Tuesday, May 15, 2012
పున్నమి నాగు--1980
సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు
పల్లవి::
పున్నమి రాత్రీ పూవుల రాత్రీ
వెల్లువ నాలో పొంగిన వెన్నెల రాత్రీ
పున్నమి రాత్రీ పూవుల రాత్రీ
వెల్లువ నాలో పొంగిన వెన్నెల రాత్రీ
చరణం::1
మగువ సోకులే మొగలి రేకులయి మత్తుగ పిలిచే రాత్రీ
మరుడు నరుడిపై మల్లెలు చల్లి మైమరిపించే రాత్రీ
ఈ వెన్నెలలో ఆ వేదనలో
ఈ వెన్నెలలో ఆ వేదనలో
నాలో వయసుకు నవరాత్రీ
కలగా మిగిలే కడ రాత్రీ
పున్నమి రాత్రీ పూవుల రాత్రీ
వెల్లువ నాలో పొంగిన వెన్నెల రాత్రీ
చరణం::2
కోడెనాగుకై కొదమనాగిని కన్నులు మూసే రాత్రీ
కామ దీక్షలో కన్నెలందరూ మోక్షం పొందే రాత్రీ
నా కౌగిలిలో ఈ రాగిణీతో
నా కౌగిలిలో ఈ రాగిణీతో
తొలకరి వలపుల తొలిరాత్రీ
ఆఖరి పిలుపుల తుదిరాత్రీ
పున్నమి రాత్రీ పూవుల రాత్రీ
వెల్లువ నాలో పొంగిన వెన్నెల రాత్రీ
Labels:
Hero::Chiranjeevi,
SP.Baalu,
పున్నమి నాగు--1980
Subscribe to:
Posts (Atom)