Monday, October 08, 2012

పెళ్ళి చేసి చూడు--1952..వకుళాభరణం రాగం






వకుళాభరణం:::రాగం
సంగీతం::ఘంటసాల
రచన::పింగళి 
గానం::P.లీల
నటీనటులు::G.వరలక్ష్మి, N.T.రామారావు, డాక్టర్ K.శివరామకృష్ణయ్య మరియు బాలకృష్ణ

 పల్లవి::

లాలలాలలలలాలలలా

మనసా! నేనెవరో నీకు తెలుసా?
నీకు తెలుసా తెలుసా మనసా!
వేషలు భాషలు వేదాంతములను
ఓ..ఓ....మనసా..
వేషలు భాషలు వేదాంతములను
మిసమిస యెరలను మింగావు
నా పసిడి గాలమున చిక్కావూ 
మిసమిస యెరలను మింగావు
నా పసిడి గాలమున చిక్కావూ

మనసా! నేనెవరో నీకు తెలుసా?
నీకు తెలుసా తెలుసా మనసా!

చరణం::1

సత్తు చిత్తుల భేదము తెలియక..ఆ..ఆ..
సత్తు చిత్తుల భేదము తెలియక చిత్తునె
సత్తనుకున్నావూ నా యెత్తు లెరుగకున్నావూ 

మనసా! నేనెవరో నీకు తెలుసా?
నీకు తెలుసా తెలుసా మనసా!

ప్రకృతీ పురుషుల ఒకటే ఒకటను
ఉ..ఉ..ఉ..ఉ.... 
ప్రకృతీ పురుషుల ఒకటే ఒకటను
పరమరహస్యము మరిచావు
సద్గురు బోధన వినకున్నావూ 
పరమరహస్యము మరిచావు
సద్గురు బోధన వినకున్నావూ

మనసా! నేనెవరో నీకు తెలుసా?
నీకు తెలుసా తెలుసా మనసా!