సంగీతం::S.P.కోదండపాణి
రచన::G.విజయరత్నం
గానం::P.సుశీల,S.P.బాలు
తారాగణం::శోభన్‌బాబు, వాణిశ్రీ, ప్రభాకరరెడ్డి, రేణుక, రాజబాబు, జ్యోతిలక్ష్మి,త్యాగరాజు
పల్లవి::
నీ..ఈఈఈఈ..మనసులోకి రావాలి కాపురానికి
నే అద్దె ఎంత..ఇవ్వాలీ మాసానికీ
నే అద్దె ఎంత..ఇవ్వాలీ మాసానికీ
నా..ఆఆఆ..మనసులోకి రాకముందు కాపురానికి
నీ విషయమంత..తెలియాలి ఇవ్వడానికీ
నీ విషయమంత..తెలియాలి ఇవ్వడానికీ
చరణం::1
అమ్మమ్మో అయ్యయ్యో అల్లరి చేసాడూ..ఆహా
అబ్బొబ్బొ అయ్యయ్యో మెల్లగ దోచాడూ..హాయ్..హాయ్
అమ్మమ్మో అయ్యయ్యో అల్లరి చేసాడూ
అబ్బొబ్బొ అయ్యయ్యో మెల్లగ దోచాడూ
ఏమేమో చేసాడమ్మో..ఓఓఓఓఓఓఓ
నే మైమరచి పొయ్యానమ్మో
చేసింది ఏముంది...చేసేది రేపుంది
చేసింది ఏముంది...చేసేది రేపుంది
ఉలికి ఉలికి పడబోకు..ఉన్నదంత ముందుందీ
ఎంతెంతో ఉందమ్మో..ఓఓఓఓఓఓ..ఇంకెంతో ఉందమ్మో
నా మనసులోకి రాకముందు కాపురానికి
నీ విషయమంత తెలియాలి ఇవ్వడానికీ
ఆఆఆ..నీ విషయమంత తెలియాలి ఇవ్వడానికీ
చరణం::2
అమ్మమ్మో అయ్యయ్యో కళ్ళెము వేసిందీ..మ్మ్ హూ
అబ్బొబ్బొ ఒళ్ళంతా అల్లుకు పొయిందీ
అమ్మమ్మో అయ్యయ్యో కళ్ళెము వేసిందీ
అబ్బొబ్బొ ఒళ్ళంతా అల్లుకు పొయిందీ
ఎన్నెన్నో చేసిందమ్మో..ఓఓఓఓఓఓ..
అందకుండ పోయిందమ్మో
వారెవ్వా మొనగాడా..తగ్గాలి నీ జోరూ
వారెవ్వా మొనగాడా..తగ్గాలి నీ జోరూ
జగజ్జంత్రి నీవైతే..జగజ్జాణ నేనోయి
ఒకరికొకరు సరిపడితే..జగమంత మనదేలే
జగమంత మనదేలే..ఏఏఏఏఏ..ఈ యుగమంతా మనదేలే
ఆఆహా..ఆహహహహహా..లలాలలాలలలా
ఓహోహో..ఓహోహో..ఓహోహో..మ్మ్ మ్మ్ మ్మ్