Tuesday, December 17, 2013

సతీ అనసూయ--1971
























సంగీతం::P.ఆదినారాయణరావు
రచన::C.నారాయణరెడ్డి
గానం::P. సుశీల 
తారాగణం::కాంతారావు,జమున,శోభన్ బాబు,శారద,రాజనాల,రాజబాబు,మీనాకుమారి,హలం 

:::

దినకరా ! జయకరా!
పావనరూపా ! జీవనధాతా !

ప్రథమకిరణం సోకిననాడే 
ప్రాణవల్లభుని పొందితి గాదా 
మంగళకరములు నీ కిరణమ్ములు 
మాంగల్యమునే హరియించునా!
దినకరా ! జయకరా!
పావనరూపా ! జీవనధాతా !

లోకములన్నీ వెలిగించు దేవా!
న కనువెలుగే తొలగించేవా!
కరుణా సింధూ! కమలబంధూ !
ఉదయించకుమా ఓ సూర్యదేవా!

చండకిరణ బ్రహ్మాండ కటోహోద్దండ తమో హరణా 
సకల చరాచర నిఖిల జగజ్జన చైతన్యోద్దరణా
ద్వాదశాదిత్య రూపా! రోదసీ కుహర దీపా!
ఉదయించకుమా! ఉదయించకుమా!