Tuesday, November 25, 2014

కక్ష--1980....




సంగీతం::చక్రవర్తి 
రచన::ఆచార్య-ఆత్రేయ 
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::V.C.Guha Naadan 
తారాగణం::శోభన్‌బాబు,మురళిమోహన్,గుమ్మడి,అల్లురామలింగయ్య,కైకాల సత్యనరాయణ,మోహన్‌బాబు,జయచిత్ర,శ్రీదేవి,జమున.

పల్లవి::

కందిరీగ తో చెప్పాను రా
కోడెగాడు బుగ్గ ఈడు కుట్టొద్దని
కుట్టినా ఎవరికీ చెప్పొద్దూ అని
గోల చెయ్యొద్దని గొడవ చెయ్యొద్దని 
దొంగ చాటుగా వస్తానులే
బుగ్గ మీద కాటేసి పోతానులే 
అడిగితే చెప్పుకో కందిరీగ అని
కాటు వేసిందని బుగ్గ వచ్చిందని

కందిరీగ తో చెప్పాను రా
దొంగ చాటుగా వస్తాను రా

చరణం::1

ఉండుండి గుండె దడ దడ మంటోంది రా
ఆగాగి వయసు పెట పెట మంటోంది రా 
ఉండుండి గుండె దడ దడ మంటోంది
ఆగాగి వయసు పెట పెట మంటోంది
దాన్ని ఆపేది ఎట్టా ... దీన్ని అణిచేది ఎట్టా..2
ఊగూగి మనసు రెప రెప మంటున్నదే
ఉత్తిత్తినే ఒళ్ళు చిమ చిమ లాడింది లే 
ఊగూగి మనసు రెప రెప మంటుందే
ఉత్తిత్తినే ఒళ్ళు చిమ చిమ లాడింది 
దాన్ని తీర్చేది ఎట్టా..దీన్ని అర్చేది ఎట్టా
కందిరీగ తో చెప్పాను రా

చరణం::2

కళ్ళల్లో నీకు ఇల్లు ఒకటి కట్టాను రా
ఒళ్ళంతా కళ్లుగా నిన్ను ఎదురుచూశాను రా 
కళ్ళల్లో నీకు ఇల్లు ఒకటి కట్టాను
ఒళ్ళంతా కళ్లుగా నిన్ను ఎదురుచూశాను రా
అద్దె ఇవ్వొద్దు నువ్వు..పొద్దుకో ముద్దు ఇవ్వు..2
పొద్దుకో ముద్దని పద్దెవరు రాస్తారు లే
వద్దన్నకొద్దీ ముద్దెక్కువ అవుతుందిలే..2
నీకు నెల తప్పకుండ..అద్దె నేనిచ్చుకుంటా
కందిరీగ తో చెప్పాను రా

Kaksha--1980 
Mc::Chakravarti 
Lyrics::Achaarya-Atreya 
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::V.C.Guha Naadan 
Cast::SobhanBaabu,Muralimohan,Gummadi,Alluraamalingayya,Kaikaala Satyanaraayana,MohanBaabu,Jayachitra,Sreedevi,Jamuna.

:::::::::::::::::::::

kandireega tO cheppaanu raa
kODegaaDu bugga iiDu kuTToddani
kuTTinaa evarikii cheppoddoo ani
gOla cheyyoddani goDava cheyyoddani 
donga chaaTugaa vastaanulE
bugga meeda kaaTEsi pOtaanulE 
aDigitE cheppukO kandireega ani
kaaTu vEsindani bugga vachchindani

kandireega tO cheppaanu raa
donga chaaTugaa vastaanu raa

::::1

unDunDi gunDe daDa daDa manTOndi raa
aagaagi vayasu peTa peTa manTOndi raa 
unDunDi gunDe daDa daDa manTOndi
aagaagi vayasu peTa peTa manTOndi
daanni aapEdi eTTaa..deenni aNichEdi eTTaa..2

Ugoogi manasu repa repa manTunnadE
uttittinE oLLu chima chima laaDindi lE 

Ugoogi manasu repa repa manTundE
uttittinE oLLu chima chima laaDindi 
daanni teerchEdi eTTaa..deenni archEdi eTTaa
kandireega tO cheppaanu raa

::::2

kaLLallO neeku illu okaTi kaTTaanu raa
oLLantaa kaLlugaa ninnu eduruchooSaanu raa 
kaLLallO neeku illu okaTi kaTTaanu

oLLantaa kaLlugaa ninnu eduruchooSaanu raa
adde ivvoddu nuvvu..poddukO muddu ivvu..2
poddukO muddani paddevaru raastaaru lE
vaddannakoddii muddekkuva avutundilE..2
neeku nela tappakunDa..adde nEnichchukunTaa
kandireega tO cheppaanu raa

పసుపు పారాణి--1980




సంగీతం::రమేశ్ నాయుడు
రచన::వేటూరిసుందరరామ్మూర్తి 
గానం::P.సుశీల
Film Directed By::Durgaa Nageswara Rao
తారాగణం::మురళిమోహన్,రావుగోపాల్‌రావు,గుమ్మడి,అల్లురామలింగయ్య,సుజాత,పండరీబాయి,రమాప్రభ,నిర్మల.

పల్లవి::

ఆ ముద్దబంతులు.. ఊఊఊఊ
ఆ ముద్దబంతులు పసుపు రాశులు 
పోసే వాకిళ్ల ముందు
ఆ ముద్దమందారు పారాణి 
దిగ బోసే లోగిళ్ల సందు
పసుపు పారాణితో పెళ్ళి జరిగేను
పసుపు పారాణితో పెళ్ళి జరిగేను
ఏడడుగులేసేను..ఏకమైయ్యేను 

ఆ ముద్దబంతులు పసుపు రాశులు 
పోసే వాకిళ్ల ముందు
ఆ ముద్దమందారు పారాణి 
దిగ బోసే లోగిళ్ల సందు

చరణం::1

తంగేడు పూలల్లే..పసుపు పూయాలి..ఈ..ఆ
తామర రేకల్లే..పారాణి రాయాలి
తంగేడు పూలల్లే..పసుపు పూయాలి
తామర రేకల్లే..పారాణి రాయాలి

పసుపు సున్నము..కలిపి పారాణి ఆయే
పసుపు సున్నము..కలిపి పారాణి ఆయే
పసుపు పారాణితో..ఇల్లాలు ఆయే

ఆ ముద్దబంతులు పసుపు రాశులు 
పోసే వాకిళ్ల..ముందు
ఆ ముద్దమందారు పారాణి 
దిగ బోసే..లోగిళ్ల సందు 

చరణం::2

ఉదయాన సూరీడు పసుపు పండించే..ఏఏఏ..ఆ..ఆ
అస్తమించే వేళ పారాణి పొంగించె..ఆ..ఆ
ఉదయాన సూరీడు పసుపు పండించే..ఆ..ఆ
అస్తమించే వేళ పారాణి పొంగించె..ఆ..ఆ

గడపలకు నిత్యమూ..పసుపు పారాణే
గడపలకు నిత్యమూ..పసుపు పారాణే
కాళ్ళకు పెళ్ళికే..పసుపు పారాణి

ఆ ముద్దబంతులు పసుపు రాశులు 
పోసే వాకిళ్ల ముందు
ఆ ముద్దమందారు..పారాణి 
దిగ బోసే లోగిళ్ల సందు

Pasupu Paaraani--1980
Music::Ramesh Nayudu
Lyrics::Vetoorisundararaammoorti
Singer's::P.Suseela
Film Directed By::Durgaa Nageswara Rao
Cast::Muralimohan,RaavgopalRao,Gummadi,Alluraamalingayya,Sujaata,nirmala,Ramaaprabha.

:::::::::::::::::::::::::::::::::::::::::::::

aa muddabantulu 
aa muddabantulu pasupu raaSulu 
pOsae vaakiLla mundu
aa muddamandaaru paaraaNi 
diga bOsE lOgiLla sandu
pasupu paaraaNitO peLLi jarigEnu
pasupu paaraaNitO peLLi jarigEnu
EDaDugulEsEnu..EkamaiyyEnu 

aa muddabantulu pasupu raaSulu 
pOsE vaakiLla mundu
aa muddamandaaru paaraaNi 
diga bOsE lOgiLla sandu

::::1

tangEDu poolallE..pasupu pooyaali
taamara rEkallE..paaraaNi raayaali
tangEDu poolallE..pasupu pooyaali
taamara rEkallE..paaraaNi raayaali

pasupu sunnamu..kalipi paaraaNaayE
pasupu sunnamu..kalipi paaraaNaayE
pasupu paaraaNitO..illaalu aayE

aa muddabantulu pasupu raaSulu 
pOsE vaakiLla..mundu
aa muddamandaaru paaraaNi 
diga bOsE..lOgiLla sandu 

::::2

udayaana sooreeDu pasupu panDinche..EEE..aa..aa
astaminchE vELa paaraaNi ponginche..aa..aa
udayaana sooreeDu pasupu panDinche..aa..aa
astaminchE vELa paaraaNi ponginche..aa..aa

gaDapalaku nityamuu..pasupu paaraaNE
gaDapalaku nityamuu..pasupu paaraaNE
kaaLLaku peLLikE..pasupu paaraaNi

aa muddabantulu pasupu raaSulu 
pOsE vaakiLla mundu
aa muddamandaaru..paaraaNi 
diga bOsE lOgiLla sandu

ప్రేమనగర్--1971























సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ, సత్యనారాయణ, గుమ్మడి, శాంతకుమారి, రాజబాబు

పల్లవి::

ఉంటే యీ వూళ్ళో వుండు..పోతే మీ దేశం పోరా
ఉంటే యీ వూళ్ళో వుండు..పోతే మీ దేశం పోరా
చుట్టుపక్కల వున్నావంటే..చూడకుండా ప్రాణ ముండదురా..ఆ  
ఉంటే యీ వూళ్ళో వుండు..పోతే మీ దేశం పోరా 

చరణం::1

కూలికెళ్తే నాకే రారా..చేను వున్నాది
కూడు తింటే నాతో తినరా..తోడువుంటాది
కూలికెళ్తే నాకే రారా..చేను వున్నాది 
కూడు తింటే నాతో తినరా..తోడువుంటాది
ఇంకేడకైనా ఎల్లావంటే..ఏఏఏ..ఇంకేడకైనా ఎల్లావంటే 
నాది చుప్పనాతి మనసు..అది నీకు తెలుసు 
నాది చుప్పనాతి మనసు..అది నీకు తెలుసు ఒప్పి వూరుకోనంటది
ఉంటే యీ వూళ్ళో వుండు..పోతే మీ దేశం పోరా

చరణం::2
        
ఊరినిండా వయసు పిల్లలు..ఒంటిగున్నారు
వాటమైనవాడ్ని చూస్తే..వదలనంటారు
ఊరినిండా వయసు పిల్లలు..ఒంటిగున్నారు 
వాటమైనవాడ్ని చూస్తే..వదలనంటారు
నీ శపలబుద్ది సూపావంటే..ఏఏఏ.. 
మనిషి నాకు దక్కవింక..మంచిదాన్ని కాను ఆనక  
ఉంటే యీ వూళ్ళో వుండు..పోతే మీ దేశం పోరా

 చరణం::3
    
పగటిపూట పనిలో పడితే..పలకనంటావు 
రాతిరేళ రహస్యంగా..రాను జడిసేవు 
పగటిపూట పనిలో పడితే..పలకనంటావు  
రాతిరేళ రహస్యంగా..రాను జడిసేవు 
నే తెల్లవార్లు మేలుకుంటే..నే తెల్లవార్లు మేలుకుంటే  
ఎఱ్ఱబడ్డ కళ్ళుచూసి..ఏమేమో అనుకొని 
ఎఱ్ఱబడ్డ కళ్ళుచూసి..ఏమేమో అనుకొని 
ఈది ఈది..కుళ్ళుకుంటాది       
ఉంటే యీ వూళ్ళో వుండు..పోతే మీ దేశం పోరా 
చుట్టుపక్కల వున్నావంటే..చూడకుండా ప్రాణ ముండదురా..ఆ 
ఉంటే యీ వూళ్ళో వుండు..పోతే మీ దేశం పోరా