని తెస్తావా
మడికట్టుకొని నువ్ వుంటావా
ఈలకాచి నక్కలపాలు
కాదని మాటిస్తావా
అమ్మాయీ..ఓ..అమ్మాయీ


అవ్వబువ్వ కావాలంటే
అయ్యేదేన అబ్బాయీ
అబ్బాయీ ఓ..అబ్బాయీ



పల్లెటూరి బావకోసం
పట్టాపుచ్చుకొని వస్తాను
పచ్చపచ్చని బ్రతుకే నీకు
పట్టారాసి ఇస్తాను


పల్లెటూరి బావకోసం
పట్టాపుచ్చుకొని వస్తాను
పచ్చపచ్చని బ్రతుకే నీకు
పట్టారాసి ఇస్తాను
సమకానికి నువ్ వస్తావా
కామందుగ నివ్ వుంటావా
సమకానికి నువ్ వస్తావా
కామందుగ నివ్ వుంటావా
చిత్తులేని కట్టేలేని
సేద్యం చేస్తానంటావా
అబ్బాయీ..ఓ..అబ్బాయీ


అవ్వబువ్వ కావాలంటే
అయ్యేదేన అబ్బాయీ
అబ్బాయీ ఓ..అబ్బాయీ


అయ్యేదాక ఆగావంటే
అవ్వైపోతవే అమ్మాయీ
అమ్మాయీ...ఓ...అమ్మాయీ

సోగ్గాడు--1975



పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల


ఉహ్ ....అహా...
ఒలెఒలెఒలెఒలెఒలెఓలమ్మీ
హుప్ అంటేనే ఉలిక్కిపడ్డవే
ఒళ్ళంతాను వొంపులు తిరిగావే


ఒరెఒరెఒరెఒరె ఓరయ్యో...
హుప్ అంటేనే వులిక్కిపడలేదూ
నీ ఊపిరి తగిలి వొంపులుతిరిగానూ..


ఒలెఒలెఒలెఒలెఒలెఓలమ్మీ
హుప్ అంటేనే ఉలిక్కిపడ్డవే
ఒళ్ళంతాను వొంపులు తిరిగావే


ఒరెఒరెఒరెఒరె ఓరయ్యో...
హుప్ అంటేనే వులిక్కిపడలేదూ
నీ ఊపిరి తగిలి వొంపులుతిరిగానూ..


ఒంపు ఒంపులో వుంది నన్ను
చంపుకొ తినెంత వయ్యారం
ఆవయ్యారంలో వుంది మళ్ళి
బ్రతికించెంత శింగారం


నీ ఊపిరిలోనే వుంది
నన్ను వుడికించేంత వెచ్చదనం
అయ్యో...
నీ ఊపిరిలోనే వుంది
నన్ను వుడికించేంత వెచ్చదనం
ఆ వెచ్చదనంలో వుంది
వుడుకును తగ్గించేంత చల్లదనం


ఒలెఒలెఒలెఒలెఒలెఓలమ్మీ
హుప్ అంటేనే ఉలిక్కిపడ్డవే
ఒళ్ళంతాను వొంపులు తిరిగావే !!

కొప్పునున్నగ దువ్వి
దాంట్లో గొబ్బిపూవునే తురిమావు
ఆ గొబ్బిపూల సందిట్లో నేన్
గండుతుమ్మెదై తిరిగాను


కొప్పునున్నగ దువ్వి
దాంట్లో గొబ్బిపూవునే తురిమావు
ఆ గొబ్బిపూల సందిట్లో నేన్
గండుతుమ్మెదై తిరిగాను


తిరిగి తిరిగి రేపట్టి
నువ్ పొలముదున్నుతువుంటావూ...
హేహేయ్..
తిరిగి తిరిగి రేపట్టి
నువ్ పొలముదున్నుతువుంటావూ...
అది తలుచుకొంటు నే ఇంట్లో
రాతిరి ఎప్పుడెప్పుడని వుంటాను


ఒరెఒరెఒరెఒరె ఓరయ్యో...
హుప్ అంటేనే వులిక్కిపడలేదూ
మరి!!!
నీ ఊపిరి తగిలి వొంపులుతిరిగానూ
..

చెంగు చుట్టగా చుట్టి
చేత్తో గంపను పట్టుకొని నడిచేవు
ఆ గుట్టుగ వున్న అందాలూ..
నువ్వే రట్టుచేసుకొంటున్నావు

పట్టపగలే గుట్టంతా
అయినా నీకూ నాకూ తెలియనిదా
రట్టుకాని కాపురము వెయ్యి
పుట్టుకలైన కోరే వరము


ఒలెఒలెఒలెఒలెఒలెఓలమ్మీ
అహా..అహా..
హుప్ అంటేనే ఉలిక్కిపడ్డవే
ఒహో...ఓహో...
ఒళ్ళంతాను వొంపులు తిరిగావే
అహా...అహా...!!

ఒరెఒరెఒరెఒరె ఓరయ్యో...
లలాలలా...
హుప్ అంటేనే వులిక్కిపడలేదూ
అహా..అహా...!!!
నీ ఊపిరి తగిలి వొంపులుతిరిగానూ..
ఏహే...ఏహే...!
!

సోగ్గాడు--1975



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల

ఏడుకొండలవాడ వేంకటేశా
ఓరయ్యో ఎంతపని చేసావు తిరుమలేశా
చెట్టుమీద కాయనూ సముద్రంలో ఉప్పును
కలిపినటే కలిపావు శ్రీనివాసా


ఏడుకొండలవాడ వేంకటేశా
ఓరయ్యో ఎంతపని చేసావు తిరుమలేశా
చెట్టుమీద కాయనూ సముద్రంలో ఉప్పును
కలిపినటే కలిపావు శ్రీని
వాసా

ఆ...ఆ...ఆ...ఆ...
ఆ...ఆ...ఆ...ఆ...
ఏడుకొండలవాడ వేంకటేశా
ఓరయ్యో ఎంతపని చేసావు తిరుమలేశా
చెట్టుమీద కాయనూ సముద్రంలో ఉప్పును
కలిపినటే కలిపావు శ్రీనివాసా


చిలకమ్మ తట్టితే తలుపుతీసా
మళ్ళి చేయ్ జారిపోకుండ కట్టేసా
చిలకమ్మ తట్టితే తలుపుతీసా
మళ్ళి చేయ్ జారిపోకుండ కట్టేసా
ఆ...గోరింక గూటిలోకి వచ్చేసా
దాచివున్నదంత మనసిచ్చి ఇచ్చేసా
గోరింక గూటిలోకి వచ్చేసా
దాచివున్నదంత మనసిచ్చి ఇచ్చేసా
సోగ్గాణ్ణి కౌగిట్లో చుట్టేసా
సోగట్టిలిక వదలనని మొండికేసా
సోగ్గాణ్ణి కౌగిట్లో చుట్టేసా
సోగట్టిలిక వదలనని మొండికేసా


వేంకటేశా...తిరుమలేశా...
తిరుమలేశా... శ్రీనివాసా
ఏడుకొండలవాడ వేంకటేశా
ఓరయ్యో ఎంతపని చేసావు తిరుమలేశా
చెట్టుమీద కాయనూ సముద్రంలో ఉప్పును
కలిపినటే కలిపావు శ్రీనివాసా


సిగ్గుతెర నేటితో ఒగ్గేసా
పూల చెండల్లే నీచేయి కొచ్చేసా
సిగ్గుతెర నేటితో ఒగ్గేసా
పూల చెండల్లే నీచేయి కొచ్చేసా
ఆ...ఒళ్ళంత ముద్దులతో ముద్దరేసా
నీవు ఓపకుంటే పెనవేసి ఒకటిచేసా
ఒళ్ళంత ముద్దులతో ముద్దరేసా
నీవు ఓపకుంటే పెనవేసి ఒకటిచేసా
కన్నెతనం పక్కమీద పరిచేసా
దాన్ని కడదాక కాస్తానని ఒట్టేసా
హోయ్..కన్నెతనం పక్కమీద పరిచేసా
దాన్ని కడదాక కాస్తానని ఒట్టేసా


వేంకటేశా...తిరుమలేశా...
తిరుమలేశా... శ్రీనివాసా
ఏడుకొండలవాడ వేంకటేశా
ఓరయ్యో ఎంతపని చేసావు తిరుమలేశా
చెట్టుమీద కాయనూ సముద్రంలో ఉప్పును
కలిపినటే కలిపావు శ్రీనివా
సా