సంగీతం::B.S.రావు,అశ్వధ్ధామ రచన::ఆచార్య-ఆత్రేయ గానం::జిక్కి Film Directed By::P.Pullayya తారాగణం::అక్కినేని, సావిత్రి, జగ్గయ్య, గుమ్మడి, శాంతకుమారి పల్లవి:: ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ రాక రాక వచ్చావు..చందమామ రాక రాక వచ్చావు..చందమామ లేక లేక నవ్వింది కలువభామ..కలువభామ లేక లేక నవ్వింది కలువభామ..కలువభామ చరణం::1 మబ్బులన్ని పోయినవి మధుమాసం వచ్చినది మరులుకొన్న విరికన్నె విరియబూసి మురిసింది విరియబూసి మురిసింది..ఈ ఈ ఈ ఈ ఈ లేక లేక నవ్వింది..కలువభామ..కలువభామ చరణం::2 రేకులన్ని కన్నులుగా లోకమెల్ల వెతికినది..ఈఈఈఇ రేకులన్ని కన్నులుగా లోకమెల్ల వెతికినది ఆకసాన నినుజూచి ఆనందం పొంగినది ఆకసాన నినుజూచి ఆనందం పొంగినది.. ఆనందం పొంగినది..ఈ ఈ ఈ ఈ ఈ లేక లేక నవ్వింది కలువభామ చరణం::3 తీరని కోరికలే తీయని తేనియలై వెన్నెల కన్నులలో వెల్లివిరిసి మెరిసినవి దొంగలాగ దూరాన తొంగి చూతువేల రావోయి రాగమంత నీదోయి..ఈ రేయి రాకరాక వచ్చావు..చందమామ లేక లేక నవ్వింది..కలువభామ Ardhangi--1955 Music::B.S.Raavu,Aswadhama Lyrics::Achaarya-Atreya Singer's::Jikki Film Directed By::P.Pullayya CAST::A.N.R.Savitri,Jaggayya,Gummadi,Saantakumari. :::::::::::::::: aa aa aa aa aa aa aa aa raaka raaka vachchaavu..chandamaama raaka raaka vachchaavu..chandamaama lEka lEka navvindi kaluvabhaama..kaluvabhaama lEka lEka navvindi kaluvabhaama..kaluvabhaama ::::1 mabbulanni pOyinavi madhumaasam vachchinadi marulukonna virikanne viriyaboosi murisindi viriyaboosi murisindi..ii ii ii ii ii lEka lEka navvindi..kaluvabhaama..kaluvabhaama ::::2 rEkulanni kannulugaa lOkamella vetikinadi..iiiiiii rEkulanni kannulugaa lOkamella vetikinadi aakasaana ninujoochi aanandam ponginadi aakasaana ninujoochi aanandam ponginadi.. aanandam ponginadi..ii ii ii ii ii lEka lEka navvindi kaluvabhaama ::::3 teerani kOrikalE teeyani tEniyalai vennela kannulalO vellivirisi merisinavi dongalaaga dooraana tongi chootuvEla raavOyi raagamanta needOyi..ii..rEyi raakaraaka vachchaavu..chandamaama lEka lEka navvindi..kaluvabhaama
సంగీతం::శంకర్‌జైకిషన్ రచన::ఆరుద్ర గానం::A.M.రాజా,జిక్కి Film Directed By::Raajaa Navadhe తారాగణం:: రాజ్ కపూర్ మరియు నర్గీస్ :::::::::::::: రారాదా..రారాదా..ఆ మది నిన్నే పిలిచే కాదా కన్నీట తడిచె బాధ కడలేనిదా ఈ వ్యధా? రారాదా..ఆ మది నిన్నే పిలిచే కాదా కన్నీట తడిచె బాధ కడలేనిదా ఈ వ్యధా? రారాదా..ఆ చరణం::1 ఓ..ఓ..ఓ... ఉ..ఉ.. ఊ.. చావు నా మీదకే రానున్నది మనసు నీ మీదకే పోతున్నది కారు చీకట్లు పగలే మూసెను కారు చీకట్లు పగలే మూసెను ఆసకే రాత అవబోతున్నది..ఈ రారాదా..ఆ మది నిన్నే పిలిచే కాదా కన్నీట తడిచె బాధ..ఆ కడలేనిదా ఈ వ్యధా? రారాదా..ఆ చరణం::2 ఓ..ఓ..ఓ చెలి బాధ తెలుసుకోవా ఓ..ఓ..ఓ చెలి బాధ తెలుసుకోవా కలలోని కైన రావా..ఆ..ఆ కలలోని కైన రావా రావోయి మది నిన్నే పిలిచెనోయి కన్నీట కరిగె హాయి కడలేనిదా ఈ వ్యధా? రావోయి ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఉ..ఉ..ఊ..ఉ..ఉ..ఊ గుండె గాయాలు కూడా చూడవా రెండు నిమిషాలు ప్రియమూ లాడవా పంచ ప్రాణాలు బాసే వేళలో పంచ ప్రాణాలు బాసే వేళలో నిండు మన ప్రేమ నీ కన్నీళ్ళలో రారాదా..ఆ మది నిన్నే పిలిచే కాదా కన్నీట తడిచె బాధ కడలేనిదా ఈ వ్యధా? రారాదా..ఆ
చరణం::1 హాయి హాయి ఈ లోకం..తీయనైనదీ లోకం హాయి హాయి ఈ లోకం..తీయనైనదీ లోకం నీ ఇల్లే పూల వనం..నీ సర్వం ప్రేమ ధనం మరువకోయి..ఈ సత్యం..అదిగదిగో గగనసీమ.. చరణం::2 నీ కోసమే జగమంతా..నిండెనోయి వెన్నెలలు నీ కోసమే జగమంతా..నిండెనోయి వెన్నెలలు తేలెనోయి గాలి పైన..తీయనైన కోరికలు చరణం::3 ఆ ఆ ఆ ఆ ఆ.. చెరుపుకోకు నీ సౌఖ్యం..చేతులార ఆనందం చెరుపుకోకు నీ సౌఖ్యం..చేతులార ఆనందం యేనాడును పొరపడకోయ్..యేమైన తొరపడకోయ్ మరల రాదు రమ్మన్నా..మరల రాదు రమ్మన్నా మాయమైన ప్రేమధనం..చివురింపదు తిరిగీ వాడి చెడిన పూలవనం..మరువకోయి ఈ సత్యం..మ్మ్ మ్మ్ మ్మ్
సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు గానం::A.M.రాజా, జిక్కి నిర్మాతలు::P.గోపాలరెడ్డి, P.ఏ.పద్మనాభరావు దర్శకత్వం::సార్వభౌమ, అమనుతుల్లా తారాగణం::అమర్‌నాధ్, శ్రీరంజని, కృష్ణకుమారి సంస్థ::శర్వాణి అంటు మామిడి తోటలోన ఒంటరిగా పోతుంటే కొంటెచూపు చూసేటి మావయా నీ కంటిచూపు కథలు తెలుసు లేవయా అంటు మామిడి తోటలోన ఒంటరిగా పోతుంటే కొంటెచూపు చూసేటి మావయా నీ కంటిచూపు కథలు తెలుసు లేవయా చరణం::1 గున్న మావి పళ్ళు కోయు పిల్లదానా గున్న మావి పళ్ళు కోయు పిల్లదానా నీ వన్నె మీద మనసాయె చిన్నదానా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కోరచూపు చూడకే కుర్రదానా ఆ అహా కోరచూపు చూడకే కుర్రదానా నీ కోరచూపు బాసయ్యే గుండెలోన అంటుమామిడి తోటలోన కంటికింపు కాకుండా ఒంటరిగా ఉంటేను ఎలా ఇక జంటగానే ఉండాలే పిల్ల చరణం::2 మోటబావి నీరు తాగు చిన్నవాడా నా బాట కట్టి రాబోకు వన్నెకాడా మోటబావి గట్టు పక్క, నిమ్మచెట్టు నీడ కింద మోటబావి గట్టు పక్క, నిమ్మచెట్టు నీడ కింద మోటు సరసమేల చాలు నిలు నిలు నీటుగాడా అంటు మామిడి తోటలోన ఒంటరిగా పోతుంటే కొంటెచూపు చూసేటి మావయా నీ కంటిచూపు కథలు తెలుసు లేవయా ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ గళ్ళ చీర కట్టుకుని కళ్ళ కాటుకెట్టుకొని గుళ్ళ పేరు వేసుకొని ఘల్లుఘల్లని పోతుంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడొచ్చా నా కళ్ళ సంకెల్లు నీకు వెయ్యొచ్చా చిలకాగోరింకలల్లే చెట్టాపట్టాలేసుకొని కలసి మెలసి ఉంటేనే హాయి ఇలా కులుకుతూ ఉంటేనే హాయి
::::::: ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీ దొరసాని
:::::::1 ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది హాయ్! ఆపై కోపం వచ్చింది వచ్చిన కోపం హెచ్చింది అందచందాల వన్నెలాడి అయినా బాగుంది
ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీ దొరసాని
::::::2 కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసింది మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది ఆమెకు సరదా వేసింది జరిగి దగ్గరకొచ్చింది అందచందాల వన్నెలాడి కోపం పోయింది
ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీ దొరసాని
::::3 పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది పడుచువాళ్ళ పాతలతోనే పల్లెసీమ పండింది పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది హాయ్! చివరకు చిలిపిగ నవ్వింది, చేయి చేయి కలిపింది అందచందాల వన్నెలాడి ఆడి పాడింది
వాడి పోయిన పైరులైనా నీరు గని నర్తించును వాడి పోయిన పైరులైనా నీరు గని నర్తించును కూలిపొయిన తీగలైన కొమ్మ నలమి ప్రాకును కన్నె మనసు ఎన్నుకున్న తోడు దొరికిన మురియు దోర వలపే కురియు మది దోచుకొమ్మని పిలుచు
పులకించని మది పులకించు వినిపించని కధ వినిపించు అనిపించని ఆశల నించు మనసునే మరపించు ప్రేమ మనసునే మరపించు