Thursday, August 12, 2010

ఇల్లు-ఇల్లాలు--1972


















సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::S.P.బా
లు

హాయిగ మత్తుగా ఆడవే అందాల భామా
ఆడాక చూపించు కాసింత ప్రేమా..2

మధువులు చిలికించె మైకం పొంగుతుంది నీలో
మైకం తట్టుకొనే మగసిరి పొగరుంది నాలో..2
కైపులు పెంచుకొంద్దాం లే..లే..లే..
సుఖములు పంచుకొందాం రా..రా..రా..
అందాలు నీవీ..అనుభవం నాదీ..
ఆనందం ఇదే..ఇదే....
హాయిగా మత్తుగా..ఆడవే అందాల భామా..భామా..

కొత్తగ మురిపించు..పాతను మరపించు ముద్దుగా..
ఘుమఘుమలాడించు..కోరిక పండించు మెత్తగా..2
రేపు నీవెక్కడో..ఏమోలే..రేపు నేనెవ్వరో ఏమోలే..
ఈ రోజు మోజూ..ఈ రేయి హాయీ..ఇద్దరికీ..చాలూ..చాలూ..
హాయిగ మత్తుగా ఆడవే అందాల భామా..
ఆడాక చూపించు కాసింత ప్రేమా..
హాయిగా మత్తుగా..ఆడవే అందాల భామా..భామా.
.



Illu Illalu--1972
Music::K.V.Mahadevan
Lyricis::Aarudra
Singer's::S.P.Balu 

haayiga mattugaa aaDavae aMdaala bhaamaa
aaDaaka choopiMchu kaasiMta praemaa..2

madhuvulu chilikiMche maikaM poMgutuMdi neelO
maikaM taTTukonae magasiri pogaruMdi naalO..2
kaipulu peMchukoMddaaM lae..lae..lae..
sukhamulu paMchukoMdaaM raa..raa..raa..
aMdaalu neevee..anubhavaM naadee..
aanaMdaM idae..idae....
haayigaa mattugaa..aaDavae aMdaala bhaamaa..bhaamaa..

kottaga muripiMchu..paatanu marapiMchu muddugaa
ghumaghumalaaDiMchu..kOrika paMDiMchu mettagaa..2
raepu neevekkaDO..aemOlae..raepu naenevvarO aemOlae..
ee rOju mOjoo..ee raeyi haayee..iddarikee..chaaloo..chaaloo..
haayiga mattugaa aaDavae aMdaala bhaamaa..
aaDaaka choopiMchu kaasiMta praemaa..

haayigaa mattugaa..aaDavae aMdaala bhaamaa..bhaamaa..

ఇల్లు-ఇల్లాలు--1972







సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల


ఇల్లే ఇలలో స్వర్గమనీ..ఇల్లాలే ఇంటికి దేవతనీ
రుజువు చేసావూ..నీవూ..రుజువు చేసావూ
మనసే మనిషికి అందమనీ..మగడే శ్రీమతి దైవమనీ
రుజువు చేసావూ..నీవూ..రుజువు చేసావూ

మైకమనే..చీకటిలో..మమతకోసమై వెతికానూ..2
కాంతికిరణమై కనిపించీ..జీవనజ్యోతిని వెలిగించావూ
అందముగా..అందానికి ఒక బంధముగా..2
తొలినోముల ఫలమై దొరికావూ..
నను వీడని నీడై నిలిచావూ..
ఇల్లే ఇలలో స్వర్గమనీ..ఇల్లాలే ఇంటికి దేవతనీ
రుజువు చేసావూ..నీవూ..రుజువు చేసావూ

చల్లని కన్నులలో..వెలిగే వెన్నెలదీపాలూ..
నా చిరునవ్వుకు ప్రాణాలూ..
మనప్రేమకు ప్రతిరూపాలూ..
నీ పెదవుల రాగములో విరిసే తీయని భావాలూ..
ఆనందానికి దీవెనలూ..
మన అనుబందానికి ఆరతులూ..
మనసే మనిషికి అందమనీ..మగడే శ్రీమతి దైవమనీ
రుజువు చేసావూ..నీవూ..రుజువు చేసావూ

నాలో సగమై నీవే జగమై..నేనే నీవుగ మారావూ..2
మారని మనిషిని మార్చావూ..
బ్రతుకే పండుగ చేసావూ..
పెన్నిధివై..అనురాగానికి సన్నిధివై..
కన్నులముందు వెలిసావూ..నా కలలకు రూపం ఇచ్చావూ..

ఇల్లే ఇలలో స్వర్గమనీ..ఇల్లాలే ఇంటికి దేవతనీ
రుజువు చేసావూ..నీవూ..రుజువు చేసావూ
అహా..హా..ఆ..ఆ..ఆహా..అహా..హా..ఆ..ఆ..హా

మానవుడు దానవుదు --1972


















సంగీతం::అశ్వద్ధామ
రచన::C.నారాయణ రెడ్డి
గానం::L.R.ఈశ్వరీ


కంచెకాడ..మంచెకాడ..కందిచేను..గుబురుకాడ
యేటికాడ..గున్నమామి..తోటకాడ..సందెకాడ
మాటువేసాను పోంచి చూసాను దారికాచాను..హా..
నీకోసం..నీసోకైన..మగసిరికోసం..నీకోసం..2

చింతల రైక తొడిగి..సిమ్హాచలం నేను పోతే
గుంటనక్క గుర్రుమన్నదీ..గుండెల్లోనే ఝల్లుమన్నదీ
అప్పుడు నేనేం చేసాను..అన్నిదిక్కులు చూసానూ
తళుక్కుమని ఒక మెరుపు మెరవగా..దౌడుతీసి ఇటువచ్చాను

రంగురంగుల కోకగట్టి..ఒంగోలుకు నే పోతే..2
పోట్లగిత్త ఎదురుపడ్డది..గుబులు గుబులై నామనసు చెడ్డది..2
అప్పుడు నేనేమి చేసాను..అమ్మమ్మను తలపోసానూ..
గిత్తనువంచే మొనగాడననీ..తత్తరపడి ఇటువచ్చానూ..
నీకోసం..నీసోకైన..మగసిరికోసం..నీకోసం..2

కన్యసిగలో పూలుపెట్టి..వరంగల్‌కు నేపోతే..
కొడెకాడే నన్ను కొట్టేనే..వాడా వాడా నవ్వు కట్టెనే
అప్పుడు నేనేమయ్యాను..అవిరావిరైపోయాను..
ఈ దోరవయసి నను బతకనివ్వదని..ఊరువిడిచి..ఊరికొచ్చానూ..
నీకోసం..నీసోకైన..మగసిరికోసం..నీకోసం..
2

వైశాలి--1988



సంగీతం::రవి
రచన::రాజశ్రీ
గానం::చిత్ర
Cast::Sanjay, Suparna, Geetha

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం అనురాగ బంధం

ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం అనురాగ బంధం

తీయని భావాల రాగ సరాగ మంత్రం
విరిసెను అంతులేని ఆనందం
తలపులే రాగాలు పాడాలి నేడు
తలపులే రాగాలు పాడాలి నేడు
ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం అనురాగ బంధం
ప్రేమ జీవన నాదం

చరణం::1

సగమద మగస గమదని గమగ
మదరిస నిదమద స
ఆడే మయూర బాల పురివిప్పి చెంత తాను
విరిసెను పూలలో గారాలీ వేళ
మధువులు కురిసే పెదవులలోన
మధురస్వరాలు సాగేను ఈ వేళ
ఓ గండు కోయిల జతకోరి పాడింది
అది విని ఆడింది ఓ కన్నె కోయిల
తలపులే రాగాలు పాడాలి నేడు
తలపులే రాగాలు పాడాలి నేడు
ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం అనురాగ బంధం
ప్రేమ జీవన నాదం

చరణం::2

నక్షత్రమాల నేడు ఆకాశవీధిలోన
కాంతుల విరివాన కురిపించేనులే
కలలే రగిలి అలలై కదిలి
ఊహలు నాలోన ఉరికెనులే
హంసలు జతచేరి ఆనందమున తేలి
మనసార విహరించె మధురిమలో
తలపులే రాగాలు పాడాలి నేడు
తలపులే రాగాలు పాడాలి నేడు
ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం అనురాగ బంధం
ప్రేమ జీవన నాదం

తీయని భావాల రాగ సరాగ మంత్రం
విరిసెను అంతులేని ఆనందం
తలపులే రాగాలు పాడాలి నేడు
తలపులే రాగాలు పాడాలి నేడు
ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం అనురాగ బంధం
ప్రేమ జీవన నాదం