సంగీతం::ఆది నారాయణ రావ్
రచన:: దాశరథి
గానం::V.రామకౄష్ణ P.సుశీల
జాబిల్లి చూసేను నిన్ను నన్ను ఓయమ్మో..
నాకెంత సిగ్గాయే బావా బావా నను వీడలేవా
పొదరిల్లు పిలిచేను నిన్ను నన్ను ఓయబ్బో..
నీకింత సిగ్గేల బాలా రావా నను చేర రావా
ఆకాష మార్గాన అందాల మేఘాలు పెనవేసుకొన్నాయి చూడూ
చిగురాకు సరదాల చిరుగాలి సరసాలు గిలిగింతలాయేను నేడూ
అంద చందాలతో ప్రేమబంధాలతో జీవితం హాయిగా సాగనీ...
బాలా రావా నను చేర రావా
ఆ...ఆ...
ఆ కొమ్మపైనున్న అందాల చిలుకలు అనురాగ గీతాలు పాడేనూ
సిరిమల్లె ఒడిలోన చిన్నారి తుమ్మెదలు మైమరచి కలలందు కరిగేనూ
ముద్దుమురిపాలతో బావ రాగాలతో యవ్వనం పువ్వులా నవ్వనీ....
బావా బావా నను వీడలేవా
ఆ....ఆ....
బంగారు చెక్కిళ్ళ పొంగారు పరువాలు కొనగీటు మీటులే కోరేనూ...
నీలేత అధరాలు ఎంతెంత మధురాలు ఈనాడు నాసొంతమాయేనూ
దేవి దీవించెనూ స్వామి వరమిచ్చెనూ ఇద్దరం ఏకమౌదాములే...
బాలా బాలా నను చేర రావా
జాబిల్లి చూసేను నిన్ను నన్ను
ఓయమ్మో....
నాకెంత సిగ్గాయే బావా బావా నను వీడలేవా
పొదరిల్లు పిలిచేను నిన్ను నన్ను
ఓయబ్బో....
నీకింత సిగ్గేల బాలా రావా నను చేర రావా
ఆ....ఆ...హ..హా...హా...ఆ..
ఆ...ఆ...హా..హా...హా...ఆ...
ఆ....ఆ...హ..హా...హా...ఆ..
ఆ...ఆ...హా..హా...హా...ఆ...