Monday, December 17, 2007

వీరాభిమన్యు --1965

సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల , P.సుశీల

Film Directed By::V.Madhusoodhana Rao 
తారాగణం::N.T.రామారావు,కాంతారావు,శోభన్‌బాబు,కాంచన,S.వరలక్ష్మి,G.వరలక్ష్మి,పద్మనాభం,రాజనాల,నెల్లూరు కాంతారావు,దండమూడి రాజగోపాల్,ధూళిపాళ,K.సత్యనారాయణ,గీతాంజలి.

పల్లవి::

రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె
ఇంద్రుని చంద్రుని అందాలు ఈతని సొమ్మే కాబోలు

రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె

నన్నే వెదకుచు భూమికి దిగిన కన్యక రతియే కాబోలు

ఇంద్రుని చంద్రుని అందాలు ఈతని సొమ్మే కాబోలు
మౌనముగానే మనసును దోచే మన్మధుడితడే కాబోలు

చరణం::1

తనివితీరా వలచి హృదయం కానుకీయని కరమేలా ?
తనివితీరా వలచి హృదయం కానుకీయని కరమేలా ?
పరవశించీ పడుచువానికి మధువు కానీ సొగసేలా
పరవశించీ పడుచువానికి మధువు కానీ సొగసేలా
రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె
మౌనముగా నీ మనసును దోచిన మన్మధుడితడే కాబోలు

చరణం::2

కలికి సరసన పులకరించే కరగి పోవని తనువేలా
కలికి సరసన పులకరించే కరగి పోవని తనువేలా
ఎడము లేక ఎదలు రెండూ ఏకమవనీ బ్రతుకేలా
ఎడము లేక ఎదలు రెండూ ఏకమవనీ బ్రతుకేలా
రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె
మౌనముగా నీ మనసును దోచిన మన్మధుడితడే కాబోలు
కన్నెక రతియే కాబోలు
మన్మధుడితడే కాబోలు

వీరాభిమన్యు --1965::శహన::రాగం

సంగీతం::KV.మహాదేవన్
రచన
::ఆరుద్ర
గానం
::ఘంటసాల,P.సుశీల

Film Directed By::V.Madhusoodhana Rao 

తారాగణం::N.T.రామారావు,కాంతారావు,శోభన్‌బాబు,కాంచన,S.వరలక్ష్మి,G.వరలక్ష్మి,పద్మనాభం,రాజనాల,నెల్లూరు కాంతారావు,దండమూడి రాజగోపాల్,ధూళిపాళ,K.సత్యనారాయణ,గీతాంజలి.

రాగం::శహన

చూచీ వలచీ చెంతకు పిలచీ
నీ సొగసులు లాలన చేసీ నీ సొంపుల ఏలిక నైతి
చూచీ వలచీ చెంతకు పిలచీ
నీ సొగసులు లాలన చేసీ నీ సొంపుల ఏలిక నైతి

చూచీ వలచీ చెంతకు చేరీ
నా సొగసులు కానుక జేసీ నీ మగసిరి బానిసనైతి
చూచీ వలచీ చెంతకు చేరీ
సొగసులు కానుక జేసీ నీ మగసిరి బానిసనైతి

చరణం::1

అందాలన్నీ దోచీ ఆనందపుటంచుల చూచీ
అందాలన్నీ దోచీ ఆనందపుటంచుల చూచీ
సందిట బందీ చేసి
సందిట బందీ చేసి
నా బందీ వశమై పోతీ

 చూచీ వలచీ చెంతకు చేరీ
సొగసులు కానుక జేసీ నీ మగసిరి బానిసనైతి

చరణం::2

నూతన వధువై నిలచీ వరుని వలపుల మధువై మారి
నూతన వధువై నిలచీ వరుని వలపుల మధువై మారి
సఖునీ ఒడిలో సురిగీ
సఖునీ ఒడిలో సురిగీ
కోటి సుఖముల శిఖరము నైతి

చూచీ వలచీ చెంతకు పిలచీ
నీ సొగసులు లాలన చేసీ నీ సొంపుల ఏలిక నైతి 

చరణం::3

వలపు తేనెల మధురిమ గ్రోలితి నిదురా జగమూ మరచీ
వలపు తేనెల మధురిమ గ్రోలితి నిదురా జగమూ మరచీ
నీవే జగమై నీలో సగమై..
నేటికి నిండుగ పండితి ...

!! చూచీ వలచీ చెంతకు పిలచీ
నీ సొగసులు లాలన చేసీ నీ సొంపుల ఏలిక నైతి

చూచీ వలచీ చెంతకు చేరీ
సొగసులు కానుక జేసీ నీ మగసిరి బానిసనైతి
 
వీరాభిమన్యు --1965

సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల

Film Directed By::V.Madhusoodhana Rao 
తారాగణం::N.T.రామారావు,కాంతారావు,శోభన్‌బాబు,కాంచన,S.వరలక్ష్మి,G.వరలక్ష్మి,పద్మనాభం,రాజనాల,నెల్లూరు కాంతారావు,దండమూడి రాజగోపాల్,ధూళిపాళ,K.సత్యనారాయణ,గీతాంజలి.

పల్లవి::

ఆ...ఆ..ఆ..
అహా..ఆహా..హా

ఓహో...ఒహొ...
అదిగో నవలోకం
వెలసే మనకోసం

అదిగో నవలోకం..వెలసే మనకోసం
అదిగో నవలోకం..వెలసే మనకోసం

చరణం::1

నీలి నీలి మేఘాల లీనమై
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
నీలి నీలి మేఘాల లీనమై
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోర వలపు సీమలో ఆగుదాం
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోర వలపు సీమలో ఆగుదాం
ఎచట సుఖముందో
ఎచట సుధ కలదో
అచటె మనముందామా..ఆ..ఆ..
అదిగో నవలోకం..వెలసే మనకోసం

చరణం::2

పారిజాత సుమదళాల పానుపూ
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపూ
పారిజాత సుమదళాల పానుపూ
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపూ
ఫలించె కోటి మురిపాలూ ముద్దులూ
మన ప్రణయానికి లేవు సుమా హద్దులూ
ఫలించె కోటి మురిపాలూ ముద్దులూ
మన ప్రణయానికి లేవు సుమా హద్దులూ
ఎచట హృదయాలూ
ఎపుడూ విడిపోవో
అచటె మనముందామా..ఆ..ఆ..
అదిగో నవలోకం..వెలసే మనకోసం
అదిగో నవలోకం..వెలసే మనకోసం