Wednesday, July 31, 2013

స్వర్ణకమలం--1988
సంగీతం::ఇళయరాజ 
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు 
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు 
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు 
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు 
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు 

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు 
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు 
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు 
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు 
ఎల్లలన్నవే ఎరుగని వేగంతొ వెళ్ళు 

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు 
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు 

చరణం::1

లయకే నిలయమై నీ పాదం సాగాలి 
ఆహహహ హాహహా 
మలయా నిలగతిలో సుమబాలగ తూగాలి 
ఆహాహ హాహహా 
వలలో ఒదుగునా విహరించే చిరుగాలి 
సెలయేటికి నటనం నెర్పించే గురువేడి 
తిరిగే కాలానికి ఆఅ ఆఆ.. ఆఅ ఆఆ 
తిరిగే కాలానికి తీరొకటుంది 
అది నీ పాఠానికి దొరకను అంది 
నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటే 
విరుచుకుపడు సురగంగకు విలువేముంది 
విలువేముందీ 

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు 
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు 

చరణం::2

దూకే అలలకు యే తాళం వేస్తారు 
ఆహాహ హాహహా 
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు 
అలలకు అందునా ఆశించిన ఆకాశం 
కలలా కరగడమా జీవితాన పరమార్ధం 
వద్దని ఆపలేరు ఆఅ ఆఅ... ఆఅ ఆఅ 
వద్దని ఆపలేరు ఉరికే ఊహని 
హద్దులు దాటరాదు ఆశల వాహిని 
అదుపెరగని ఆటలాడు వసంతాలు వలదంటె 
విరివనముల పరిమలముల విలువేముంది 
విలువేముందీ 

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు 
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు 
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు 
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు 
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు 
ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు 
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు 

Swarna kamalam--1988 
Music::Ilaiyaraaja 
Lyricist::Sirivennela 
Singers::S.P.Balu,P Susheela

ghallu ghallu ghallu mantu merupalle tullu 
jhallu jhallu jhalluna uppongu ningi ollu 
nalla mabbu challanee challani chiru jallu 
nalla mabbu challanee challani chiru jallu 
pallavinchanee nelaku pachchani paravallu 

ghallu ghallu ghallu mantu merupalle tullu 
jhallu jhallu jhalluna uppongu ningi ollu 
velluvochchi saaganee tolakari allarlu 
velluvochchi saaganee tolakari allarlu 
ellalannave erugani vegamto vellu 

ghallu ghallu ghallu mantu merupalle tullu 
jhallu jhallu jhalluna uppongu ningi ollu 

layake nilayamai nee paadam saagaali 
aahahaha haahahaa 
malayaa nilagatilo sumabaalaga toogaali 
aahaaha haahahaa 
valalo odugunaa viharinche chirugaali 
selayetiki natanam nerpinche guruvedi 
tirige kaalaaniki aaaa aaaaa.. aaaa aaaaa 
tirige kaalaaniki teerokatundi 
adi nee paathaaniki dorakanu andi 
nataraaaja swaami jataajootiloki cherakunte 
viruchukupadu suragangaku viluvemundi 
viluvemundee 

ghallu ghallu ghallu mantu merupalle tullu 
jhallu jhallu jhalluna uppongu ningi ollu 

dooke alalaku ye taaLam vestaaru 
aahaaha haahahaa 
kammani kalala paata ye raagam antaaru 
alalaku andunaa aasinchina aakaasam 
kalalaa karagadamaa jeevitaana paramaardham 
vaddani aapaleru aaaa aaaa... aaaa aaaa 
vaddani aapaleru urike oohani 
haddulu daataraadu aasala vaahini 
aduperagani aatalaadu vasantaalu valadante 
virivanamula parimalamula viluvemundi 
viluvemundee 

ghallu ghallu ghallu mantu merupalle tullu 
jhallu jhallu jhalluna uppongu ningi ollu 
nalla mabbu challanee challani chiru jallu 
velluvochchi saaganee tolakari allarlu 
pallavinchanee nelaku pachchani paravallu 
ghallu ghallu ghallu mantu merupalle tullu 
jhallu jhallu jhalluna uppongu ningi ollu 

రంగుల రాట్నం--1967
సంగీతం::S రాజేశ్వరరావు
రచన::దాశరథి
గానం::P. సుశీల
దర్శకత్వం::బొమ్మిరెడ్డి నరసింహ రెడ్డి
తారాగణం::అంజలీదేవి,రాంమోహన్,చంద్రమోహన్,విజయనిర్మల,వాణిశ్రీ,నీరజ,త్యాగరాజు,రాధారాణి.
పల్లవి::

కోయిల కోయని పిలిచినది
ఓయని నా మది పలికినది
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ

ఎవరిరూపో..ఎవరిరూపో..కనులలోన మెరిసినది
నా..ఆ..బుగ్గలపై..తొలిసిగ్గు..తొణికినది

కోయిల కోయని పిలిచినది
ఓయని నా మది పలికినది

చరణం::1

విరబూసే పూలూ సరదాలూ రేపే
వేయీ వసంతాలు ఉయ్యాలలూపే 
వేయీ వసంతాలు ఉయ్యాలలూపే
వలపులతో..ఓ..వెచ్చని తలపులతో..ఓ
వలపులతో..ఓ..వెచ్చని తలపులతో
ఒయ్యారి నా మనసు సయ్యాటలాడే..ఏ

కోయిల కోయని పిలిచినది
ఓయని నా మది పలికినది

చరణం::2

ఆఆఆ..ఆఆఆఆఆ
ఆఆఆఆఆఆఆఆఅ
తెలిమబ్బుమీద..తేలేను నేను 
చిరుగాలి కెరటాల..సోలేను నేను..తూలేను నేను 
తారకనూ..తీయని కోరికనూ 
తారకనూ..తీయని కోరికనూ  
మిన్నేటి నావకూ చుక్కాని నేనూ..ఊ

కోయిల కోయని పిలిచినది
ఓయని నా మది పలికినది

ఎవరిరూపో..ఎవరిరూపో..కనులలోన మెరిసినది
నా..ఆ..బుగ్గలపై..తొలిసిగ్గు..తొణికినది

కోయిల కోయని పిలిచినది
ఓయని నా మది పలికినది
ఆఅ ఆహా ఓఓఓ ఓహో
ఆఅ ఆహా ఓఓఓ ఓహో
కోయిల కోయని పిలిచినది
ఓయని నా మది పలికినది

రంగుల రాట్నం--1967సంగీతం::S.రాజేశ్వరరావు మరియు,B. గోపాలం 
రచన::దాశరధి
గానం::B.వసంత, A.P. కోమల
తారాగణం::అంజలీదేవి,రాంమోహన్,వాణిశ్రీ,నీరజ, చంద్రమోహన్ (తొలి పరిచయము),త్యాగరాజు

:::::::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
చేపరూపమున సోమపు చంపి..వేదాలు తెచ్చిన నారాయణా
నారాయణా..కూర్మరూపివై..కులగిరి మోసీ..అమృతము నిచ్చిన నారాయణా 
పన్నగ శయనా పంకజనయనా నల్లనిస్వామీనారాయణా..ఆ..నల్లనిస్వామీనారాయణా  

హిరణ్యు ద్రుంచీ ధరణిని బ్రోచిన వరాహరూపా నారాయణా
వరాహరూపా నారాయణా  

స్తంభము వెడలీ డింబపు బాచిన నారసిహ్ముడవు నారాయణా 
నారసిహ్ముడవు నారాయణా 

మూడడుగులతో పుడమిని గొలిచిన వామనమూర్తీ నారాయణా
వామనమూర్తీ నారాయణా

గొడ్డలితో భూపతులను చెండిన పరశురాముడవు నారాయణా..ఆ..
పరశురాముడవు నారాయణా

దశకఠునితో తలపడి గెలిచిన దశరత తనయా నారాయణా

గోపీలోలా గోపాలబాలా నవనీతచోరా నారాయణా 

Rangula Raatnam--1967
Music::S.Rajeswara Rao &B.Gopaalam
Lyrics::Dasarathi
Singer's::B.Vasanta,A.P.Komala
Cast::Anjali Devi,RammohamVanisree,Neeraja,Chandramohan,Tyagaraaju.

:::::::::

mm mm mm mm
chEparoopamuna sOmapu champi..vEdaalu techchina naaraayaNaa
naaraayaNaa..koormaroopivai..kulagiri mOsii..amRtamu nichchina naaraayaNaa 
pannaga Sayanaa pankajanayanaa nallaniswaamiinaaraayaNaa..aa..nallaniswaamiinaaraayaNaa  

hiraNyu drunchii dharaNini brOchina varaaharoopaa naaraayaNaa
varaaharoopaa naaraayaNaa  

staMbhamu veDalii DiMbapu baachina naarasihmuDavu naaraayaNaa 
naarasihmuDavu naaraayaNaa 

mooDaDugulatO puDamini golichina vaamanamoortii naaraayaNaa
vaamanamoortii naaraayaNaa

goDDalitO bhUpatulanu chenDina paraSuraamuDavu naaraayaNaa..aa..
paraSuraamuDavu naaraayaNaa

daSakaThunitO talapaDi gelichina daSarata tanayaa naaraayaNaa

gOpiilOlaa gOpaalabaalaa navaneetachOraa naaraayaNaa