Saturday, June 13, 2015

చెట్టు కింద ప్లీడరు--1989సంగీతం::ఇళయరాజా 
రచన::వేటూరి 
గానం::S.P.బాలు,K.S.చిత్ర 
తారాగణం::రాజేంద్రప్రసాద్,కిన్నెర.

పల్లవి::

జిగిజిగిజిగిజ జాగేల..వనజ రావేల నారోజా 
జిగిజిగిజిగిజ ఓ బాలరాజ..నీదేర ఈ రోజా 
నీదేలే వలపుల వైభోగం..నాదేలే మమతల మణిహారం
ఓయ్..జిగిజిగిజిగిగిజ జాగేల..వనజ రావేల నారోజా 
జిగిజిగిజిగిజ ఓ బాలరాజ..నీదేర ఈ రోజా 

చరణం::1

లాలీ..లాలీ ప్రేమరాణీ..అనురాగంలోనే సాగిపోనీ 
మేనలోన చేరుకోని..సురభోగాలన్నీ అందుకోనే 
పెదవి పెదవి కలవాలి..ఎదలో మధువే కొసరాలి 
బ్రతుకే మమతై నిలవాలి..మురళి స్వరమై పలకాలి 
ప్రేయసి పలుకే మాణిక్య వీణ..ప్రేమావేశంలోన
కౌగిలి విలువే వజ్రాలహారం..మోహావేశంలోన 
రావే రావే..రసమందారమా
జిగిజిగిజిగిజ జాగేల..వనజ రావేల నారోజా 
జిగిజిగిజిగిజ ఓ బాలరాజ..నీదేర ఈ రోజా 
నీదేలే వలపుల వైభోగం..నాదేలే మమతల మణిహారం 

చరణం::2 

స్నానాలాడే మోహనాంగి..ఇక సొంతం కావే శొభనాంగి
దూరాలన్నీ తీరిపోనీ..రస తీరాలేవో చేరుకోని 
తనువు తనువు కలిసాక..వగలే ఒలికే శశిరేఖ
ఎగసే కెరటం ఎదలోన..సరసం విరిసే సమయాన 
ముందే నిలిచే ముత్యాల శాన..పువ్వై నవ్వే వేళ
రమ్మని పిలిచే రత్నాల మేడ..సంధ్యారాగం లోన 
వలపే..పలికే..ఒక ఆలాపన 
జిగిజిగిజిగిజ జాగేల..వనజ రావేల నారోజా 
జిగిజిగిజిగిజ ఓ బాలరాజ..నీదేర ఈ రోజా 
నీదేలే వలపుల వైభోగం..నాదేలే మమతల మణిహారం

చైతన్య--1991సంగీతం::ఇళయరాజా 
రచన::వేటూరి 
గానం::S.P.బాలు, S.జానకి 
తారాగణం::నాగార్జున,గౌతమి

పల్లవి::

పాప ఈడు గోలా పాట పేరు జోలా
ఊగుతోంది బాలా యవ్వనాల డోలా
నీవు వేణువైతే నేను ఊపిరౌతా
మోగాలీ ఎదలో ఈలా
మోహాలా సరిరాగాలా

be happy happy all the time
be happy happy all the time
be happy happy all the time
be happy happy all the time

చరణం::1

ఏదో సాగిందీ చిలిపి కథా
ఓటమి గెలుపైనా వలపు కథా
కునుకే రాకున్నా కనుల కథా
ఉడికే పరువాల పడుచు కథా
పూసేటి వేసంగి పూరేకులో
రాస్తాను నీ పేరు తేనెలతో
పెన్నేటి ఇసుకమ్మ తీరాలలో
వేస్తాను పాదాలు నీ జతలో
పాషాణమైపోకు వైఢూర్యమా
పాప ఈడు గోలా పాట పేరు జోలా
ఊగుతోంది బాలా యవ్వనాల డోలా

చరణం::2

పాటే కారాదు బ్రతుకు సుమా
అతికే మనసంటూ లేదు సుమా
చేతులు కలిపింది చెలిమి సుమా
ఎగిరే నా ప్రేమా పావురమా
ఆనాటి స్నేహాల వాకిళ్ళలో
ఈనాడు వేచేను దోసిలితో
కాలాలు దాటాను కౌగిళ్ళలో
స్వర్గాలు చూడాలి నీ ఒడిలో
శిల నీవు కాబోకు శృంగారమా

పాప ఈడు గోలా పాట పేరు జోలా
ఊగుతోంది బాలా యవ్వనాల డోలా
నీవు వేణువైతే నేను ఊపిరౌతా
మోగాలీ ఎదలో ఈలా
మోహాలా సరిరాగాలా

be happy happy all the time
be happy happy all the time
be happy happy all the time
be happy happy all the time

చైతన్య--1991సంగీతం::ఇళయరాజా 
రచన::వేటూరి 
గానం::S.P.బాలు, S.జానకి 
తారాగణం::నాగార్జున,గౌతమి

పల్లవి:: 

చచచాం చరచాం చచాంచచంచాంచా
చచచాం చరచాం చచాంచచంచాంచా
వయసే తొలి వసంతాలాడు..వాలు పొద్దుల్లో 
సొగసే చలిసరాగాలాడు..సందె ముద్దుల్లో 
మనసే ఒక సవాలైపోయె..మల్లె మొగ్గల్లో 
పిలుపే తొలి ఫిడేలైపోయె..పిల్ల సిగ్గుల్లో 
మనకొద్దీ వాయిదాలూ..పరువాలే జీవితాలూ 
కుర్రకారుల్లో..ఓఓఓ..కొత్త ట్యూన్సూ 
జార విడిచావా..ఆఆఆ..లేదు ఛాన్సూ 

వయసే తొలి వసంతాలాడు..వాలు పొద్దుల్లో 
సొగసే చలిసరాగాలాడు సందె..ముద్దుల్లో 

చరణం::1 

కవ్విస్తే ఖలేజాలు చూపే..కాళీ మార్కు యువతులం 
నవ్విస్తే సరోజాలు పూసే..వయ్యారాల వనితలం 
సూర్యున్నే హలో అంటాం..చంద్రున్నే ప్రియా అంటాం 
ఇంద్రున్నే ఛలో అంటాం..స్వర్గంలో మకాం వేస్తాం 
భామ తన్నింది ప్రేమ పుట్టింది..వలపుల క్రియల్లో 
వయసే తొలి వసంతాలాడు..వాలు పొద్దుల్లో 
సొగసే చలిసరాగాలాడు..సందె ముద్దుల్లో 

చరణం::2 

సరసంలో కులాసాలు చేసే..శృంగారాల పురుషులం..అహా 
సమరంలో భరోసాలు చూపే..ఝాన్సీ రాణి గురుతులం 
మానండీ యురేకాలూ..మాటల్లో మజాకాలూ 
ఎదిరిస్తాం తడాకాలూ..ఎగరేస్తాం పతాకాలూ 
యుగం మారింది జగం మారాలి..జనగణమనల్లో 
వయసే తొలి వసంతాలాడు వాలు..పొద్దుల్లో 
సొగసే చలిసరాగాలాడు..సందె ముద్దుల్లో 
మనసే ఒక సవాలైపోయె..మల్లె మొగ్గల్లో 
పిలుపే తొలి ఫిడేలైపోయె..పిల్ల సిగ్గుల్లో 
మనకొద్దీ వాయిదాలూ..పరువాలే జీవితాలూ 
కుర్రకారుల్లో..ఓఓఓ..కొత్త ట్యూన్సూ 
జార విడిచావా..ఆఆఆ..లేదు ఛాన్సూ