సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::V.రామకృష్ణ,J.V.రాఘవులు
తారాగణం::అక్కినేని, లత,రాజబాబు,అల్లు రామలింగయ్య,నాగభూషణం,ధూళిపాళ,
నూతన్ ప్రసాద్, సూర్యకాంతం
భద్రాచల క్షేత్రమహిమ::-హరికథ
పల్లవి::
మాతల్లి గోదారి చూపంగ దారి
పడవెక్కి భద్రాద్రి పోదామా
భద్రాద్రి రాముణ్ణి చూదామా
భద్రగిరి మహిమలే విందామా
భద్రగిరి మహిమలే విందామా
ఏవిటోయ్ ఆ మహిమలు
శ్రీమద్రమారమణ గోవిందో హరి
భక్తులారా సుజనులారా
సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు
అరణ్యవాస సమయంబున పావన గోదావరీ తీరంబున
ఒకానొక గిరిని పరికించి
దానిపై సుంత విశ్రమించినంత ఆ కంధరమ్మొక
సుందరపురుషాకృతి దాల్చి..ఏమనినాడనదా
ధన్యుడనైతిని ఓ రామా
నా పుణ్యము పండెనుశ్రీరామా
ధన్యుడనైతిని ఓ రామా
నా పుణ్యము పండెనుశ్రీరామా
మేరుగిరీంద్రుని పుత్రుడను
నీ రాకకు చూచే భద్రుడనూ
నారీశిరోమణి సీతమ్మతో మీరు
నా శిరమున నెలకొన వేడెదనూ
కారుణ్యాలయ కామిత మీడేర్చ
కలకాలము నిను కొలిచెదనూ
ధన్యుడ ధన్యుడ ధన్యుడనైతిని ఓ రామా
నా పుణ్యము పండెనుశ్రీరామా
అని భద్రుడుప్రార్థించిన స్వామివారేమన్నరనగా
వత్సా..నీ ముద్దు చెల్లించుటకు ముందు
మా తండ్రిమాట చెల్లించవలయును
తదా ఉత్తరోత్తర కాలంబున పునర్దర్శనంబు ఇచ్చువాడను
అని వెడలిపోయిరి...అంతట
వెడలిన రాముడు వెలదిని బాసి ఇడుములలో బడెనూ
కడలికి వారధి గట్టి కఠినాత్ముడు దనుజుని గొట్టి
కలికి చెరను పోగొట్టి కనువిందుగ పట్టము గట్టి
బంధుమిత్రుల తలచుట బట్టి భక్తుని మాట మరిచాడు
రాముడు పరమావతారమ్ము విడిచాడు
వైకుంఠవాసమ్ము చేరాడు
శ్రీమద్రమారమణ గోవిందో హరి
కాని భూలోకమున భద్రుడు
ఎన్నియుగము లైనా ఎదురుచూస్తూ
ఏ విధిముగా శోకించినాడనగా
వచ్చెదనంటివి రామయ్యా
వరమిచ్చెదనంటివి రామయ్యా
వచ్చెదనని శలవిచిన పిమ్మట
మోసపుచ్చుట ఇచ్చట తగదయ్యా
వచ్చెనుకద నీ మాటకు మచ్చా
అది రానిచ్చెదనా నిను పోనిచ్చెదనా
హెచ్చరింతు నువు మెచ్చెడి తపమున
నిచ్చలు జపించి ఖచ్చితముగా
ఓ సచ్చరిత్రనిన్నిచ్చటకీడ్చెద వచ్చెదనంటివి రామయ్యా
వరమిచ్చెదనంటివి రామయ్యా
అని శపథంబు చేసి మహోగ్ర తపస్సు నాచరించగా
సకల సురాసుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు
సంక్షోభమ్మునొందిరి అపుడు కదలెను
శ్రీ మహావిష్ణువు కదలెను భక్తసహిషువు
సుదతి శ్రేదేవికి సుంతయినా తెలుపక
శుభ శంఖచక్రాల కరముల దాల్చక
సుదూరమౌ భూలోకమునకు
సుపర్ణుని భుజమైన ఏక్కకా
వడివడి కదలెను శ్రీమహావిష్ణువు కదలెను
భక్తసహిషువు శ్రీమద్రమారమణ గోవిందో హారి
గజేంద్రమోక్ష సన్నివేశంబుకై వడి
స్వామి వారు ఆ విధమ్ముగాకదలగా
తనవెంటన్ సిరిలచ్చివెంట నవరోధవ్రాతమున్
దానివెనుకను పక్షీంద్రుడు వానిపొంతను
ధను:కౌబోదదీ సంఖ చక్ర నికాయంబునూ
హుటాహుటిని రాగా తొందరయందు అపసవ్యంబుగా
ఆయుధములు ధరించి..స్వామి
వారు భద్రునకు దర్శనంబీయ
ఆ భక్త శిఖామణి ఏమన్నాడు
ఏవరివయ్య స్వామి ఏను నిన్నెరుగను
హరిని నేనటంచు అనగనేల
నాడు నన్నుబ్రోచు నారాముడవునావు
నాటి రూపుచూప నమ్మగలను
అని భద్రుడుకోరగా శ్రీమహావిష్ణువు
తొలినాటి రామావతారమ్ము ప్రదర్శించెను
అపసవ్యమ్ములైన ఆయుధమ్ములు ఆతీరుగనే చేతుల
నెల్చెను భద్రుడు మహదానందబరితుడై
ఈ తీరుగనె ఇచ్చట వెలయుము
ఇనకులసోమా రామా
భూతలమున ఇది సీతారాముల
పుణ్యక్షేత్ర లలామా శభాష్
అని విన్నవించగా స్వామివారు ఆ తీరు గనే వెలసిర్
ఆ భద్రుడే భద్రాద్రి అయ్యెను
భద్రగిరి వాసుడైన శ్రీరామచంద్రుడు
ఎండకు ఎండి వానకు తడిసి నీడకు తపించినవాడై
ఒకనాడు శబరి అంశమునజన్మించినదైన
పోకల దమ్మక్క అను భక్తురాలి
స్వప్నమున సాక్షాత్కరించి ఆవైనమ్ము తెలుపగా
ఆయన భద్రగిరినంతయుగాలించగా
స్వామివారి దివ్యసుందరమూర్తికనిపించెను
కోరి కనిపించావా కోదండరామయ్యా
గుడికట్టలేని ఈ బడుగుపేదకు నీవు
కోరి కనిపించావా కోదండరామయ్యా
గుడికట్టలేని ఈ బడుగుపేదకు నీవు
చక్రవర్తి కుమారుడా ఇంకో చక్రవర్తికి అల్లుడా
భూచక్రమేలిన సార్వభౌమా
విధివక్రించి నీకే వాసమ్ముకరువా
తాటాకు పందిరే తాటకాంతక నీకు భవనమయ్యా
తాటిపండ్లే ఓ మేటి రాజకుమార
విందులయ్యా నీకు విందులయ్యా
అని పోకల దమ్మక్క నిత్యము సేవించుకొనెను
తదుత్తర కాలంబున రామదాసుగా
ప్రఖ్యాతుడైన కంచెర్ల గోపన్న
ఏవిధముగా ఆలయనిర్మాణము గావించెననగా
ఏవిధముగానా అప్పుజేసి
తప్పు నాయనా గోపన్న చరితము లోకవిఖ్యాతము
తదీయసంస్మరణము మంగళదాయకము
రామచంద్ర్రయ జనక రాజజామనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
సీతా రామచంద్ర్రయ జనక రాజజామనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
మహిత మంగళం మహిత మంగళం
మహిత మంగళం మహిత మంగళం
జై శ్రీమద్రమారమణ గోవిందో హరి: